1 February 2018

‘ప్రత్యేక హోదా’ను సజీవంగా నిలిపింది జగనే

– ధర్నాలు, ఆమరణ దీక్షలతో అలుపెరగని పోరాటం
– యువతలో అవగాహన కల్పించడానికి యువభేరీలు
– ఎంపీలు రాజీనామాకు వెనుకాడే ప్రసక్తే లేదని ప్రకటన 

ఏపీలో టీడీపీ ప్రభుత్వం కొలువుదీరి దాదాపు నాలుగేళ్లు కావొస్తుంది. ప్రమాణ స్వీకారం సందర్భంగా రాష్ట్ర విభజనపై చంద్రబాబు తీవ్ర ఆవేశంతో మాట్లాడారు. కొందరు ముఖ్యమంత్రులు, బీజేపీ నాయకులు, కేంద్రమంత్రుల సాక్షిగా.. ఐదున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి ఆఖరి రక్తపు బొట్టు వరకు నిర్విరామంగా కృషి చేస్తానని ప్రమాణం చేశారు. నూతన రాజధాని నిర్మాణం, రైల్వేజోన్, పోలవరం ప్రాజెక్టు వంటి ప్రధాన హామీలతోపాటు విభజన హామీలన్నీ నెరవేర్చి ఏపీని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తానని నమ్మబలికారు. గుక్క తిప్పుకోకుండా.. కళ్లార్పకుండా చంద్రబాబు చెప్పిన మాటలను.. ఎన్నికలకు ముందిచ్చిన హామీలను నెరవేరుస్తాడని అందరూ నమ్మారు. ఎన్నికలకు ముందు తిరుమల వెంకన్న సాక్షిగా ఏపీకి పదిహేను సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వాలని నినదించాడు. హామీలిచ్చి నమ్మించడంలో సక్సెస్‌ అయ్యారు. 2014కు ముందున్న పరిస్థితుల దృష్ట్యా అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి కావడం దాదాపు అసాధ్యమేనన్న నిర్ణయానికొచ్చిన చంద్రబాబు రాష్ట్ర విభజనకు కూడా వెనకాడలేదంటే.. ఆయనకు పదవి మీద ఎంత మోజో చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయాలని నేనే లేఖ రాశానని చెప్పి.. ఆంధ్రాకొచ్చి విభజన పాపం కాంగ్రెస్‌ మీదకు నెట్టేసి ఓట్ల కోసం మొసలి కన్నీరు కార్చేశాడు. ఆంధ్రాను తీర్చిదిద్దే అనుభవం నాకే ఉందని ప్రచారం చేసుకున్నాడు.. పేపర్ల నిండా పెయిడ్‌ వార్తలు రాయించుకున్నాడు.. పెయిడ్‌ ప్రచార కర్తలను గోబెల్స్‌ ప్రచారానికి జనాల్లోకి వదిలాడు. జనం మెదళ్లను తినే బాధ్యతనను వాళ్లకు అప్పగించాడు. ఎలాగైనా.. పరిస్థితులు ఎంత ఎదురుతిరిగినా ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా 600 హామీలు గుప్పించాడు. కులానికో హామీ ఇచ్చాడు. 

నాలుగేళ్ల తర్వాత...

చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన నాలుగేళ్ల తర్వాత పరిశీలిస్తే ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు జరగలేదు. చంద్రబాబుకు ఓట్లు గుప్పించిన నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాలమాఫీ, ఇంటికో ఉద్యోగం వంటి హామీలు ఒక్కటీ అమలు కాలేదు. పైగా వైయస్‌ఆర్‌ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలను విజయవంతంగా నీరుగార్చేశాడు. చౌక దుకాణాల్లో నెలకు 9 రకాల సరుకులు ఇచ్చే పరిస్థితి నుంచి ఉన్నవే ఎత్తేసే దుస్థితికి తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుది. 

15 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలని..

ఆనాడు ఎన్నికలకు ముందు ఒకరిని మించి ఒకరు ప్రత్యేక హోదా డిమాండ్‌ కోసం రొమ్ములు విరుచుకుని నిలబడ్డారు. ప్రత్యేక హోదా తీసుకురాలేకపోతే.. ఏపీ అభివృద్ధి జరగడం శూన్యం అని చెప్పిన బాబు.. అర్ధరాత్రి ప్యాకేజీకి అంగీకారం తెలిపాడు. రెండు సార్లు ప్రత్యేక హోదా కోసం అసెంబ్లీలో తీర్మాణం చేసి నిస్సిగ్గుగా ప్యాకేజీ చాలా బాగుందని చెప్పుకొచ్చాడు. పరిశ్రమల ఏర్పాటుకు పదేళ్లు ఎలా సరిపోతాయి..  పదిహేనేళ్లు కావాలని 15 ఏళ్లు కావాలన్న నోటితోనే ప్రత్యేకహోదాతో ఏమొస్తుందని ఎదురు ప్రశ్నించిన ఘనత చంద్రబాబుది. 

ఉద్యమాలు చేస్తే అణచివేత..

ప్రత్యేక హోదా కోసం వైయస్‌ఆర్‌సీపీ ఇప్పటికే 32 సార్లు ఉద్యమాలు చేసింది. పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. యువభేరీల పేరుతో 10 చోట్ల విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ప్రత్యేక హోదా అవసరాన్ని వివరిస్తూ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధిని.. అక్కడ టీడీపీ నాయకులు చే స్తున్న వ్యాపారాలను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక హోదా వస్తే వచ్చిన ఉద్యోగాలు, వచ్చిన పెట్టుబడులు, పెరిగిన రెవన్యూ వంటి అన్ని అంశాలను లెక్కలతో సహా వివరించారు. హక్కుగా రావాల్సిన ప్రత్యేక హోదాను ఇచ్చి తీరాలని ప్రధానమంత్రి, రాష్ట్రపతి సహా అన్ని పార్టీల అధ్యక్షులను కలిసి మద్ధతు ప్రకటించాలని విన్నవించారు. ప్రత్యేక హోదా కోసం విశాఖలో నిర్వహిస్తున్న కొవ్వొత్తుల ర్యాలీకి వెళ్లి అరెస్టయ్యారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పటికీ ప్రత్యేక హోదా అనే నినాదం సజీవంగా ఉందంటే అది కేవలం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైయస్‌ఆర్‌సీపీ పోరాటమేనని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇటీవల జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమేనని స్పష్టం చేశారు. 

No comments:

Post a Comment