27 February 2018

వైయస్‌ జగన్‌ను సీఎంను చేద్దాం

ప్రకాశం: వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేద్దామని, అందుకోసం ప్రతి ఒక్కరూ వీర సైనికుల్లా పని చేయాలని ఎమ్మెల్యే జంకే వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. పొదిలి పట్టణంలో ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. జిల్లాలో వైయస్‌ జగన్‌ ఎక్కడికి వెళ్లినా జనప్రభంజనమే అన్నారు. రాజన్న ముద్దుబిడ్డ వైయస్‌ జగన్‌ను గెలిపిస్తేనే రాష్ట్ర భవిష్యత్తు ఉంటుందన్నారు. మూడు జిల్లాలకు ముచ్చటైన వెలుగొండ ప్రాజెక్టును వైయస్‌ జగన్‌ నిర్మిస్తారన్నారు. 2005లో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి వెలుగొండ ప్రాజెక్టు పనులు ప్రారంభించారన్నారు. మహానేత మరణంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయిందన్నారు. మిగిలిన పనులను పూర్తి చేయలేని అసమర్ధుడు చంద్రబాబు అని విమర్శించారు. మాటలు వద్దు..చేతల్లో చూపించాలని టీడీపీకి సవాల్‌ విసిరారు. మహానేత చనిపోవడమే రాష్ట్రానికి దురదృష్టకరమన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లకు విలువ లేదన్నారు. సంతలో పశువుల్లా మమ్మల్ని కొంటున్నారని, ఇది న్యాయమేనా అని ప్రశ్నించారు. ౖÐð యస్‌ జగన్‌ను ముఖ్యమంత్రి చేసేంత వరకు నిద్రపోయేది లేదని స్పష్టం చేశారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తే మనల్ని తరిమికొడతారని హెచ్చరించారు. చంద్రబాబు అవినీతి ముఖ్యమంత్రి అని అన్ని సర్వేలు చెబుతున్నాయన్నారు. జనం కోసమే జగన్‌ అని, వీర సైనికులుగా పని చేసి అన్నను గెలిపించుకుందామని, ముఖ్యమంత్రిగా కూర్చొబెడుదామని, మన ప్రాంతానికి న్యాయం చేస్తారని చెప్పారు. వైయస్‌ జగన్‌ వస్తే సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తారని, అగ్రి గోల్డు బాధితులను ఆదుకుంటారన్నారు. జిల్లాలోని 12 ఎమ్మెల్యే స్థానాలను గెలిపించి వైయస్‌ జగన్‌కు కానుకగా ఇద్దామన్నారు. 

No comments:

Post a Comment