30 June 2015

మట్టి ని వదలని పచ్చ చొక్కాలు..!

తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ పచ్చ చొక్కాలు అన్ని రకాలుగా ఆదాయ మార్గాల్ని వెదకుతున్నారు. ప్రభుత్వం బాగా ప్రచారం చేసి ప్రారంభించిన నీరు - చెట్టు పథకం ఇప్పుడు తెలుగు తమ్ముళ్లకు కాసులు కురిపిస్తోంది. నిబంధనలకు తూట్లు పొడిచి మట్టి నుంచి డబ్బులు పిండుతున్నారు.
 పథకం ఉద్దేశ్యం
 రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువుల్ని పున రుద్ధరించేందుకు దీన్ని సంకల్పించారు. ఇందులో భాగంగా చెరువుల్ని గుర్తించి, వాటిల్లోంచి పూడికను తీస్తున్నారు. అయితే ఇందుకు స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. చెరువుల్లోంచి తీసిన మట్టిని అక్కడే కట్టల్ని బలోపేతం చేసేందుకు వినియోగించాలి. ఆ పని పూర్తయ్యాక ఇంకామట్టి మిగిలిపోతే చెరువు కింద పొలాల్లోకి రైతులు వాడుకోవచ్చు. లేదంటే పేదల ఇళ్ల స్థలాలు మెరక వేసుకొనే వీలు ఉంటుంది. అదే సమయంలో చెరువులో పూర్తిగా గోతులు తీసేస్తే మనుషులు మునిగి చనిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి దీన్ని ఒక మీటరు లోతు వరకే తవ్వాలన్న నిబంధన విధించారు. ఈ నిబంధనలు అన్నీ బాగానే ఉన్నాయి. వీటిని పుస్తకాల్లో భద్రంగా ఉంచేసి, తెలుగు తమ్ముళ్లు అడ్డగోలుగా చెలరేగిపోతున్నారు.
 అడ్డగోలు తవ్వకాలు
 నీరు - చెట్టు పథకాన్ని ప్రారంభించిన వెంటనే తెలుగు తమ్ముళ్లు రంగంలోకి దిగిపోయారు. ఎక్కడికక్కడ పెద్ద చెరువుల్ని గుర్తించి పనుల్ని దక్కించుకొన్నారు. నిబంధనల్ని పక్కన  పెట్టేసి, అన్ని చోట్ల పనుల్ని తెలుగుదేశం నేతలకే అప్పగించే శారు. దీంతో తెలుగు తమ్ముళ్లు ఎడాపెడా మట్టిని తవ్వి పోస్తున్నారు. ఎక్కడికక్కడ మట్టిని తీసేసుకొంటున్నారు. జిల్లాల్లో ఇప్పుడు నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. చెరువుల్లోని మట్టికి డిమాండ్ బాగా ఉంది. దీంతో ఈ మట్టిని అడ్డగోలుగా విక్ర యిస్తున్నారు. బహిరంగంగా దోపిడీ జరుగుతున్నా అడ్డుకొనే వారు లేకుండా పోయారు.
 అధికారులకు బెదిరింపు
 వాస్తవానికి ఇది నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో జరగాలి. కేటాయింపులన్నీ జన్మభూమి కమిటీల పేరుతో చేసేశారు. అసలే ఈ కమిటీల్లో ఉండేవారంతా తెలుగుదేశం నాయకులే. ఈ నేతలంతా కలిసి కుమ్మక్కై తమకు కావలసిన వారికి పనులు అప్పగించేశారు. తరవాత నిబంధనలు సరి చూడాల్సిన అధికారులకు బెదిరింపులు తప్పటం లేదు. అధికార పక్షం బెదిరింపులకు తట్టుకోలేక అధికారులు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. కొన్ని చోట్ల అధికారుల్ని బలవంతంగా సెలవు మీద పంపిస్తున్నారంటే ఈ మాఫియా ఏ స్థాయిలో చెలరేగిపోతోందో అర్థం చేసుకోవచ్చు.
 జిల్లాల వారీగా దుర్వినియోగం వివరాలు ఇలా ఉన్నాయి.
 1. కృష్ణా - రూ. 100 కోట్లు
 2. గుంటూరు - రూ. 15 కోట్లు
 3. ప్రకాశం - రూ. 10 కోట్లు
 4. నెల్లూరు - రూ. 50 కోట్లు
 5. కర్నూలు - రూ. 1.50 కోట్లు
 6. అనంతపురం - రూ. 2.50 కోట్లు
 7. చిత్తూరు - రూ. 10 కోట్లు
 8. వైఎస్సార్ కడప - రూ. 3 కోట్లు
 9. ప.గోదావరి - రూ. 30 కోట్లు
 10. తూ. గోదావరి - రూ. 6 కోట్లు
 11. విశాఖపట్నం - రూ. 5 కోట్లు
 12. శ్రీకాకుళం - రూ. 1 కోటి
 13. విజయనగరం - రూ. 2కోట్లు

No comments:

Post a Comment