5 February 2018

అమరజీవికి నిజ‌మైన నివాళి


– నవంబర్‌ 1నే ఆంధ్ర రాష్ట్ర అవతవరణ దినోత్సవం నిర్వహిస్తామని నెల్లూరు ప్రజా సంకల్ప యాత్రలో చెప్పిన వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 
– మూడేళ్లలో అమరజీవి పేరెత్తని బాబు సర్కారు
– జగన్‌ నిర్ణయంపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు


ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లంతా ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగేళ్లు దాటినా అశాస్త్రీయంగా విభజన జరిగిందని చెబుతూ కాలక్షేపం చేస్తుంటే.. జగన్‌ తనదైన శైలిలో ముందుకుసాగుతున్నారు. విభజన హామీలు నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే.. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఓటుకు నోటు కేసులో దొరికి పోయి కేంద్రంతో మాట్లాడే సాహసం చేయలేకపోతున్న తరుణంలో.. వైయస్‌ జగన్‌ మాత్రం ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, పోలవరం, పోర్టుల నిర్మాణం, కేంద్రీ విద్యాసంస్థలు, కేంద్రీయ సంస్థల ఏర్పాటు వంటి ప్రధాన హామీలపై అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉన్నారు. 

అస్తమానం చరిత్ర చరిత్ర అనే గగ్గోలు పెట్టే చంద్రబాబు.. అదే చరిత్రను గుంట తీసి మన్ను పోసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పాటైన నేపథ్యాన్ని, పోరాడి సాధించుకున్న పరిస్థితులను భావితరాలకు కనిపించకుండా చేసిన కుట్రకు జగన్‌ చెక్‌ పెట్టారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్షతో సాధించిన ఆంధ్రప్రదేశ్‌ను.. విభజన నాటి నుంచి చరిత్ర పుస్తకాల్లో కనపడనీయకుండా.. ఆ మహనీయుడి పేరు వినపడనీయకుండా చేసిన.. ఆయన త్యాగాన్ని భావితరాలు స్మరించుకోనీయకుండా నాలుగేళ్లుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఏపీ చరిత్రలో నవంబర్‌ 1 అనే ఒక ముఖ్యమైన తేదీ ప్రాముఖ్యతను క్యాలెండర్‌ నుంచి కనుమరుగు చేసే ప్రయత్నాలకు జగన్‌ గట్టిగా బదులిచ్చారు. నెల్లూరు జిల్లాలో జరుగుతున్న ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌ చేసిన ప్రకటన ఇప్పుడొక సంచలనమైంది. అధికారంలోకి వస్తే నవంబర్‌ 1ని గతంలో మాదిరిగానే ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవంగా నిర్వహిస్తామని.. అమరజీవి పొట్టి శ్రీరాములు సేవలను స్మరించుకుందామని పిలుపునివ్వడం హర్షించదగ్గ పరిణామం. ఆంధ్రా విభజన జరిగినంత మాత్రాన ఏపీ అవతరణ దినోత్సవాన్ని మార్చాల్సిన అవసరం లేదు. కానీ గడిచిన మూడేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం ఏనాడూ నవంబర్‌ 1 వ తేదీని పట్టించుకున్న పాపాన పోలేదు. జపాన్, సింగపూర్, మలేసియా, అమెరికా, ఆఖరికి శ్రీలంక, జింబాబ్వేల గురించి మాట్లాడిన చంద్రబాబు.., ఒక్క పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేయలేదు సరికదా ఆయన ఫొటోలకు దండ కూడా వేయలేదు. పైగా ఆయన అమరత్వానికి కనీస గుర్తింపు కూడా ఇవ్వడం లేదు. ఈ విషయంలోనే జగన్‌ తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్రా, తెలంగాణతో సంబంధం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలంతా మెచ్చుకుంటున్నారు. 

No comments:

Post a Comment