11 August 2016

చివ‌రి దాకా పుష్క‌రాల ప‌నుల్ని నాన‌బెట్టిన ప్ర‌భుత్వం

  • నామినేష‌న్ ద్వారా ద‌క్కించుకొనేందుకు టీడీపీ నేత‌ల‌కు అవ‌కాశం
  • నాసిర‌కం ప‌నుల‌తో సాగిస్తున్న హ‌డావుడి
  • కోట్లు కొల్ల‌గొడుతున్న చంద్ర‌బాబు అనుచ‌రులు

విజ‌య‌వాడ‌: పుష్కరాల గడువు రోజుల నుంచి గంటలకు వచ్చేసింది. అయినా  పుష్కర పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నా యి. ప్రధాన ఘాట్ల పనులూ ఇంకా పూర్తికాలేదు. పుష్కర నగర్‌లదీ అదే పరిస్థితి. భక్తులకు సౌకర్యాలు, వసతులు ఇంకా ఏర్పాటు కాలేదు. బ్యూటిఫికేషన్, విద్యుదీకరణ పనులూ పెండింగ్‌లోనే ఉన్నాయి. మ‌హిళ‌లు దుస్తులు మార్చుకునేందుకు ఏర్పాటు చేసే గ‌దుల నిర్మాణాలు ఇప్ప‌టికీ అసంపూర్తిగానే ఉన్నాయి. వీఐపీ ఘాట్‌గా ప్ర‌క‌టించిన పున్న‌మికి వెళ్లేందుకు ర‌హ‌దారి ప‌నులు న‌త్త‌న‌డ‌క‌న కొసాగుతున్నాయి. ఇప్ప‌టికీ ఏ ఘాట్‌లోను మ‌రుగుదొడ్లు పూర్తిస్థాయిలో ఏర్పాటు కాలేదు. 
పుష్క‌రాల‌కు ప్ర‌ధాన కేంద్రంగా భావిస్తున్న విజ‌య‌వాడ‌ను చూస్తే ఈ సంగ‌తి అర్థం అవుతుంది. 

దుర్గా ఘాట్ 
దుర్గా ఘాట్ వ‌ద్ద సీఎం క‌మాండ్ కంట్రోలు రూం ప‌నులు ఇంకా కొన‌సాగుతూనే ఉన్నాయి. ర‌హ‌దారిపై ప‌నులు న‌త్త‌న‌డ‌క‌న సాగాగా... ఘాట్‌లో టైల్స్ ప‌ని ఇంకా మొద‌లు కానేలేదు. సీఎం ప‌ర్య‌వేక్ష‌ణ‌కై కంప్యూట‌ర్లు, సాంకేతిక ప‌రిక‌రాలను ఇంత‌వ‌ర‌కూ ఏర్పాటు చేయ‌క‌పోగా... మంచినీటి సదుపాయం కూడా క‌ల్పించ‌లేదు.

కృష్ణ‌వేణి ఘాట్‌
కృష్ణ‌వేణి ఘాట్‌లో ఇంత‌వ‌ర‌కు సిమెంట్ ప‌నులు పూర్తికాలేద‌నే చెప్ప‌వ‌చ్చు. విద్యుత్ స‌ర‌ఫ‌రా, సీసీ కెమెరాల వ్య‌వ‌స్థ‌ను స‌రి చేయ‌లేదు. భారీ కెడింగ్ చేయాల్సి ఉన్న అధికారుల్లో మాత్రం ఎటువంటి చ‌ల‌నం రావ‌డం లేదు. ఇక వీఐపీ ఘాట్ ఎంపిక చేసిన పున్న‌మి ఘాట్‌లో ఇప్ప‌టికీ ర‌హ‌దారి ప‌నులు పూర్తి కాలేదు. ఘాట్ ప్రాంతంలో హ‌రిత బెరం పార్కులో ఫుట్‌పాత్ నిర్మాణం చేయాల్సి ఉంది. 

గొల్ల‌పూడి - ప‌విత్ర సంగ‌మం
గొల్ల‌పూడి ఘాట్ నిర్మాణం పూర్త‌యింది. టైల్స్ స‌గభాగం అంటించారు. గుంటుప‌ల్లి ఘాట్లోనూ ఇదే ప‌రిస్థితి. తుమ్మ‌ల‌పాలెంలో పూర్త‌యినా ఘాట్ ప‌గిలిపోయింది. ఈ ఘాట్‌కు వ‌చ్చే వాహ‌నాల పార్కింగ్‌. మంచినీటి స‌దుపాయం ఏర్పాట్లు ఇప్ప‌టికీ పూర్తి కాలేదు. ప‌విత్ర హార‌తికి 20 పంట్లు అవ‌స‌ర‌మ‌ని దేవ‌దాయ‌శాఖ‌కు తెల‌ప‌గా కేవ‌లం ఆరు పంట్లే వచ్చాయి. 

ప‌ద్మావ‌తి ఘాట్‌
ప‌ద్మావ‌తి ఘాట్‌లో ఎక్క‌డా మ‌రుగుదొడ్ల ఏర్పాటు చేయ‌లేదు. అక్క‌డ‌క్క‌డ ఏర్పాటు చేసిన మ‌రుగుదొడ్ల‌కు సైతం పైప్‌లైన్‌, విద్యుత్ క‌నెక్ష‌న్లు ఇవ్వ‌లేదు. ఇంకా వంద అడుగుల దూరం మెట్లు నిర్మించాల్సి ఉన్న అధికారులు మాత్రం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లు వ్య‌వ‌హరిస్తున్నారు. మంచినీటికి సంబంధించి ఒక్క కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసిన పాపాన పోలేదు. 

వ్యూహాత్మ‌కంగా త‌ప్ప‌ట‌డుగులు
చాలా వ‌ర‌కు ప‌నులు చివ‌రి దాకా తేల్చ‌కుండా ఆపేశారు. దీంతో టెండ‌రింగ్ వ్య‌వ‌స్థ ను ప‌క్క‌న పెట్టేయ‌గ‌లిగారు. నామినేష‌న్ ప‌ద్ద‌తిలో ప‌నుల్ని ద‌క్కించుకొని ముందుకు వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకొన్నారు. చివ‌రి రోజుల్లో చ‌క చ‌క టీడీపీ నాయ‌కులు అడిగిన వారికి అడిగినంత‌గా చెల్లింపులు సాగిపోతున్నాయి. వంద‌ల కోట్ల రూపాయిల్ని దోచేసుకొంటున్నారు. అర కొర‌గా ప‌నులు చేస్తున్నా అధికారులు అడిగే ధైర్యం చేయ‌లేక పోతున్నారు. దీంతో టీడీపీ నేత‌లు ఆడింది ఆట‌, పాడింది పాట గా త‌యారైంది. 

No comments:

Post a Comment