21 February 2018

బాబు అంటే పవన్ కు భయమా?

చ‌ంద్ర‌బాబు అంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు భ‌య‌మా అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు ప్ర‌శ్నించారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం చంద్ర‌బాబుపై పోరాడాల్సిన వ్య‌క్తి ప్ర‌తిప‌క్షాన్ని ప్ర‌శ్నించడంలో ఆంత‌ర్య‌మేంటో చెప్పాల‌ని నిల‌దీశారు. ప్ర‌త్యేక హోదా కోసం వైయ‌స్ఆర్‌సీపీ ఊపిరి ఉన్నంత వ‌ర‌కు పోరాటం చేస్తుంద‌ని, అందులో ఎలాంటి సందేహం లేద‌న్నారు. ప‌వ‌న్ బాధ్య‌తారాహిత్యంగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఎవ‌రు మద్ద‌తిచ్చినా..ఇవ్వ‌క‌పోయినా మిగ‌తా పార్టీల మ‌ద్ద‌తు తీసుకొని మార్చి 231న పార్ల‌మెంట్‌లో అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని అంబ‌టి స్ప‌ష్టం చేశారు. విజ‌య‌వాడ‌లోని పార్టీ కార్యాల‌యంలో మంగ‌ళవారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. అంబ‌టి ఏమ‌న్నారంటే..ఆయ‌న మాట‌ల్లోనే.. 

ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెబుతోంది. ప్రత్యేక హోదా కోసం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక ఉద్యమాలు చేసింది. హోదా కోసం పదవులకు రాజీనామా చేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. వైయస్ జగన్ ఎక్కడా ఛాలెంజ్ చేయలేదు.  ఒకసారి యూట్యూబ్ రివైండ్ చేసి చూసుకోండి. పవన్.. అవిశ్వాసానికి మీ పార్టనర్ ను ఒప్పించండని వైయస్ జగన్ అన్నారు. పవన్ కళ్యాణ్ చిన్నపిల్లవాడిగా వ్యవహరిస్తున్నారు. మేం పోరాట క్రమాన్ని ముందుగా ప్రకటించాం.  మార్చి 1న కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేస్తాం. మార్చి 5న పార్లమెంట్ లో ఉద్యమం చేయాలని నిర్ణయించాం. అవిశ్వాస తీర్మానం పెట్టాలని పవన్ చెప్పారు..ఆయన సలహాను స్వీకరిస్తున్నాం అని  వైయస్ జగన్ తెలిపారు. చంద్రబాబు నాయుడు నా పార్టన్ కాదంటూనే పవన్ ప్రతిపక్షాన్ని ప్రశ్నించటం ఏమిటి? చంద్రబాబును ప్రశ్నించే హక్కు పవన్ కళ్యాణ్ కు ఉంది. 1.25 శాతం ఓట్ల‌తో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. దానికి కారణం పవనే అని ప్రజలంతా అనుకుంటున్నారు. ఈరోజు పవన్ బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు.

 ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిన సందర్భంగా పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని పవన్ మండిపడ్డారు. ఆ పాచిపోయిన లడ్డూలు తీసుకొన్న చంద్రబాబు బ్రహ్మాండంగా ఉన్నాయన్న చంద్రబాబును ఇంతవరకు ప్రశ్నించకపోవటంతో కారణం ఏమిటి? చంద్రబాబు అంటే పవన్ కళ్యాణ్ కు భయమా?  చంద్రబాబుపై పోరాడాల్సింది పోయి.. ప్రతిపక్షాన్ని ప్రశ్నించటంలో ఆంతర్యమేంటి? ప్రత్యేకహోదాపై పోరాడింది ప్రతిపక్ష నేత  వైయస్ జగన్ అన్నది వాస్తవామా? కాదా అన్నది మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి.  

అవిశ్వాసంపై తలా..తోక లేదన్న చంద్రబాబును పవన్ కళ్యాణ్ పై లేదా?: అంబటి రాంబాబు. ఎంపీలు అందర్నీ సమీకరిస్తాం అని పవన్ చెప్పారు. అవిశ్వాసం అక్కర్లేదన్న చంద్రబాబును ఎందుకు పవన్ ప్రశ్నించటం లేదు. మంత్రివర్గం నుంచి చంద్రబాబు ఎందుకు తప్పుకోవటం లేదని పవన్ ప్రశ్నించలేకపోతున్నారు. మీరు చెప్పిన సలహా మేం స్వీకరించాం. పవన్ నిష్పక్షపాకంగా ఉంటే శభాష్ అంటాం. మీరు ఎవర్నో మోస్తున్నారన్న భావన కలుగుతోంది. మీరు అధికారంలో తీసుకువచ్చిన పార్టీకి 20 మంది ఎంపీలు ఉంటే.. వాళ్లను వదిలేసి.. ఢిల్లీ వెళ్లి కేజ్రీవాల్, తమిళనాడు, ఒరిస్సా వెళ్లి ఒప్పిస్తానటం హాస్యాస్పదం. నువ్వు గెలిపించిన రాజకీయ పార్టీ సరే.. పాత మిత్రుడ్నే ఒప్పించలేని వ్యక్తి.. పొరుగు రాష్ట్రాల ఎంపీలను ఒప్పిస్తారా?ఇది ఎలా ఉందంటే.. ఉట్టికి ఎగరలేని అమ్మ స్వర్గానికి ఎగురుతాను అందట .. అలా పవన్ పరిస్థితి ఉందని ఎద్దేవా చేసిన అంబటి. ఏదో  చేస్తున్నారు.. మాకేమీ అర్థం కావటంలేదు. 

జేఎఫ్సీలో పెద్దవాళ్లు అందరూ ఉన్నారు. అందులో ఉన్న పెద్దలందరి మీద అపారమైన గౌరవం ఉంది. ప్రత్యేక హోదాను చంద్రబాబు ముంచారని అనలేపోయారు. చంద్రబాబును ప్రశ్నించలేనంత కాలం.. పవన్ పై అనుమానం ఉంటుంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీసుబ్బారెడ్డి గారు 184 నిబంధన కింద నోటీసు ఇచ్చారు. ఈ సందర్భంగా చర్చ జరుగుతుంది. ఈ ఓటింగ్ లో టీడీపీ ఎంపీలు పాల్గొనమని చంద్రబాబుకు చెప్పు పవన్.నీతి, నిజాయితీలకు సిద్ధపడి రాజకీయాల్లోకి వచ్చిన పవన్.. పక్క రాజకీయపార్టీ శాసనసభ్యుల్ని కొనుగోలు చేయటం తప్పు అని చంద్రబాబుకు ఎందుకు చెప్పటం లేదు. ఓటుకు కోట్లులో చంద్రబాబు దొరికితే .. ఇలాంటివి చేయటం తప్పు అని ఒక్కమాట అన్నావా పవనూ?

ఆయన నా పార్టనర్ కాదు.. నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నానని అనటం ఏమిటి పవనూ? కేంద్రం నుంచి నిధులు ఎన్ని ఇచ్చారో.. తెల్సుకుందాం తప్ప .. ఎలా ఖర్చు చేశారో మనకు అనవసరం అని జేపీ అనటంలో ఆంతర్యం ఏమిటి? ముందు మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోసం అలుపెరగని పోరాటం చేస్తుంది. పవన్, చంద్రబాబు వచ్చినా రాకపోయినా ప్రత్యేక హోదాపై మా పోరాటం ఆగదు. ఇప్పటికైనా చంద్రబాబును ఒప్పించి.. మంత్రివర్గం నుంచి తప్పుకోమని ఒప్పించండి పవనూ..ప్రతిపక్షాన్ని విమర్శించడం సరైనది కాదని.. పవన్ తెల్సుకోవాలి. చంద్రబాబూ మంత్రివర్గంలో ఎంత కాలం కొనసాగుతారు? బీజేపీ వాళ్లు ఏం అంటున్నారో తెల్సా?
చంద్రబాబు రాష్ట్రాన్ని ఇప్పటికే ముంచేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ఈ ఉద్యమంలో కలిసి రావాలి. స్పష్టమైన వైఖరిని పవన్ కళ్యాణ్ చెప్పాల్సిన అవసరం ఉంది.

No comments:

Post a Comment