7 April 2016

పులివెందులలో ప్రతిపక్ష నేత పర్యటన

వైఎస్ జగన్ కు జన నీరాజనం
ప్రజాసమస్యలపై ప్రత్యేక దృష్టి
సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి


వైఎస్సార్ జిల్లా: ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పులివెందులలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. జననేతకు ప్రజలు, పార్టీశ్రేణులు, అభిమానులు నీరాజనం పడుతున్నారు. ఈసందర్భంగా వైఎస్ జగన్ కు తమ సమస్యలు విన్నవించుకుంటున్నారు. ప్రజల కష్టాలను తెలుసుకుంటూ వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారు. ఏడాది గ‌డిచినా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠ‌శాల‌ల్లో ప‌ని చేస్తున్న కాంట్రాక్టు ఉపాధ్యాయుల‌కు  43 శాతం పీఆర్సీ అంద‌లేద‌ని, వారిని శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న రెగ్యూల‌రైజేష‌న్ చేయాల‌ని  వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. 


గురుకులాల్లో ప‌ని చేస్తున్న ఉపాధ్యాయుల‌కు పీఆర్‌సీ అంద‌క‌పోవ‌డం విచార‌క‌ర‌మ‌ని అన్నారు. సోష‌ల్ వెల్ఫేర్ రెసిడెన్షియ‌ల్ ఎంప్లాయిస్ ఫెడ‌రేష‌న్ జోన‌ల్ సెక్ర‌ట‌రీ సురేష్‌బాబు, జిల్లా నాయ‌కులు సుబ్బ‌య్య‌, లోక‌నాథ‌రెడ్డి, రామాంజ‌నేయరెడ్డి,  మ‌ద‌న్‌మోహ‌న్ త‌దిత‌రులు వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిశారు. పీఆర్‌సీ, రెగ్యుల‌రైజేష‌న్ విష‌యంలో ప్ర‌భుత్వం మాట త‌ప్పుతోంద‌ని జననేత మండిపడ్డారు. ఈ విష‌యంలో టీడీపీ సర్కార్ పై ఒత్తిడి తీసుకొస్తామని  వైఎస్ జ‌గ‌న్ వారికి హామీ ఇచ్చారు. 

స్వ‌ర్ణ‌కారుల సంఘం జిల్లా అధ్య‌క్షుడు రామ్మోహ‌న్ వైఎస్ జ‌గ‌న్‌ను పులివెందులలో కలుసుకున్నారు. బంగారం కొనుగోలుపై కేంద్రం విధించిన నిబంధ‌నల‌తో అవ‌స్థ‌లు ప‌డుతున్న‌ట్లు చెప్పారు. దీనిపై స్పందించిన వైఎస్ జ‌గ‌న్ స్వ‌ర్ణ‌కారుల ఉద్య‌మానికి సంపూర్ణ మ‌ద్ద‌తు తెలిపారు. బంగారం కొనుగోలుపై కేంద్ర ప్ర‌భుత్వం విధించిన ఎక్పైజ్ సుంకం.. ష‌రాబులు, స్వ‌ర్ణ‌కారుల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తోంద‌ని  వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అన్నారు. ఈ సుంకాన్ని ర‌ద్దు చేయాల‌ని కోరుతూ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి లేఖ రాయ‌నున్న‌ట్లు వైఎస్ జగన్ వివ‌రించారు. స్వ‌ర్ణ‌కారుల సంఘం నేత‌లు ఆకుల రాజ‌మోహ‌న్‌, స‌య్య‌ద్ స‌లావుద్దీన్‌, రాజారెడ్డి, రామ్మోహ‌న్‌, కె.వ‌.ప్ర‌సాద్‌, ప‌ట్టాభిరాం జననేత హామీ పట్ల హ‌ర్షం వ్య‌క్తం చేశారు. 

No comments:

Post a Comment