29 August 2016

భగీరథయత్నం.. మహానేత జలయఙ్ఞం

ప్రతీ ఎకరాకు సాగునీరు లక్ష్యంగా పనిచేసిన మహానేత
() పరిపాలనలో సాగునీరు, వ్యవసాయం కు పెద్ద పీట
() రైతు బాంధవుడిగా నిలిచిన వైయస్సార్

దేశానికి అన్నపూర్ణగా భాసిల్లిన తెలుగు నేల కరవు కాటకాలతో పట్టెడన్నం కోసం అలమటించింది. పది మంది ఆకలిని తీర్చే అన్నదాత ఆకలికేకలు పెట్టాడు. సేద్యం పడకేయడం.. అప్పుల భారం ఉరితాళ్లకు వేలాడేలా కర్షకులను పురిగొల్పాయి. మహాప్రస్థానం పేరుతో నిర్వహించిన పాదయాత్రలో అడుగడుగునా విషాదగీతాలు మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డిని కదలించాయి. అధికారంలోకి వస్తే ఉప్పు సంద్రం పాలవుతోన్న వరద నీటిని ప్రాజెక్టుల ద్వారా మళ్లించి.. ప్రతి ఎకరాకు నీళ్లందించి.. కరవు రక్కసిని తరిమికొడతానని బాస చేశారు.

         తెలుగు నేల మీద రైతుల గురించి, సాగునీటి అవసరాల గురించి చిత్త శుద్ధితో ఆలోచించిన ఘనత దివంగత మహానేత డా. వైయస్ రాజశేఖర రెడ్డికి దక్కుతుంది. ప్రతీ కుటుంబానికి ఇల్లు, ప్రతీ ఎకరాకు సాగునీరు అన్నదే తమ లక్ష్యంగా ఆయన పనిచేశారు. అందుకే ఆయన అపర భగీరథునిగా నిలిచారు.  అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట మేరకు రూ.1,33,730 కోట్ల అంచనా వ్యయంతో 86 ప్రాజెక్టులను చేపట్టారు. ఇందులో 85 ప్రాజెక్టులను ప్రారంభించి.. 97.69 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటూ మరో 23.53 లక్షల ఎకరాలు ఆయకట్టును స్థిరీకరించాలని నిర్ణయించారు.
             
                 ఉమ్మడి రాష్ట్రానికి 2004 వరకూ అధికారంలో ఉన్న ఏ ముఖ్యమంత్రి సాగునీటి రంగానికి సముచిత ప్రాధాన్యం ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ. అప్పటికి 9 ఏళ్లుగా పరిపాలిస్తున్న చంద్రబాబు నాయుడు ఈ రంగాల్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేశారు.  వైయస్‌ రాజశేఖరెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించగానే సాగునీటి రంగానికి పెద్దపీట వేశారు. బడ్జెట్‌లో సింహభాగం నిధులను ప్రాజెక్టులకు కేటాయించారు. ఆ నిధులను సద్వినియోగం చేసుకునేలా ప్రాజెక్టుల పనులను శరవేగంగా పూర్తి చేయడానికి ప్రయత్నించారు.

జలయజ్ఞంతో  ఊపిరి
ప్రతీ కుటుంబానికి ఇల్లు, ప్రతీ ఎకరాకు సాగునీరు అన్నదే తమ లక్ష్యంగా వైయఎస్ఆర్ పనిచేశారు. తెలుగు నేల మీద జలయజ్ఞం అనే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి అపరభగీరథునిగా నిలిచారు. జయహో వైయస్సార్ అనిపించుకున్నారు. సాగునీటి ప్రాజెక్టులను కొన్ని ప్యాకేజీలుగా విడగొట్టారు. వేగంగా పూర్తయి, ఎక్కువ ప్రాంతాలకు సాగునీరు ఇచ్చే ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలకు మొదటి ప్రాధాన్యం ఇచ్చారు. తద్వారా వీటి ద్వారా నేరుగా రైతులకు ప్రయోజనం కలిగే అవకాశం ఏర్పడింది.   

       వైయస్‌ హాయాంలో పూర్తయిన ప్రాజెక్టులు
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
ప్రాజెక్టు పేరులబ్దిపొందిన జిల్లా
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
భూపతిపాలెం రిజర్వాయర్‌-  తూర్పుగోదావరి
చాగల్నాడు-  తూర్పుగోదావరి
పెద్దగడ్డ రిజర్వాయర్‌- విజయనగరం
సురంపాలెం రిజర్వాయర్‌ - తూర్పుగోదావరి
మద్దువలస - శ్రీకాకుళం
పెద్దెరు రిజర్వాయర్‌- విశాఖపట్టణం
కొవ్వడకాల్వ- పశ్చిమగోదావరి
రామతీర్థం రిజర్వాయర్‌ - ప్రకాశం
స్వర్ణముఖి బ్యారేజి- నెల్లూరు
వెలిగల్లు   -    కడప
ఆలిసాగర్‌   -   నిజామాబాద్‌
గుత్పా  -    నిజామాబాద్‌
సుద్దవాగు  -    ఆదిలాబాద్‌
నెట్టెంపాడు ఎత్తిపోతల  -    మహబూబ్‌నగర్‌
బీమా ఎత్తిపోతల   -  మహబూబ్‌నగర్‌
కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతల   -  మహబూబ్‌నగర్‌
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
వైఎస్‌ హాయాంలో పాక్షికంగా పూర్తయి...నీటిని విడుదల చేసిన ప్రాజెక్టులు 
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
ప్రాజెక్టు పేరులబ్ది పొందిన జిల్లా
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
వంశధార - శ్రీకాకుళం
జంఝావతి - విజయనగరం
తోటపల్లి - విజయనగరం, శ్రీకాకుళం
పుష్కరం-  తూర్పుగోదావరి
తాడిపూడి - పశ్చిమగోదావరి
వెంకటనగరం- తూర్పుగోదావరి
ముసురుమిల్లి- తూర్పుగోదావరి
గుండ్లకమ్మ   -   ప్రకాశం
సోమశిల  - నెల్లూరు, ప్రకాశం
తెలుగుగంగా కర్నూలు-  కడప, చిత్తూరు
గురురాఘవేంద్ర    -     కర్నూలు
ఎస్‌ఆర్‌బిసి - కర్నూలు, కడప
పులివెందుల - బ్రాంచికెనాలకర్నూలు, కడప
హంద్రీ–నీవా - కర్నూలు, అనంతపురం, చిత్తూరు
పులిచింతల - గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి
మైలవరం - కడప
ఏఎమ్మార్పీ - నల్లగొండ
ఎస్సారెస్పి–2- వరంగల్, ఖమ్మం, నల్లగొండ
మత్తడివాగు - ఆదిలాబాద్‌
దేవాదుల - వరంగల్‌
గొల్లవాగు - ఆదిలాబాద్‌
రాలివాగు - ఆదిలాబాద్‌
కిన్నెరసాని - ఖమ్మం
కల్వకుర్తి ఎత్తిపోతల - మహబూబ్‌నగర్‌
ఎల్లంపల్లి- కరీంనగర్‌
మధ్యమానేరు- కరీంనగర్‌

సాగునీటి ప్రాజెక్టుల పురోగతి
చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో హంద్రీనీవాకు కేవలం రూ.13 కోట్లే ఖర్చు చేశారు. దివంగత నేత వైయస్సార్ అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టుకు రూ.6,800 కోట్లు ఖర్చు చేసేందుకు నిర్ణయించారు. 

రాయలసీమలోని మరో ప్రాజెక్టు గాలేరు-నగరిపైనా చంద్రబాబుకు ఏవూత్రం ప్రేమ లేదు. తొమ్మిదేళ్ల పాలనలో గాలేరు-నగరికి రూ.17 కోట్లు కేటాయిస్తే.. వైఎస్‌ఆర్ హయాం, తర్వాతి ప్రభుత్వాల హయాంలో రూ.4,600 కోట్లు ఖర్చు చేశారు.   గాలేరు-నగరిలో ఎంత పెండింగ్ పనులు ఉన్నాయో చూస్తే అర్థవువుతుంది . 

1996లో వెలిగొండ ప్రాజెక్టును నిర్మిస్తానని బాబు టెంకాయ కొట్టారు. ఎన్నికల తర్వాత ప్రాజెక్టును గాలికొదిలేశారు. బాబు తొమ్మిదేళ్లలో కేవలం రూ.13 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే ఏడాదికి రూ.2 కోట్లు కూడా ఖర్చు చేయులేదన్నవూట. వైయస్‌ఆర్ ఏకంగా రూ.3 వేల కోట్లు కేటాయించారు. 
 
పోలవరాన్ని అడ్డుకునే కుట్ర!
బంగారంలాంటి పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ప్రభుత్వం పక్కనపెట్టే ప్రయుత్నం చేస్తోంది. పట్టిసీమ పేరుతో దారుణానికి పాల్పడుతోంది. పోలవరం నిర్మిస్తే గోదావరి వరద జలాల్ని 200 టీఎంసీల మేరకు నిల్వ చేసుకునే అవకాశముంది. ఇందులో 80 టీఎంసీలను  కృష్ణాడెల్టాకు మళ్లిస్తే.. ఆ మేరకు నీటిని   శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి హంద్రీ-నీవా, గాలేరు-నగరికి మళ్లించుకుని రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లు పారించుకోవచ్చు. అయితే ఈ పని చేయుకుండా పట్టిసీమ పేరుతో చంద్రబాబు నాటకం ఆడుతున్నారు.     
 
వైయస్సార్ తోనే సాధ్యం
దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి చలవతోనే అనేక ప్రాజెక్టులు, పథకాలు ఒక కొలిక్కి వచ్చాయి. పట్టి సీమ కూడా వైయస్సార్ చలవతో పూర్తి అయిన పోలవరం కుడి కాల్వ ద్వారా మాత్రమే సాద్యం అయింది. వైయస్సార్ చేపట్టిన ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలకు ప్రారంభోత్సవాలు చేసి చంద్రబాబు మురిసిపోతుండడం ఇంతకన్నా దారుణం మరొకటి ఉండదు
                    ఇక చెరువులు వంటి చిన్ననీటి పారుద‌ల‌కు సంబంధించి వైయ‌స్ ప్ర‌భుత్వం 2004-09 మ‌ధ్య రూ. 2,266,40 కోట్ల‌ను బ‌డ్జెట్‌లో కేటాయించి రూ. 1,679.85 కోట్లు ఖ‌ర్చు పెట్టింది. 3,75,116 ఎక‌రాల ఆయ‌కట్టును ఏర్ప‌ర్చింది. 11,21,411ఎక‌రాల్ని స్థిరీక‌రించింది. దీనితో రైతు ఆదాయాలు, ఆహార ఉత్ప‌త్తులు పెరిగాయి. 
            అంతిమంగా దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి చొరవ తోనే పనులు ఒక కొలిక్కి వచ్చాయి. భారీ, మధ్యతరహా, చిన్న తరహా నీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు, చెరువులు, జలాశయాల పనుల్ని ఒక కొలిక్కి తెచ్చారు. కొంత మేరకైనా రైతులకు సాగునీరు అందుతోందంటే, దాని ఖ్యాతి దివంగత మహానేత కు దక్కుతుంది. 

No comments:

Post a Comment