22 July 2016

చంద్ర‌న్న పాల‌న‌లో అన్నీ చందాలే..

  • కృష్ణా పుష్క‌రాల‌కు విరాళాలు సేక‌రించాల‌ని నిర్ణ‌యం
  • కాపు ప‌థ‌కాల అమ‌లుకు డొనేష‌న్‌లు
  • కాపు ప‌థ‌కాల‌కు డొనేష‌న్ల సేక‌ర‌ణ‌పై కాపు సంఘాల ఆగ్ర‌హం
  • ఇంత వ‌ర‌కూ వెళ్ల‌డించ‌ని పాత విరాళాల వివ‌రాలు

    ప్ర‌జ‌ల నుంచి ఏ రూపాయి వ‌చ్చే అవ‌కాశం ఉన్నా వ‌ద‌ల‌కూడ‌ద‌ని చంద్రబాబు ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన‌ట్టుంది. హుద్ హుద్ తుఫాను,  రాజ‌ధాని నిర్మాణం, స్మార్ట్ ఏపీ అంటూ గతంలో చందాలు పోగు చేసింది. ఆ డబ్బులన్నీ ఎటు పోయాయో ఎవరికీ తెలీదు. ఇప్పుడు తాజాగా మరో సారి చందాల సేకరణకు తెర దీశారు. 
పుష్కరాల పేరుతో కలెక్షన్లు
కృష్ణా పుష్కరాల్ని చందాల కోసం వాడుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. దాదాపు వేల కోట్ల రూపాయిల డబ్బుల్ని మంచినీళ్ల మాదిరి ఖర్చు పెట్టేందుకు ఇప్పటికే ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. మరో వైపు ప్రజల్లో భక్తి భావాన్ని క్యాష్ చేసుకొనేందుకు ఈ చందాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పుష్కరాల సమయంలో వచ్చే భక్తులకు తాగునీరు అందిస్తాం, చందాలు ఇవ్వండంటూ సెంటిమెంట్ ను క్యాష్ చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు.  కృష్ణా పుష్క‌రాల‌లో 50 ల‌క్షల మ‌జ్జిగ ప్యాకెట్‌లు,  2 కోట్ల మంచినీరు బాటిళ్ళు సిద్ధం చేయాల‌ని నిర్ణ‌యించారు.   
కాపు కార్పొరేషన్ కు విరాళాల సేకరణ
 కాపు కార్పొరేష‌న్ ద్వారా అమ‌లు చేసే ప‌థ‌కాల‌కు కూడా చందాలు వ‌సూలు చేయాల‌ని నిర్ణ‌యించారు. కాపు కార్పొరేష‌న్ భ‌వ‌నాల నిర్మాణం, విద్యా ప‌థ‌కాల‌కు విరాళాలు సేక‌రిస్తున్నారు. అధికారికంగా కాపు కార్పొరేష‌న్ వెబ్‌సైట్ ద్వారా డొనేష‌న్‌లు కోరుతున్నారు. ఎక్కువ చందాలు ఇచ్చిన వారి పేర్లు కాపు భ‌వ‌నాల‌కు పెడ‌తామ‌ని తెలిపారు. విదేశీ విధ్యా యోజ‌న ప‌థ‌కంలో విద్యార్థుల‌కు చందాల డ‌బ్బుల‌తోనే వ‌సతులు క‌ల్పించాల‌ని నిర్ణ‌యించారు. క‌నీసం రూ. 5 వేలు  త‌గ్గ‌కుండా విరాళాలు ఇవ్వాల‌ని క‌ట్టాఫ్ కూడా పెట్టారు. విరాళాలు వ‌చ్చేంత వ‌ర‌కు ప‌థ‌కాల అమ‌లుని పెండింగ్ పెట్టాల‌ని నిర్ణ‌యించ‌డం, ఎన్నడూ లేనివిధంగా కాపు కార్పొరేష‌న్ ప‌థ‌కాల‌కు చందాలు సేక‌రించ‌డంపై కాపుల‌నుంచి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. 
కలెక్షన్ పాయింట్ లు ఖరారు
పుష్క‌రాల కోసం విరాళాలు సేక‌రించ‌డానికి విజ‌య‌వాడ కార్పొరేష‌న్ కృష్ణా జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ ఆధ్వ‌ర్యంలో  యంత్రాంగాన్ని సిద్ధం చేశారు. ప్ర‌త్యేక అకౌంట్‌లును ఓపెన్ చేశారు. ఇప్ప‌టికే హుద్ హుద్ తుఫాను చందాలు, రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం, స్మార్ట ఆంధ్ర వంటి ప‌నుల‌కు చందాలు వ‌సూలు చేశారు. ఇంత వ‌ర‌కూ చందాల సేక‌ర‌ణ ద్వారా ఎంత డ‌బ్బు సేక‌రించారో ఇప్ప‌టి వ‌ర‌కు వివ‌రాలు బయట పెట్టలేదు.  ఇప్పుడు కృష్ణా పుష్క‌రాల పేరిట ఎంత మొత్తాన ప్ర‌జాధ‌నాన్ని దోచుకోబోతున్నారో అన్న మాట వినిపిస్తోంది.

No comments:

Post a Comment