1 February 2018

విభజన హామీలు నెరవేరుతాయనుకుని మోసపోయాం

2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పెదవి విరిచారు. ఏపీకి సంబంధించి బడ్జెట్‌లో ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... ‘బడ్జెట్‌ చూసి నిరాశకు గురయ్యాం. విభజన చట్టంలోని హామీలు అమలవుతాయని ఆశించాం. కానీ అమలు కాలేదు. ప్రత్యేక హోదా లేక పరిశ్రమలు ఒక్కటీ రాలేదు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. పోలవరం ప్రాజెక్టు మీద క్లారిటీ ఇవ్వలేదు. విశాఖ రైల్వే జోన్‌ ప్రస్తావనే రాలేదు. దుగరాజపట్నం 2018 పూర్తి చేసి ఇవ్వాలని ఉంది.. పట్టించుకోలేదు. అయితే రైతులకు మద్ధతు ధరను 1.5 రెట్లు పెంచుతామని చెప్పిన హామీ కొంచెం ఊరట కల్పించింది. 2005లో దివంగత మహానేత వైయస్‌ఆర్‌ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయడానికి పూనుకోవడం సంతోషించాల్సిన విషయం. రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పించేందుకు ముందుకు రావడం అభినందనీయమే అయినా ఏపీకి సంబందించి ఆరోగ్యశ్రీ పథకం నిర్వీర్యం అవుతోంది. మహిళలకు కొంత మేరకు చొరవ చూపింది. స్వయం సహాయ సంఘాలకు మేలు చేసేదిగా ఉన్నా.. ఇవన్నీ  దివంగత మహానేత వైయస్‌ఆర్‌ అద్భుతంగా ఆచరించి చూపించారు.   ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించకపోవడం చాలా దారుణం. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే అన్న మాట ప్రకారం రాజీనామా చేయడానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం. మేం రాజీనామా చేస్తే ఇప్పుడే ప్రత్యేకహోదా వస్తుందంటే మే సిద్ధమే. కేంద్రంలో భాగస్వామ్య పక్షంగా ఉన్న టీడీపీ దీనిపై సమాధానం చెప్పాలి. రుణమాఫీపై క్లారిటీ వస్తుందని దేశవ్యాప్తంగా రైతులు ఎదురు చూశారు. కానీ ఎలాంటి ప్రకటన రాలేదు.

No comments:

Post a Comment