1 February 2018

ఈ కేటాయింపులతో అభివృద్ధి సాధ్యమేనా ..?

కేంద్ర బడ్జెట్‌లో ఏపీ గురించి ప్రస్తావనే లేదు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో వెనుకడుగు వేశారని వైయస్ ఆర్ సీపీ ఎంపి విజయసాయిరెడ్డి ఆక్షేపించారు. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఆయన స్పందిస్తూ, విశాఖ రైల్వే జోన్‌ విషయంలోనూ క్లారిటీ లేదు. రైల్వే జోన్‌ ఏర్పాటు చేయకుండా, అది లాభదాయకం కాదంటూ తప్పించుకుంటున్నారన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై ఆసక్తి ప్రదర్శించకపోవడం బాధాకరం. పునర్విభజన చట్టంలో షెడ్యూల్‌ 13లో 11 కేంద్రత ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇంతవరకు రెండు కూడా ఏర్పాటు చేయలేదు. ఇప్పటి వరకు ఇచ్చిన రిపోర్టు ప్రకారం 9 కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేయాలంటే రూ. 11,267 కోట్లు నిధులు అవసరం అవుతాయని చెప్పారు. గత నాలుగేళ్లలో జరిగిన కేటాయింపులు చూస్తే 421 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇలాగైతే అభివృద్ధి ఎలా జరుగుతుందని నమ్మగలమని ప్రశ్నించారు. సెంట్రల్‌ యూనివర్సిటీ, ట్రైబల్‌ యూనివర్సిటీకి సంబంధించి రాబోయే సమావేశాల్లో చట్టం తీసుకొస్తామని చెప్పారు. 70 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కానీ లెక్కలు చూస్తే మాత్రం నిరాశాజనకంగా ఉన్నాయని సాయిరెడ్డి అన్నారు.
 గడిచిన మూడేళ్లలో జరిగింది కూడా ఏమీలేదు. పైగా 1.2 శాతం తగ్గుదల కనిపించింది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామంటే.. చాలా ఊహించుకున్నారనీ, ఇప్పుడున్న కనీస మద్ధతు ధర చూస్తే పెట్టుబడులకు కూడా చాలడం లేదని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.  రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలంటే దిగుబడిని పెంచుతామని గతంలో కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పారు. ఇప్పుడేమో 1.5 శాతం అంటున్నారు. ఇప్పుడున్న మద్ధతు ధరలు చూస్తే కనీసం పెట్టుబడికి కూడా సరిపోవడం లేదు. రాబోయే ఐదేళ్లలో రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయాలంటే కనీసం మద్ధతు ధర 20 శాతం పెంచాలని డిమాండ్ చేశారు. అప్పటికి గానీ 2022 నాటికి రైతుల  ఆదాయాన్ని రెండింతల ఆదాయాన్ని చూడగలమని వివరించారు. 

No comments:

Post a Comment