2 March 2016

రాజధాని లో చినబాబు మాఫియా..!

  • బినామీలు: వేమూరు రవికుమార్, తదితరులు
  • కొనుగోలు 500 ఎకరాలు
  • చెల్లించినది రూ. 50 కోట్లు
  • ప్రస్తుత విలువ  రూ. 650 కోట్లు


రాజధాని ప్రాంతంలో తెలుగుదేశం నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సాగించిన భూకుంభకోణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేశ్‌ది ప్రధాన పాత్ర. ఆయన తన బినామీల్లో అత్యంత ప్రధానమైన వేమూరు రవికుమార్ ప్రసాద్ పేరుతో భారీగా భూములు కొనుగోలు చేశారు. ఎకరా, రెండెకరాలు వేర్వేరు పేర్లతో అగ్రిమెంట్లు రాయించుకుని,రాజధాని ప్రకటన వచ్చాక తాపీగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. చినబాబు రాజధాని ప్రాంత రైతుల నెత్తిన కుచ్చు టోపీ ఎలా పెట్టారో మీరూ చదవండి...

బినామీ పేర్లతో 500 ఎకరాల కొనుగోలు
రాజధానిపై శాసనసభలో సెప్టెంబర్ 4న ప్రకటన చేయకముందే.. ప్రధాన రాజధాని ప్రాంతం(కోర్ కేపిటల్)కు సమీపంలో ఉండే అమరావతి మండలంలో లోకేశ్ బినామీ వేమూరు రవికుమార్ భారీ ఎత్తున భూముల కొనుగోలుకు తెరతీశారు. అమరావతి మండలం ధరణికోటలో 59/ఎ2/1, 59/ఎ2/2ఎ, 59/ఎ2/2బి1, 59/ఎ2/3ఎ, 59/ఎ/2, 59/బి, 61/ఎ1, వైకుంఠపురంలో 25 సర్వే నంబర్లలో 502.31 ఎకరాలకుపైగా భూమిని డాక్టర్ వేమూరు రవికుమార్ ప్రసాద్, ఆయన భార్య అనురాధ, గోష్పాది గ్రీన్‌ఫీల్డ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, నెట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తదితర సంస్థల పేర్లతో కొనుగోలు చేశారు. ఎకరానికి  కనిష్టంగా రూ.5 లక్షల నుంచి గరిష్టంగా రూ.9 లక్షలు మాత్రమే చెల్లించారు. రైతులకు అరకొరగానే అడ్వాన్సులు ఇచ్చారు. ఆగస్టు 5, 2015న తక్కిన పైకం చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇంతటితో ఆగలేదు.
 
బ్లాక్ మనీని వైట్‌గా మార్చుకున్నారిలా..
అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోచుకున్న సొమ్మును వైట్ మనీగా మార్చుకోవడానికి లోకేశ్ తన బినామీలతో వ్యూహాత్మకంగా పావులు కదిపారు. అమరావతి మండలం ధరణికోట, వైకుంఠపురం పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ మార్కెట్ రేటు ఎకరం భూమి రూ.7 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఉంది. కానీ.. వేమూరు రవికుమార్, ఆయన భార్య అనురాధ, గోష్పాది గ్రీన్‌ఫీల్డ్స్ ప్రైవేటు లిమిటెడ్ తదితర సంస్థల పేరుతో కొనుగోలు చేసిన భూముల విలువను ఎకరా రూ.71,20,108  మేర డాక్యుమెంట్‌లో చూపించడం గమనార్హం. అంటే పది రెట్లు మార్కెట్ రేటు పెంచి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. తద్వారా బ్లాక్ మనీని వైట్‌గా మార్చుకున్నట్లు స్పష్టమవుతోంది.
 
ఎవరీ రవికుమార్?
ఈవీఎంలు చోరీ చేసి, ట్యాంపరింగ్ చేసి భారత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేందుకు యత్నించిన వేమూరు హరికృష్ణ ప్రసాద్ సోదరుడే వేమూరు రవికుమార్. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున సోషల్ మీడియాలో ప్రచార బాధ్యతలను వేమూరు హరికృష్ణ ప్రసాద్ నిర్వర్తించారు. టీడీపీ, హెరిటేజ్ ఫుడ్స్, ప్రభుత్వ ఐటీ వ్యవహారాలను పర్యవేక్షించే వేమూరు హరికృష్ణ ప్రసాద్‌ను.. చంద్రబాబు అధికారం చేపట్టగానే ఈ-గవర్నెన్స్ అథారిటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఏజెన్సీ, ఇన్నోవేషన్ సొసైటీల్లో సభ్యునిగా నియమించారు. రూ.333 కోట్లతో చేపట్టిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు తొలి దశ టెండర్ల మదింపు, పర్యవేక్షణ కమిటీల్లో సభ్యునిగా నియమించారు. వేమూరు రవికుమార్ సార్వత్రిక ఎన్నికల ముందు చంద్రబాబు అమెరికా పర్యటనకు ఏర్పాట్లు చేశారు. అందుకు క్విడ్ ప్రోకోగా చంద్రబాబు అధికారంలోకి రాగానే సెప్టెంబర్ 9న రవికుమార్‌ను ప్రభుత్వ సలహాదారు (ప్రవాస తెలుగు ప్రజల వ్యవహారాలు, సేవలు, పెట్టుబడులు)గా నియమించారు. ఇప్పుడు ఆ రవికుమార్, ఆయన భార్య, సంస్థల పేర్ల తో 500 ఎకరాలకుపైగా భూములను కొనుగోలు చేశారు.

No comments:

Post a Comment