30 June 2015

ప్రజల గుండెల్లో వైఎస్ : పరామర్శ యాత్రలో షర్మిల

జనం బాధను తన బాధగా భావించినందునే ప్రజల గుండెల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి చిరస్మరణీయుడిగా నిలిచిపోయారు.. నాన్న మరణించి ఆరేళ్లయినా..అదే ఆప్యాయత కనబరుస్తున్నారంటే ఆయన చేసిన మంచి పనులే అందుకు కారణం అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల అన్నారు. రంగారెడ్డి జిల్లాలో పరామర్శ యాత్ర ప్రారంభించిన ఆమె.. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన మూడు కుటుంబాలను పరామర్శించారు.  చౌరస్తాలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన షర్మిల..అక్కడ్నుంచి నేరుగా జిల్లెలగూడ గ్రామానికి చేరుకొని వైఎస్ మరణాన్ని తట్టుకోలేక గుండెపోటుతో మరణించిన బి.అంజయ్య యాదవ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అరగంట పాటు వారితో గడిపిన షర్మిల..అందరినీ పేరుపేరునా పలకరించి, వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. అక్కడ్నుంచి పరామర్శ యాత్ర రంగారెడ్డి జిల్లా మంఖాల్‌కు చేరుకుంది. ఈ గ్రామంలోని  జోసఫ్ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు.

 రైతుల హృదయాల్లో చెరగని ముద్ర
 దండుమైలారంలో వైఎస్సార్ తనయ షర్మిలకు ఘనస్వాగతం దక్కింది. ఊరంతా కలిసిరాగా..డప్పు వాయిద్యాల మధ్య ఆమె ప్రజలతో కలిసిసాగారు. ఈ గ్రామంలో వైఎస్ మరణాన్ని జీర్ణించుకోలేక చనిపోయిన పోకల్‌కార్ మహేశ్వర్‌జీ కుటుంబ సభ్యులను షర్మిల పరామర్శించారు.  షర్మిల వెంట  పార్టీ ప్రధాన కార్యదర్శి శివకుమార్, అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, జిల్లా అధ్యక్షుడు సురేష్‌రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు భీష్వ రవీందర్, పార్టీ రాష్ట్ర నాయకులు ఎడ్మ కిష్టారెడ్డి, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, రుక్మారెడ్డి, గాదె నిరంజన్‌రెడ్డి, గట్టు శ్రీకాంత్‌రెడ్డి,  ఏనుగు మహిపాల్‌రెడ్డి, అమృతసాగర్, గోపాల్‌రెడ్డి, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, జిన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, నల్లా సూర్యప్రకాష్, డాక్టర్ ప్రఫుల్లారెడ్డి, సూర్యనారాయణరెడ్డి, కుసుమకుమార్‌రెడ్డి, క్రిష్టియన్ మైనార్టీ అధ్యక్షుడు జార్జి హెబట్, వెల్లల రామ్మోహన్, ఐటీ విభాగం అధ్యక్షుడు సందీప్ కుమార్,  శ్రీనివాస్‌రెడ్డి, మామిడి శ్యాంసుందర్‌రెడ్డి, బి.రఘురాంరెడ్డి, రాంభూపాల్‌రెడ్డి, బొడ్డు సాయినాథ్‌రెడ్డి, ఎం.భగవంత్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు బంగి లక్ష్మణ్, షర్మిలా సంపత్, రమా ఓబుల్‌రెడ్డి, ఇరుగు సునీల్ కుమార్, ఎండీ సలీం, డోరెపల్లి శ్వేత, ప్రచార కమిటీ విభాగం కార్యదర్శి డి.అమరనాథ్‌రెడ్డి, జి.వెంకట్‌రెడ్డి, ఆర్.సతీష్‌రెడ్డి, ఆర్.సంతోష్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శి ఆర్. చంద్రశేఖర్, మామిడి రామచందర్ తదితరులు పాల్గొన్నారు.దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల మంగళవారం రంగారెడ్డి జిల్లా  మేడ్చల్‌లో సాయిబాబాగౌడ్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం వారికి తాము అండగా ఉంటామని సాయిబాబాగౌడ్ కుటుంబ సభ్యులకు షర్మిల భరోసా ఇచ్చారు. పరామర్శ యాత్రలో భాగంగా రెండో రోజు కండ్లకోయ, కేసారం, మాడుచింతలపల్లి, లక్ష్మాపూర్ గ్రామాల్లోని వైఎస్ మృతిని తట్టుకోలేక మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను షర్మిల పరామర్శించారు.

No comments:

Post a Comment