28 October 2017

పోలవరం జాప్యం టిడిపి పుణ్యమే


పోలవరం నిర్మాణ పనుల్లో అవినీతిని కేంద్రం పసిగట్టింది
విదేశీ పర్యటనలపై శ్వేతపత్రం విడుదల చేయాలి
రాజధాని నిర్మాణం రూట్‌ మ్యాప్‌ ఇవ్వాలి
రైతులను మోసం చేసేందుకు మరో డ్రామా 

విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను, చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు వైయస్‌ఆర్‌సీపీ నిందలు వేయడం దారుణమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కన్నబాబు మండిపడ్డారు.  పోలవరం ప్రాజెక్టు ఆగిపోయే ప్రమాదం ఏర్పడిందని చంద్రబాబు కొత్త పల్లవి ఎత్తుకున్నారని ఆయన విమర్శించారు. ఈ దుస్థితి ఎందుకు వచ్చిందని కన్నబాబు ప్రశ్నించారు. శనివారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2018 నాటికి పోలవరం పూర్తి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాట ఫలితంగా పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేశారన్నారు. ఈ ప్రాజెక్టును మేమే కడుతామని పట్టుబడి మరి చంద్రబాబు ప్రభుత్వం అనుమతి తీసుకుందని, ఆ తరువాత సీఎం తన  బినామీలకు కాంట్రాక్టులు కట్టబెట్టారని విమర్శించారు. కేంద్రం కంట్రాక్టుదారులను మార్చుతామంటే చంద్రబాబు ఎందుకు ఒప్పుకోవడం లేదని ప్రశ్నించారు. పోలవరానికి అయ్యే ఖర్చు కేంద్రమే భరిస్తుందని మంత్రులు, సీఎం చెప్పారన్నారు. స్వప్రయోజనాల కోసం పోలవరాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ చేస్తున్న అవినీతిని కేంద్రం పసిగట్టిందన్నారు. ఇందులో వైయస్‌ఆర్‌సీపీ చేసిందేంటో చెప్పాలని నిలదీశారు. గడ్కారిని తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్టు చూపించినా కేంద్రం సంతృప్తి చెందలేదన్నారు. పోలవరం పనులు స్తంభించి పోతే పూర్తి బాధ్యత టీడీపీదే అని చెప్పారు. కేంద్రాన్ని  ఒప్పించి పోలవరాన్ని పూర్తి చేయాలని డిమాండు చేశారు. పోలవరం వ్యవహారంపై విచారణ చేపట్టాలని వైయస్‌ఆర్‌సీపీ డిమాండ్‌ చేసింది. పొలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించకుండా ఎలా జాతీయ ప్రాజెక్టును కడుతారని ప్రశ్నించారు. అక్కడి రైతులు, గిరిజనుల పరిస్థితి ఏంటని నిలదీశారు. పోలవరం ప్రాజెక్టును నిర్ణిత సమయంలో పూర్తి చేయాలని వైయస్‌ఆర్‌సీపీ డిమాండు చేస్తుందని తెలిపారు.

ప్రచార ఆర్భాటమే
చంద్రబాబు విదేశీ పర్యటనలకు వెళ్లిన ప్రతి సారి మాయ మాటలు చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారని, ఆయన ప్రచార ఆర్భాటమే తప్పా చెప్పింది ఏమీ లేదని కన్నబాబు విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన 42 నెలల్లో చంద్రబాబు 40 విదేశీ పర్యటనలు చేశారని విమర్శించారు.  విదేశాలకు వెళ్లిన ప్రతి సారి చంద్రబాబు ఆశ్చర్యానికి గురవుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రతి సారి కళ్లబొల్లి మాటలు చెప్పడమే తప్ప ఏ ఒక్కటి సాధించలేదని కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.  విదేశీ పర్యటనలపై బాబుకు మోజు ఉందన్నారు. వెళ్లిన ప్రతి సారి విదేశాల పర్యటనలపై కబుర్లు చెప్పడం తప్ప చేసింది ఏమీ లేదు. కళ్లబొల్లి మాటలే..ప్రచార ఆర్భాటమే అని మండిపడ్డారు. విదేశాలకు వెళ్లిన ప్రతి సారి ఒప్పందాలు చేసుకున్నామని చెప్పారన్నారు. ఇప్పటివరకు  ఎన్ని పెట్టుబడులు వచ్చాయి. ఎన్ని పరిశ్రమలు వచ్చాయో ప్రకటించాలని డిమాండు చేశారు.  ఏ దేశం వెళ్తే ఆ దేశంలా చేస్తానని ప్రకటనలు ఇస్తూ ఆశ్చర్యపోతున్నారే తప్ప..చేసింది ఏమీ లేదన్నారు.  లండన్‌ వెళ్లినప్పుడు అక్కడ ట్రాఫిక్‌ నియంత్రణ విధానం చూశాం. అమరావతిలో కూడా అలాంటివి ఏర్పాటు చేస్తామని చెబుతున్నారని తెలిపారు. రాజధాని ప్రాంతంలో ఇప్పటి వరకు ఒక్క లేఅవుట్‌ చేసి రోడ్డు వేయలేదని తప్పుపట్టారు. ప్రతి సారి సినిమా డైరెక్టర్లను పిలిచి గ్రాఫిక్స్‌ చూపిస్తున్నారే తప్ప ఏమి చేయడం లేదని ఫైర్‌ అయ్యారు.  రాజధాని అన్నది ఒక ఆకాంక్ష, అందరి కల. అయితే తాత్కాలిక సచివాలయానికే చిల్లు పడిందని గుర్తు చేశారు. ఇక మీరు కట్టే రాజధాని ఎలా ఉంటుందో అన్న భయం ఉందన్నారు. ఇంతకన్న చేతకాని తనం ఉంటుందా? ఎమిరేట్స్‌ వెళ్లాను..అక్కడ అద్భుతమైన అభివృద్ధి జరుగుతుందని చెప్పారని సీఎం చెప్పినట్లు పేర్కొన్నారు.  మన రాష్ట్రానికి చెందిన పారిశ్రామిక వేత్తలే విదేశాల్లో అబ్ధుతంగా విమానాశ్రయాలు కడుతున్నారు. కనీసం ఈ రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక వేత్తలను పిలిచి వారితో మాట్లాడారా? అన్నారు.  ఇక్కడి వారితో మీరు మీటింగ్‌ పెట్టుకుంటే మీ అవినీతి బయటపడుతుందనే విదేశాలకు పరుగులు తీస్తున్నారని ఆరోపించారు. 

ఇన్నాళ్లు వ్యవసాయం గుర్తుకు రాలేదా?
చంద్రబాబుకు ఈ మూడున్నరేళ్లు వ్యవసాయ రంగం గుర్తుకు రాలేదని కన్నబాబు ధ్వజమెత్తారు. తాను విదేశాలకు వెళ్లినప్పుడు ఐటీ రంగం గురించి మాట్లాడే వాడిని... ఈ సారి  వ్యవసాయ రంగంపై మాట్లాడానని చంద్రబాబు కొత్త డ్రామాలు ఆడుతున్నారని ఫైర్‌ అయ్యారు.  ఈ మూడేళ్లలో వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏ మేరకు అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. ఇన్నాళ్లు ఎందుకు వ్యవసాయం మీదా దృష్టి పెట్టలేదని నిలదీశారు. ఈ రాష్ట్ర రైతాంగానికి ఏం చేశారని నిలదీశారు. రుణమాఫీ పూర్తిగా చేయలేదు. రైతులకు నాణ్యమైన విత్తనాలు ఇవ్వలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ పండే వరి, ఉల్లికి గిట్టుబాటు ధర కల్పించలేని మీరు విదేశీ కంపెనీలను రాష్ట్రానికి పిలవడం విడ్డురంగా ఉందన్నారు.  దీపావళి రోజు కూడా ఇంట్లో లేకుండా విదేశాల్లో ఉన్నానని, సమయం వృథా చేయకుండా విమానాల్లోనే స్నానం చేశారని గొప్పలు చెప్పారని తప్పుపట్టారు. అదే దీపావళి రోజు  రైతులు మాత్రం తుపాను వస్తుందని పొలాల్లో జాగరణ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మీరు చేసింది గొప్పా..రైతులు చేసింది గొప్పా అని సీఎంను నిలదీశారు.  టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్ని పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వచ్చాయని చెప్పాలన్నారు.  వీటిపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.  రాష్ట్రం విడిపోయిన తరువాత ఎన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఏçర్పాటు చేశారని ప్రశ్నించారు. విదేశీ మోజుతో ప్రజలను మభ్యపెడుతున్నారని తూర్పారబట్టారు. తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్తున్నారని, వాటిని కప్పిపుచ్చుకునేందుకు వైయస్‌ఆర్‌సీపీపై నిందలు వేస్తున్నారని, ప్రజలను మభ్యపెట్టేందుకు విదేశీ కబుర్లు చెబుతున్నారని విమర్శించారు. ఇక్కడ వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకొని, వారికి మంత్రి పదవులు కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు మేలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కన్నబాబు డిమాండు చేశారు. 

No comments:

Post a Comment