12 September 2016

బాబు కాలర్ పట్టుకొని నిలదీస్తాం

  • చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలు, మోసాలే
  • బాబు కుట్రలను ప్రజలు తిప్పికొట్టారు
  • టీడీపీ, బీజేపీలను వ్యతిరేకిస్తూ బంద్ ను విజయవంతం చేశారు
  • బంద్ లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికీ నా ధన్యవాదములు
  • కలిసికట్టుగా పోరాడి హోదాను సాధించుకుందామన్న వైయస్ జగన్ 
హైదరాబాద్ః రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించడం కోసం ఎందాకైనా పోరాటం చేస్తామని ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ అన్నారు. అసెంబ్లీలో బెంచ్ లు, బల్లాలు ఎక్కడమే కాదు అవసరమైతే హోదా కోసం బాబు కాలర్ పట్టుకొని నిలదీస్తామని అన్నారు. బంద్ ను విఫలం చేసేందుకు చంద్రబాబు ఎన్ని అడ్డంకులు సృష్టించినా విజయవంతం చేసినందుకు రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికీ వైయస్ జగన్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో వైయస్ జగన్ మాట్లాడారు. 

మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే...

()రాష్ట్రవ్యాప్తంగా బాబు ఎన్ని నిషేదాజ్ఞలు తీసుకొచ్చినా, అరెస్ట్ లు చేసిననా, బలవంతంగా బస్సులు తిప్పినా, కాలేజీలు తెరిపించినా ఐదుకోట్ల మంది ప్రజలు చంద్రబాబును , ఆయన పనులను వ్యతిరేకిస్తూ బంద్ ను విజయవంతం చేశారు. బంద్ ను సఫలీకృతం చేసిన ప్రతీ అక్క, చెల్లమ్మ, అవ్వ-తాత, సోదర సోదరీమణులు, యువకులు, వైయస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు, కమ్యూనిస్ట్ పార్టీ సోదరులు, ప్రతీ సంఘానికి పేరుపేరున ధన్యవాదాలు. 

()హోదా ఇవ్వబోము అని కేంద్రం, అరుణ్ జైట్లీ చెబుతుంటే...చంద్రబాబు దాన్ని స్వాగతిస్తున్నామని చెప్పడం సిగ్గుచేటు. బాబు, బీజేపీని తిరస్కరిస్తూ ప్రజలు తీవ్ర నిరసన తెలుపుతూ బంద్ విజయవంతం చేస్తే....బాబు అసెంబ్లీని నిరవధిక వాయిదా వేసి మండలిలో మాట్లాడిన మాటలు బాధాకరం.

()మండలిలో హోదా వల్ల ఏం ప్రయోజనం,  హోదా వల్ల ఈశాన్యరాష్ట్రాలు ఏం బాగుపడ్డాయని సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడు. చంద్రబాబు అసలు మనిషేనా 

()ఆనాడు హైదరాబాద్ పోతుంది. ఏపీ నష్టం జరుగుతోంది.  ఏపీ బాగుపడాలంటే హోదా కావాలని హామీ ఇస్తూ రాష్ట్రాన్ని విజగొట్టారు. కాంగ్రెస్ ఐదేళ్లు కాదు అంటే, బీజేపీ నేతలు పదేళ్లు అన్నారు. బాబు 15 ఏళ్లు ప్రత్యేకహోదా కావాలన్నారు.  నేను అదికారంలోకి వస్తే హోదా తెస్తానని బాబు ఎన్నికల ముందు చెప్పాడు. అధికారంలోకి వచ్చాక  మాట మారుస్తూ హోదాతో ఏం లాభమని మళ్లీ పాతపాటలే పాడుతున్నాడు. నిజంగా పాలనకు ఈమనిషి అర్హుడా అని అడుగుతున్నా..?

()బాబు నోరు తెరిస్తే అబద్ధాలు, మోసాలే. నిన్న సాయంత్రం నుంచే బంద్ విజయవంతం కాకూడదని బాబు  ఆరాటపడ్డారు. బంద్ ను ఫెయిల్ చేయడం కోసం బాబు చేసిన ప్రయత్నాలు చూస్తే ఈమనిషే హోదాకు అడ్డుతగులుతున్నాడన్నది ప్రతీ ఒక్కరికీ అర్థమైంది. హోదా ఇవ్వకపోతే  మా మంత్రులను ఉపసంహరించుకుంటామని కేంద్రానికి అల్టిమేటం  ఇవ్వకపోగా...జైట్లీ ప్రకటనను స్వాగతిస్తున్నాం. బంద్ ఫెయిల్ కావాలి. హోదా వల్ల ఏం లాభం అని బాబు మాట్లాడుతున్నాడు. 

()సీఎంగా హోదా కోసం తాపత్రయపడాల్సిన వ్యక్తి వ్యక్తిగత స్వార్థం కోసం తాకట్టు పెట్టాడు.  ఓటుకు కోట్లు కేసులో ఆడియో, వీడియో టేపులతో దొరికిపోయిన పరిస్థితుల మధ్య..ఆ కేసులనుంచి బయటపడేందుకు ఐదుకోట్లమంది ప్రజల  జీవితాలతో చెలగాట మాడుతున్నాడు. బాబు హోదాకు మంగళం పాడడాన్ని ప్రజలు తిరస్కరించారు

()ప్రత్యేకహోదా మా శ్వాస అని పోరాటపటిమ చూపినందుకు రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు. ఈపోరాటం ఇంతటితో ఆగదు. ఎన్నిరోజులైనా చేస్తాం. పాలకుల్లో మార్పు వచ్చేవరకు చేస్తాం. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న స్ఫూర్తిని తీసుకుంటాం. పార్లమెంట్ ను సాక్షిగా చేస్తూ హోదా ఇస్తామన్నారు. ఇది ఐదుకోట్ల మంది ఆంధ్రుల హక్కు. హోదా జగన్ ఒక్కడితో రాదు. తమ పోరాటంలో అందరి సహకారం కావాలి. 

()అసెంబ్లీలో జరిగిన వీడియోస్ ను అధికారపార్టీ  రిలీజ్ చేశారట. చంద్రబాబుకు చెబుతున్నాం. బల్లలు, బేంచులే కాదు హోదా కోసం అవసరమైతే బాబు కాలర్ కూడా పట్టుకుంటాం. ప్రత్యేకహోదా ఐదుకోట్ల మంది హక్కు. దాన్ని స్వాగతించడానికి ఈయనెవరు. 

()డిగ్రీ అయిపోయిన ప్రతీ పిల్లాడు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాడు. బాబు వస్తేనే జాబు వస్తుందని,  జాబు లేకపోతే నెలకు రూ.2 వేల  నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి దారుణంగా మోసం చేశాడు.  హోదా వస్తేనే అంతో ఇంతో ఉద్యోగాలొస్తాయని తెలిసి కూడా ఇవాళ దాన్ని కూడా నీరుగార్చుతున్నాడని చంద్రబాబుపై వైయస్ జగన్ నిప్పులు చెరిగారు. 

No comments:

Post a Comment