11 December 2018

మీరు నమ్ముకున్న నోట్ల కట్టలు గెలిపించలేవు https://ift.tt/2SJhW1P

  హైదరాబాద్‌: చ‌ంద్ర‌బాబు న‌మ్ముకున్న మీడియా, నోట్ల కట్టలు తెలంగాణ‌లో గెలిపించ‌లేక‌పోయాయ‌ని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి,  రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ఆయ‌న ట్వీట్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు వ్యవహారశైలి గురించి మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్‌) చక్కగా విశ్లేషించారని గుర్తు చేశారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2SJhW1P
via IFTTT December 11, 2018 at 05:46PM

33 comments:

  1. పచ్చ కామెర్ల గుంటనక్కలు ఎత్తులు & పొత్తులు పేరుతో వేసిన జిత్తులు పారలేదు. సై"కిల్" మూకల కిరాయి తొత్తులు చిత్తుచిత్తుగా ఓడిపోయి చెత్తబుట్టలో పడ్డారు. బాడుగకు వచ్చిన బడుద్దాయిలు అడ్రెస్ లేకుండా పోయారు. వొళ్ళంతా విషం నిండిన నాగుబాములు నేల కరిచారు.

    ఇది తెలంగాణా దెబ్బ. ఇది జనం బలం. ఇది ప్రజాస్వామ్యంలో సామాన్యుడి విజయం.

    ReplyDelete
    Replies
    1. ఏంటండీ గొట్టిముక్కలవారు తెలంగాణాలో కేసీఆర్ కబంధ హస్తం నుండి తప్పించుకోలేక ఆనందంతో కుప్పిగంతులు వేస్తున్నారు ? జనం నమ్మడం అంటూ మొదలుపెడితే వదలరండీ....అందులో తెలంగాణావాళ్ళు ఆంధ్రా వాళ్ళని గెలిపించడం జరుగుతుందా ?

      Delete
  2. గొట్టిముక్కల వారు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నట్లున్నారు నీహారిక గారూ. కానివ్వండి.

    ReplyDelete
    Replies
    1. తప్పేముందండి. ఆయన కోరుకున్న పార్టీ వచ్చింది గనుక ఆయన ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు. అదే కాంగ్రెస్ గనుక వచ్చి ఉండుంటే నీహారిక గారు డిటో కదా. కేవలం జైగొట్టిముక్కల వారే కాదు ఐదు కోట్ల ఆంధ్రులు (చంద్రబాబు గారు ఎగస్పార్టీని విమర్శించేప్పుడు రాష్ట్రమంతా, ఐదు కోట్లమంది, పూర్తిగా తన వెనుకే ఉన్నట్లుగా అంటుంటారు గనుక, ఇక్కడ కూడా అలాగే తీసుకో ప్రార్ధన) కూడా మహదానందంగా ఉన్నారు. ఒకవిధంగా చెప్పాలంటే కోటానుకోట్ల ఆంధ్రుల శుభ ఆకాంక్షల ఫలితమే ఈ కెసిఆర్ అద్వితీయ గెలుపు. అసలు కూటమి, దాని జోరు, దాని హోరు అంతా, అంతా పచ్చ మీడియా సృష్టి, పరాకాష్టగా లగడపాటి రంగప్రవేశం. గెలుపు కోసం వాళ్ళు ఎంతకైనా దిగజారుతారన్నా దానికి ఇవన్నీ నిదర్శనాలు. అదృష్టవశాత్తు తెలంగాణా ప్రజలు, సీమాంధ్రులు ఈ నక్కజిజిత్తులన్నీ ఆకళింపు చేసుకున్నారు. అటుఇటుగా ఉన్నవాళ్లు చంద్రబాబు ప్రచారార్భాటంతో పూర్తిగా తెరాస వేపు మళ్ళి పోయారు. అక్కడ ఆంధ్రాలో చేస్తానని చెప్పి చేయలేనివన్నీ ఇక్కడ చేస్తానంటూ మళ్ళీ బూటకపు వాగ్దానాలు మొదలుపెట్టడంతో ఆయన నిజస్వరూపం వాళ్లకు తెలిసి వచ్చింది. కూటమి ప్రచారంలో ఆయనది పై చెయ్యి అయ్యింది. అదే కూటమి గొయ్యి తవ్వింది. రాజకీయ అరాచకత్వం ప్రజలు గమనించలేరు, గమనించరు, అనుకోవడం అధికార మదం, అవినీతి ధనం వారికిచ్చిన అవలక్షణం. ప్రజా బలాన్ని కాకుండా మీడియా బలాన్ని, అధికారానికి అంటకాగే వ్యవస్థల బలాన్ని నమ్ముకుని, కాపాడాల్సిన ప్రజల్ని అణగదొక్కే అహంకారం, దాష్టీకం తాత్కాలికంగా వెలగవచ్చు. ప్రజలు సహించలేనంతగా వారి ఆగడాలు మితిమీరినప్పుడు ఇలాగే అణగదొక్కుతారు. తెలంగాణా ప్రజల సమయస్ప్హూర్తికి జేజేలు, అభినందనలు.

      Delete
    2. >>>> కాంగ్రెస్ గనుక వచ్చి ఉండుంటే నీహారిక గారు డిటో కదా>>>
      తెలంగాణాలో కాంగ్రెస్ ఓడిపోవాలని గట్టిగా కోరుకున్నాను. పఠిష్ట వ్యూహంతో కేసీఆర్ దూసుకుపోతుంటే అభ్యర్ధుల ఎంపిక కోసం చివరివరకూ ఢిల్లీలో తిరుగుతుంటే నాకే కోపంగా ఉంది. కాంగ్రెస్ అంటే అభిమానముంది కదా అని తప్పులు చేస్తూ ఉంటే ఓటేస్తానని భ్రమ పడకండి.ఒకే కుటుంబం ఒకే సీటు అన్నారు ఉత్తం గారి సతీమణి ఓడిపోయినందుకు మరింత సంతోషంగా ఉంది. పోనీ ఓడిపోయిన తర్వాతయినా నిజాయితీగా ఉన్నారా అంటే అదీ లేదు. ఆడలేక ఈవీఎం "ఓటిది" అంటున్నారు. గతంలో బీజేపీ కి రెండుసార్లు ఓటేసాను. అభ్యర్ధి నచ్చకపోతే నోటాకి కూడా ఓటేసాను.

      Delete
    3. >>>ఒకవిధంగా చెప్పాలంటే కోటానుకోట్ల ఆంధ్రుల శుభ ఆకాంక్షల ఫలితమే ఈ కెసిఆర్ అద్వితీయ గెలుపు>>>>

      నిజమేనండీ యాగంతో మొదలుపెట్టి, రైతుబంధు పధకంతో సహా కోట్లు ఖర్చుపెడితే గెలవకుండా ఉంటారా ?
      నిన్న తెలంగాణా భవన్ లో ఆంధ్రులకు "ప్రత్యేక" బహుమతి ఇస్తానంటున్నారు కూడానూ....

      Delete
    4. నీహారిక గారూ మీరు కరడు గట్టిన కాంగ్రెస్ వాదేమోనన్న ఊహలో ఉన్నాను. అది అపోహేమోనని ఇప్పుడనుకుంటున్నాను. your narration confirms that.

      "తెలంగాణాలో కాంగ్రెస్ ఓడిపోవాలని కోరుకున్నాను" - అంటే దాంతోపాటే తెలుగుదేశం కూడా అని అర్ధమే కదా! అప్పుడు తెరాస గెలవాలనే కదా మీరు కోరుకుంది.

      "యాగంతో మొదలు పెట్టి" ----కదా! ఇక్కడెవరంట నాటకాలాడంది? కనీసం ఆయన చేసిన కొన్ని పనులైనా ప్రజలకు ఉపయోగపడ్డాయి కదా. అందుకే మెచ్చి గెలిపించారనుకోండి.
      "గెలవకుండా ఉంటారా" ----చూద్దాం మీ క్లూ చంద్రబాబు గార్ని ఎంతవరకు గెలిపిస్తుందో?
      ఇక ప్రత్యేక బహుమతంటారా, ఈయన వెళ్లి ఆయనకు బహుమతిగా ఏమి ఇద్దామనుకుని ఫెయిల్ అయ్యాడో ఆ విషయం తెలుసుకున్న అవతలాయన, అదే బహుమతిని జాగ్రత్తగా ఇవతలాయనకు, కనీసం తనైనా ఫెయిల్ అవకుండా ఇద్దామని ముచ్చట పడుతున్నాడు. తప్పేముంది? ఈయన ఫెయిల్ అయ్యాడని ఆయన ఫెయిల్ అవ్వాలని లేదు కదా? అందునా ఆ ప్రత్యేక బహుమతి ఆంధ్రులు మనసారా కోరుకుంటున్నదే అయినప్పుడు హి ఈజ్ మోస్ట్ వెల్కమ్ టు ప్రెజంట్ దట్.

      Delete
    5. మేము ఆంధ్రులం. మేము ఎవరినైనా ఆదరిస్తాం. ఆంధ్రులు ఎక్కడైనా సర్దుకునో, ఎదిరించో బ్రతికేయగలరు. సున్నా నుండి మొదలెట్టిన వాళ్ళం...మళ్ళీ శూన్యం లోకి నెట్టివేయబడ్డవాళ్ళం. కేసీఆర్ గెలిచానని సంబరపడిపోవచ్చు...మా మనసులను తెలంగాణా వాళ్ళు ఇంకా గెలవలేదు.మీకు కేసీఆర్ గారు ఎంత అవసరమో మాకు చంద్రబాబు గారు అంత అవసరం. తెలంగాణా లో చంద్రబాబు గారు ఎవరినో ఒకరిని సపోర్ట్ చేయాలి కాబట్టి కాంగ్రెస్ ని సపోర్ట్ చేసారు.పార్టీని అలా ఎవరూ వదిలేయలేరు కదా ? జూ ఎంటీ ఆర్ వస్తే అతనికే అప్పగించేవారు. సినిమాలు వదులుకుని రాజకీయాలకు ఆయన వస్తారా ? తెలంగాణా కి సెంటిమెంట్ ఉన్నట్లే ఆంధ్రా వాళ్ళకి సెంటిమెంట్ ఉండదా ? చంద్రబాబుగారు తెలంగాణాలో కొత్తగా అడుగుపెట్టారా ? కేసీఆర్ ఏ పార్టీ నుండి వచ్చారో మర్చిపోయారా ? కేసేఆర్ తిట్టినట్లు చంద్రబాబు గారు తిట్టలేరు. డీసెన్సీ జన్మతహా వస్తుంది.చిత్తూరు జిల్లా వాళ్ళు పొలైట్ గా మాట్లాడతారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళదలుచుకుంటే తిడితే ఓట్లు పడతాయి అనుకోకండి. ధాకరే లాగా బెదిరిస్తే పనులు జరుగవు.

      Delete
    6. నీహారిక గారు మీ వంటి బాగా ప్రాపంచిక జ్ఞానం ఉన్న వారు, విషయాలను చక్కగా ఆకళించుకుని, నేర్పుగా విశ్లేషించగలిగిన వారూ ఇలా ఒక నాయకుడి గత ఘనకీర్తికి ఆకర్షింపబడి, మురిసి పడి, క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవాలను విస్మరించి, వాటిని గుర్తించడానికి తిరస్కరించడం చాలా ఆశ్చర్యంగా ఉంది. మరింత ఆశ్చర్యంగా మీ ఆలోచనా ధోరణి, అన్నిటికీ టీడీపీని యెల్ల వేళలా బాజా కొట్టే భజంత్రీల ఆలోచనా ధోరణి ఒకే పంధాలో ఉండటం ఒకింత వింతైన విషయం.

      "ఎవరినైనా ఆదరిస్తాం" ---- కరెక్ట్ గా ఇదే ఆంధ్రుల వీక్నెస్. అలాగునే గతంలో దేశమంతా కాంగ్రెస్ పార్టీని దేశమంతా తిరస్కరించిన అనేకానేక సందర్భాలలో నెత్తికెక్కించుకున్నాం. కొట్టిన చేతిని కళ్ళకద్దుకున్నాం, తన్నిన కాళ్లకు పాద పూజలు చేసాం. ఆఖరికి గుండెల్లో గునపాలు గుచ్చుతున్న వేళ, కొంచెం జాలిపడి, ఆఖరి కోరికలు కోరుకోమంటే, ఛత్ మాకు ఉమ్మడి ఆంధ్ర తప్ప ఇంకేమొద్దు అన్న మొద్దు నిద్రగాళ్ళం, మన ఆంధ్రులం. ఆ రోజే గనుక రాష్ట్ర నాయకత్వం, ఎంపీలు, కాస్తంత సమయానికి దగు తెలివితేటలు చూపి ఉంటే ఈ రోజు రాష్ట్రం పరిస్థితి మరో విధంగా ఉండేది. చంద్రబాబు ఆడించిన రసవత్తర అశోక్ బాబు నాటకాన్ని గుడ్లప్పగించుకుని చూస్తూ చేష్టలుడిగి అదే చంద్రబాబుకు, అనుభవజ్ఞుడు అన్న అజ్ఞానపు పరదా మాటున, అధికార దండాన్ని అప్పగించిన మహా జ్ఞానులం. ఘన ఆంధ్రులం. మీరే అన్నట్లు ఎక్కడైనా, ఎలాగైనా సర్దుకుని బ్రతికేస్తాం. మళ్ళీ మళ్ళీ సున్నాతో తిరిగి మొదలెడ్తామ్. శూన్యంగా మిగిలేస్తాం.

      "కెసిఆర్ గెలిచానని సంబరపడవచ్చు" ----- ఆయన సంబరాలను కాసేపు ప్రక్కన పెడదాం. ఆంధ్రాలో అనేక చోట్ల కెసిఆర్ గెలుపును ఎందుకు సెలెబ్రేట్ చేసుకున్నారంటారు? ఆయనే ఉంటే? సామెత తెలుసుకదా! లక్షల్లో మెసేజ్లు, 'వచ్చి మా నాయకుణ్ణి దింపెయ్యడానికి సహకరించండంటూ', పరాయి రాష్ట్ర నాయకుడికి ఎందుకు పంపిస్తున్నారంటారు? ఇక్కడ ఏదో ఒక ఆలోచించదగు తప్పనిసరి విషయమున్నట్లే గదా!

      contd

      Delete
    7. పోనీ ఇవన్నీ వదిలేద్దాం - థాకరే బెదిరింపులూ వదిలేద్దాం. ఎన్నుకున్న ప్రజల్ని బెదిరించే నాయకుణ్ణేమంటారు? కోరికలు చెప్పుకుందామని వెళ్లిన నాయీ బ్రాహ్మణులను ఆయన ఏ విధంగా బెదిరించింది, ఈ మధ్య శ్రీకాకుళం తుఫాను బాధితుల్ని, రోడ్డుకడ్డంగా ఉండి మాకు బియ్యం అందలేదు, ఉప్పుపప్పులందలేదు అంటూ ఘోషిస్తున్న వాళ్ళ!ను, తప్పుకుంటారా రోడ్డురోలర్ తో తొక్కించమంటారా అని బెదిరించడాన్ని, మాకు ఓటు వేయకుంటే మేం వేసిన రోడ్లపై మీరు తిరగడానికి వీల్లేదు అంటూ హెచ్చరించడాన్ని, ఎన్నిసార్లు పేపర్ లో వచ్చినా తన పార్టీలోని అనేక మంది రౌడీ నాయకులు చేస్తున్న అరాచకాల్ని అరికట్టకుండా నిశ్శబ్దంగా ఉండటాన్ని వగైరాలన్నిటిని మీరు డీసెన్సీ, పోలైట్నెస్ కేటగిరీ లో పెడతారేమో మరి! హత్యాయత్నం జరిగిన అపోజిషన్ లీడర్ పరమార్శించక పోగా తనకు తానే ఆ నాటకమాడాడన్నట్లుగా కలరింగ్ ఏమిటి? నిజానికి లోగుట్టు కనిపెట్టడం ఆయనకు చిటికెలో పని, వ్యవస్థలన్నీ ఆయన గుప్పెట్లోనే ఉన్నాయి గనుక. మరింతవరకు నిజం బయటకు రాలేదేం?
      అలాగే జగన్ని ఇరికించడానికి పనికి వచ్చిన సిబిఐ ఇప్పుడు ఎందుకని పనికిరానిదైంది?

      సరే అవి ప్రక్కన పెడదాం. బాబొచ్చినాక ఎన్ని జాబులొచ్చినై? ఇచ్చిన 600 మేనిఫెస్టో లోని ఎన్ని హామీలు అమలు పర్చారు, అసలెందుకు మేనిఫెస్టో పార్టీ వెబ్సైటు నుంచు తీసేసారు?
      తానే 23 మంది ఎమ్మెల్యే లను తోలుకొచ్చి దొడ్లో పెట్టుకుని, అటేపు తోలుకెళ్ళినోళ్లకు వోటెయ్యవద్దంటాడేంటి! ఆ ముచ్చట కూడా చెప్పండి. రెండు డజన్ల పైన స్టే లు ఉన్న భారత దేశ, అత్యంత అనుభవశాలికి తన్ను తానే నిప్పని డప్పేసుకునే, నిప్పు కణికకు స్టే ల అవసరమేమిటి? చక్కగా కోర్ట్ కెళ్ళి నిప్పులా బయటికి వచ్చి ప్రత్యర్థుల్ని కంటి చూపుతో తగలబెట్టేయొచ్చు కదా?

      ఆ ప్రక్కన ఉండవల్లి గారు ఱంకెలేస్తున్నారు 'బస్తీ మీ సవాల్' అంటూ - చంద్రబాబు అండ్ కో. బాగోతాలు విప్పుతానంటూ - మధ్యలో నే వస్తా, నీ సంగతి తెలుస్తాయి అంటూ చంద్రబాబు తరపున ప్రతి సవాల్ చేసిన కుటుంబరావు గారు - ఆపైన ఉండవల్లి గారు ఫోన్ చేస్తే తియ్యడం లేదంటూ, మెసేజ్ లిస్ట్ రిప్లై రావడం లేదంటూ రోజూ యూట్యూబ్ లో ఒకటే వేదన, రోదన. ఓపెన్ గా రోడ్డెక్కి ప్రభుత్వం పై తీవ్రాతితీవ్రమైన ఆరోపణలు ఒక మాజీ ఎంపీ చేస్తుంటే ఏ మాత్రం ప్రజలూ, ప్రభుత్వం పట్టించుకోని జాతి, (అది ఆంధ్రా జాతి కాకుండా) దేశం (అది భారతా దేశం కాకుండా) ఈ భూమ్మీద వేరొకటి ఉండే ఉంటుందంటారా మేడం నీహారిక గారూ?

      ఇవన్నీ ఎత్తి చూపుతున్న వాస్తవాలే కానీ అవాస్తవాలు కాదు కదా?
      మీరనవచ్చు అన్నీ చెడ్డ పనులైనా మంచి ఏం చెయ్యలేదా చంద్రబాబు గారు అని. తప్పకుండా కొన్ని ఉంటాయి ప్రభుత్వం చేసే మంచి పనులు, ఆఖరికి మీరో నేనో సీఎం గా ఉన్నా మనం చేసే పనుల్లో కొన్నైనా మంచివి ఉంటాయి. విషయమల్లా మనం ఆ మంచీ చెడులను బేరీజు వేసుకుంటాం. ఎక్కువ తక్కువలు లెక్కేస్తాం. మొగ్గు ఎటేపు ఉంటె అటేపు మొగ్గుతాం. కెసిఆర్ కు మొగ్గు వచ్చింది గనుక నెగ్గాడు. ఈయన సంగతి, కాలం, జనం తేల్చాల్సిందే! ప్రజలంటే కేవలం మీరూ నేనే కాదు గనుక అందాకా వేచి చూద్దాం.

      Delete
    8. >>>ఒక నాయకుడి గత ఘనకీర్తికి ఆకర్షింపబడి, మురిసి పడి, క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవాలను విస్మరించి, వాటిని గుర్తించడానికి తిరస్కరించడం చాలా ఆశ్చర్యంగా ఉంది.>>>>
      క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో మీరు స్వయంగా చూసారా ? నేను చూసాను. ఈ 4 సంవత్సరాలలో చంద్రబాబు గారు చేసిన పనులు నేను స్వయంగా కళ్ళారా చూసాను. కే సీ ఆర్ గారు కూడా చూసి ముచ్చటపడ్డారు . పరిపాలన విషయంలో మీరు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించలేరు.

      Delete
    9. >>>>ఆంధ్రాలో అనేక చోట్ల కెసిఆర్ గెలుపును ఎందుకు సెలెబ్రేట్ చేసుకున్నారంటారు? ఆయనే ఉంటే? సామెత తెలుసుకదా! లక్షల్లో మెసేజ్లు, 'వచ్చి మా నాయకుణ్ణి దింపెయ్యడానికి సహకరించండంటూ', పరాయి రాష్ట్ర నాయకుడికి ఎందుకు పంపిస్తున్నారంటారు? ఇక్కడ ఏదో ఒక ఆలోచించదగు తప్పనిసరి విషయమున్నట్లే గదా!>>>>

      నేనే కేసీఆర్ గెలిచినందుకు ఆనందించాను అని చెప్పాను కదా ? పనిచేసిన నాయకుడు గెలవకపోతే సెలబ్రేట్ చేసుకోకపోతే ఆ నాయకుడికి పనిచేయాలనిపిస్తుందా ? కోట్లమందిలో లక్షల మెసేజ్ లు రావడం సహజం. చంద్రబాబుగారు ఏకగ్రీవంగా గెలిచారా ఏమిటీ ? ఆంధ్రాలో బలమైన ప్రతిపక్షం ఉంది. తెలంగాణాలాగా వారిలాగా ఆలోచనేమీ లేకుండా నియంతృత్వాన్ని ఆంధ్రులు ఇష్టపడరు.

      Delete
    10. రాజకీయాల్లో ఉండవల్లి మాటలను నెట్లో నీహారిక వ్యాఖ్యలను ఎవరైనా లెక్కచేసేవారున్నారా ?

      Delete
    11. >>>>ఇవన్నీ ఎత్తి చూపుతున్న వాస్తవాలే కానీ అవాస్తవాలు కాదు కదా?
      మీరనవచ్చు అన్నీ చెడ్డ పనులైనా మంచి ఏం చెయ్యలేదా చంద్రబాబు గారు అని. తప్పకుండా కొన్ని ఉంటాయి ప్రభుత్వం చేసే మంచి పనులు, ఆఖరికి మీరో నేనో సీఎం గా ఉన్నా మనం చేసే పనుల్లో కొన్నైనా మంచివి ఉంటాయి. విషయమల్లా మనం ఆ మంచీ చెడులను బేరీజు వేసుకుంటాం. ఎక్కువ తక్కువలు లెక్కేస్తాం. మొగ్గు ఎటేపు ఉంటె అటేపు మొగ్గుతాం. కెసిఆర్ కు మొగ్గు వచ్చింది గనుక నెగ్గాడు. ఈయన సంగతి, కాలం, జనం తేల్చాల్సిందే! ప్రజలంటే కేవలం మీరూ నేనే కాదు గనుక అందాకా వేచి చూద్దాం.>>>>>
      నేను చెప్పిందీ ఇదే కదా ? కేసీఆర్ పనిచేసారు గెలిపించారు. చంద్రబాబు గారు ఒంటరి పోరాటం చేస్తున్నారు సహకరించండి అని పిలుపునిస్తున్నాను. తెలంగాణా వారికున్న కలివిడితనంలో ఒక్క పది శాతమున్నా ఆంధ్రుల పరిస్థితి బాగుపడుతుంది. విభజన విషయంలో ఒక్కమాట మీద ఉన్నారు. మన హక్కులు మనం పోరాడి తెచ్చుకోవడంలో ఆ కలివిడితనం ఏదీ ? పవన్ కళ్యాణ్ కి కేసీఆర్ చేసే మంచి కనిపిస్తుంది కానీ చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి కనిపించడం లేదా ? 4 సం రాల నుండి రోడ్లపై పడి తిరుగుతున్నవారికి విభజన తర్వాత రోడ్లూ సదుపాయాలూ ఎలా మారాయో కనిపించడం లేదా ? మళ్ళీ చంద్రబాబు గారు సీ ఏం అవకపోతే ఆంధ్రా పరిస్థితి ఒకసారి ఊహించండి. ఎవరికి ఓటు వేయాలి ? అసెంబ్లీకే రాని ప్రతిపక్ష నేతకా ? సరైన క్యాడర్ కూడా నిర్మించుకోవడం చేతకాని పవన్ కళ్యాణ్ కా ? కాంగ్రెస్ తో చంద్రాబాబు గారు కలవడం తప్పు కాదు. చంద్రబాబు గారు కాంగ్రెస్ తో కలవడం తప్పు. చేయని నేరానికి మాటలు పడవలసి వస్తోంది. చంద్రబాబు గారు ఒంటరిగానే పోరాడవలసింది.

      Delete
    12. నిహారిక గారు, మీరు మెచ్చారో, కెసిఆర్ మెచ్చారో, నేను మెచ్చలేదో, ప్రజలు మెచ్చారో, నొచ్చారో - the outcome of the peoples' verdict will be out in a few months and then we can decide which of us is correct. నేను మునుపే చెప్పాను, ఎవరు చేసినా కొన్ని మంచి పనులుంటాయని, త్రాసులో మొగ్గుని బట్టి అంతిమ నిర్ణాయకమౌతుందని. ఇక్కడొక విషయం మనమొక ధృడ అభిప్రాయాన్ని ఒక వ్యక్తి యెడ కలిగి ఉన్నపుడు, అవతలి వ్యక్తి మన అభిప్రాయానికి అనుగుణంగానే కనబడతాడు - అది హీరో గానా విలన్ గానా అన్నట్లు. కానీ సినిమా హిట్టా ఫట్టా అనేది మెజారిటీ జనుల అభిప్రాయాలను బట్టే ఉంటుంది కదా ఫైనల్ గా.
      'పరిపాలన విషయంగా' - అసల్లు సమస్యంతా పాలన గురించే కదా. ఇక్కడే మీరు 'శివ' తీసిన రాంగోపాల్ వర్మకి 'దొంగల బండి', 'ఆఫీసర్' తీసిన వర్మకి తేడా కనిపెట్టాల్సింది. ఎన్నేళ్ళైనా ఒక వ్యక్తికీ అదే దక్షత నిలిచి ఉంటుంది అనేది మీ ఘాఢమైన అభిప్రాయమైతే అది మీ ప్రఘాడాభిప్రాయం.
      అయినా మీరు పరిపాలన దక్షత అంటుంటే నాకింకొకటి గుర్తొస్తోంది. పుత్ర రత్నాన్ని దొడ్డిదారిన తెచ్చి ఒకటి కాకుండా, నాలుగు ప్రధాన శాఖలనిచ్చింది గాక సరాసరి కాబినెట్ హోదా - అవునవును ఇంతకంటే ప్రజల కోసమే బ్రతికే, శ్రేయస్సు కోరే నిప్పులాంటి నాయకుడి దక్షతకు వేరే గీటురాయి అవసరమేముంటుంది?
      అదీగాక తోలుకొచ్చిన మందలో నలుగురికి మంత్రి పదవులు - లోనున్న వాళ్లంతా సన్నాసులేమో మరి!
      ఆయనేమో అమెరికా వెళ్లి మరీ అక్కడ కూడా టీడీపీ అధికారంలోకి వస్తుందన్న మేధో ప్రకటిత ఉవాచ.

      కల్ కి తాజా ఖబర్ విన్నారో లేదో "నా వల్లే బీజేపీ చిత్తూ చిత్తుగా ఓడింది. ఆ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుపు వెనుక నా కృషి, తెలుగు దేశం కృషి, ఎంతో ఉంది" - తగరపు వలస లో మధ్యాహ్న భోజన కార్మికుల నుద్దేశించి చంద్రబాబు గారి ప్రసంగ పాఠం నుంచి. మీరు కూడా అగ్రీ అవుతారేమో అనుకుంటున్నాను! మరి తెలంగాణాలో ఎవరి వల్ల ఓడిపోయిందో అది మాత్రం ఊఁహూఁ ...
      (ఈ రోజు సాక్షి డైలీ చూడండి - ఆయన పూర్తిగా అబద్దం చెప్పలేదని, దాన్లో కూడా నిజం దాగుందని నమ్మ దాగిన వార్తొకటి ఉందక్కడ). తెలంగాణా వారి విజ్ఞత ఆంధ్రులు ప్రదర్శిస్తారో లేదో, నియంతృత్వానికి బొంద
      పెడతారో లేదో చూద్దాం. ఆలోచన లేకుండా నియంతృత్వాన్ని ఆంధ్రులు ఇష్టపడరన్న మీ సువాక్కు ఫలించుగాక!

      ఉండవల్లి గారు మీకో హాస్య నటుడిలా కనబడొచ్చు. నాకు మాత్రం ఆయన చంద్రబాబు గారికన్నా నిజాయితీ గలిగిన వ్యక్తిగా, సమాజానికి తన వంతు మేలు చేయడానికి ఎదురు చూసే బాధ్యత గల వ్యక్తిగా కనిపిస్తాడు.
      అయినా ఆయన అంతంత తీవ్రమైన ఆరోపణలు చేస్తుంటే తూచ్ అనుకోవడం చెల్లుతున్న వారికే చెల్లు.
      అదిసరే మరి అజేయ కల్లం, ఐ వై ఆర్ కృష్ణారావు, ఈ ఏ ఎస్ శర్మ గార్ల వేదనా, రోదన ఏమిటంటారు. వారంతా ప్రభుత్వ పనితీరును లోపల్నుంచి, బయట్నుంచి దగ్గరగా చూసినవాళ్లు కదా? కాదా?

      contd

      Delete
    13. మీరు చూసారో లేదో ఒక వీడియో యూటూబ్లో ఒక వార్త, ప్రభుత్వ ప్రచారార్థం 700 కోట్లు కేవలం ఒక్క ఛానెల్ కె చెల్లింపబడ్డాయని. ఈ లెక్కన మిగిలిన అన్ని చానెళ్లకు యెంత చెల్లింపబడి ఉంటుందో ఊహించగలమా? జీతాల చెల్లింపులకు, రోజువారీ ఖర్చులకు డబ్బులు వెతుక్కుంటున్న రాష్ట్రానికి ఇంత ప్రచారపు లగ్జరీయా? మీరేవేపు వెళ్ళండి అడుగడుగుకూ ప్రభుత్వ ఖర్చుతో వెలిసిన పెదబాబు చినబాబు పోస్టర్ లు, హోర్డింగ్స్ దర్శనమిస్తాయి. ఈ పేద రాష్ట్రానికి ఇదా ఇప్పటి పాలనా విధానం? ధర్మ పోరాట దీక్షల వీడియోలు మీరెప్పుడన్నా చూసారా? అత్యంత శ్రీమంతుల వివాహ వేదికలంత లగ్జురియస్ గా ఉంటాయి. అన్నివైపులా ఏసీఈలు, కూలర్ లు, కాళ్ళకింద మెత్తని తివాచీలు, వగైరాలన్నీ, డిజైనర్ స్టూడియోల్లా అలంకరించబడి ఉంటాయి. మిరుమిట్లు గొలిపేంత కాస్ట్లీగా, పసుపు పచ్చగా నింపబడి ఉంటాయి. ఒక్కో దీక్షకు 4 కోట్ల ప్రభుత్వ ఖర్చట! అది కూడా లెక్క చూపే ఖర్చు.లెక్కలేకుండా ఇంకెంత ఉంటుందో? ప్రభుత్వ దీక్ష అయితే పచ్చరంగు, జెండాలేవిటి, పార్టీ దీక్ష అయితే ప్రభుత్వ ఖర్చేవిటి? ఏ మీటింగ్ చూడండి ఈయన మోడీని, జగన్ని,పవన్ని తిడుతూ ఉంటాడు సగ కాలం, మిగులు కాలం స్వోత్కర్ష పారాయణం. మిగిలిన వాళ్లంతా డిటో - సగం ఈయన తిట్టినోళ్లని తిట్టడం, సగం ఈయన్ని ఎత్తెత్తి పొగడడం. అయినా ఈ దీక్షలు ఢిల్ల్లీ లో చేస్తే ఉపయోగం గానీ ఇక్కడ చెయ్యడంలో మర్మమేమిటో? సింగపూర్ కు వెళ్లే విమానం లో బుక్ కానీ టిక్కెట్లన్నింటికీ పేమెంట్ ప్రజలు కట్టాలా? హేవిటీ చోద్యం? అయ్యవారు ఎక్కడకు వెళ్లినా స్పెషల్ ఫ్లైట్స్ అట! విన్నారా! వైస్రాయ్ హోటల్లో రాజుగారి జమాన విడిదికి కోటానుకోట్ల బిల్స్ అట! విన్నారా! ఆయన లేకపోయినా కొన్ని రూమ్స్ పెర్మనెంట్ గా వీరి పేరునే అలా రెడీ చేసి ఉంచబడతాయట, సంవత్సరాం పొడుగూతా! ఎప్పటికప్పుడు రాజుగారు విడిది చెయ్యని హైదరాబాద్ విడిది గృహానికి (ఆయన ఉండేది వైస్రాయ్ లో కదా అని నన్నడగొద్దు) మార్పులు చేర్పులకు కో టానుకోట్ల ఖర్చట! విన్నారా! చోద్యంగా మాకిది రాచరిక పాలనగా కనిపిస్తోంటే మీకు అంతా డీసెంట్ గా, ప్రజాపరిపాలనగా కనిపిస్తోంది. ప్రపంచంలోని ప్రతి ప్లస్సూ మన ఖాతాలో జమేసుకోవడం మీకు పరిపాలన దక్షతగా అగుపిస్తోంది, ఒక చిన్న పిల్లవాడు ముద్దు ముద్దు మాటలతో చంద్రుణ్ణి నేనే ఆకాశానికి మీకు కొట్టి తగిలించానంటే ఎంత ముద్దుగా ఆ పిల్లాడి మాటలకు మురిసిపోతారో మీరు అంతగా ఈ పెద్దోడి మాటలకు మురిసి పోతున్నారేమోననిపిస్తోంది. చేసే పనులను బట్టి కాక మనం చూసే చూపును బట్టే అంతా అని మనం నమ్మి తీరాలి. లేకపోతె ఏమిటీ వైరుధ్యం?

      ఏదైతే ఏం లెండి, మన ఈ చప్పట్లకి అంతెక్కడలెండి, నేను రెండుసార్లు కొడితే, మీరు నాల్గు సార్లు కొడతారు.
      నాకన్నా మీకన్నా ప్రజలు తెలివి గల వాళ్ళని రేపటి ఎన్నికలు ప్రూవ్ చెయ్యాలని ఇద్దరం కోరుకుందాం. స్వస్తి.

      Delete
    14. మీ సుధీర్ఘమైన వ్యాఖ్యలో ఒప్పుకునితీరాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కానీ నేను అడిగిన ఒకే ఒక ప్రశ్నకు మాత్రం మీ దగ్గర సమాధానం రాలేదు. చంద్రబాబు గారికి కాకుండా ఎవరికి ఓటు వేయాలి ?

      Delete
    15. మా ఊరిలో ఒక అతను ఆటోనగర్లో పనిచేస్తుంటాడు. రోజుకి 2000 సంపాదిస్తాడు. మొన్న తన కూతురికి పెళ్ళి చేసారు. పెళ్ళిలో సెట్టింగులు, చాట్ స్టాల్స్, స్టార్టర్స్, కూల్ డ్రింక్స్, బఫే లో 50 రకాల ఐటెంస్, డ్రోన్ తో వీడియోలు, పెళ్ళికూతురు పెళ్ళికొడుకు కలిసి తీసుకున్న డ్యూయెట్ వీడియో షూట్ వగైరాతో జరిగిన వివాహాన్ని చూసిన నాకు మాట రాలేదు. వారి జీవనవిధానానికి పెళ్ళికి సంబంధమే లేదు.

      ఎందుకు చెప్తున్నానంటే
      యధా ప్రజా తధా రాజా !

      Delete
    16. 2014 ఎన్నికలకు ముందు మోదీ యూట్యూబ్లో రోజూ ప్రకటనలు ఇచ్చేవారు. వారికి ప్రత్యేకంగా ఎన్నికల ప్రచారానికి ఒక వ్యాపార సంస్థ తరహాలో సీ ఈ ఓ ని కూడా ఏర్పాటు చేసారు. ఎన్నిక కాకుండానే అన్నికోట్లు ఎక్కడనుండి వచ్చాయని మన విజ్ఞతకలిగిన ఓటర్లు మీలాగా ఆలోచించలేదు సుమా ! యాగానికి 100కోట్లు ఎలా వచ్చాయో, అమ్మవారికి ముక్కుపుడక దగ్గరనుండి మ్రొక్కులు తీర్చుకోడానికి కోట్ల రూపాయల ప్రజా ధనం ఎలా ఖర్చు చేసిందీ యాదాద్రీశుడికి కూడా తెలీదు.
      ఇవన్నీ ఎన్నికల్లో పట్టించుకుంటారటండీ ?

      Delete
    17. మా నాయనమ్మ ప్రతీ సంవత్సరం ఒక తీర్ధయాత్రకు బయలుదేరేది.తీర్ధయాత్ర అనగానే మా తాతగారు భయపడిపోయేవారు. ఎక్కడికి వెళ్ళినా దణ్ణం పెట్టుకుని మ్రొక్కు తీర్చుకుని రాకుండా అక్కడ ఓ సత్రం కట్టించమని పోరుపెట్టేదట. తిరుపతితో సహా ప్రతిచోటా మా తాతగారు సత్రాలు కట్టించారు.
      రాజకీయాల్లో తిరుగుతున్నాక కేసీఆర్ లాంటివాడికే స్వంత హెలికాఫ్టర్ ఉంటే చంద్రబాబుగారికెంత ఉండాలి ?

      Delete
    18. మీరు కటౌట్స్ మాత్రమే చూసారు.

      ఈ వీడియో తెలంగాణా విలేఖరులు చేసింది చూడండి.
      https://youtu.be/C4F37FCYfRg

      Delete
    19. కాంగ్రెస్ తో చంద్రబాబుగారు ఎందుకు జట్టు కట్టారో కేటీఆర్ గారి మాటలలో వినండి.

      https://youtu.be/OF-16YqoJiY

      Delete
    20. మేము ఆంధ్రాలో ఒక ఇల్లు కట్టుకున్నాము.మావారు రిటైరయ్యాక అక్కడికి వెళ్ళాలి అంటే నాకు ఇప్పటినుండే దిగులుగా ఉంది. నాది ఆంధ్రా అయినా ఇక్కడ అలవాటు అయ్యాక అక్కడికి వెళ్ళబుద్ధి కావడం లేదు. రాష్ట్రం విడిపోయాక చంద్రబాబుగారు మాత్రమే వెళ్ళారు. ఈ ఒక్క కారణంతో ఓటు వేయవచ్చు.కబుర్లకన్నా ఆచరణ ముఖ్యం కదా ?

      Delete
    21. @ నిహారిక
      ఒక్కో గోడపై ఒక్కో థీమ్. అయ్యో రామా మీరు క్షేత్ర స్థాయిలో చూసింది ఇదా! గోడలకు రంగు పులమడాలా! The colors sure look attractive, to the eyes, on walls, but calling that development? I leave it to your honorable judgement my lord. You would know the reality only when you see what really lurks behind the paint, the onlooking makeover.

      ప్రజలే అంత దర్జాగా ఖర్చు పెడుతున్నప్పుడు రాజెందుకు వెనకబడాలంటారు మీరు? నేటి మేటి థియరీ నెమో మీది! కెసిఆర్ కే స్వంత హెలికాప్టర్ ఉంటే చంద్రబాబు కింకెంత ఉండాలన్న మాథ్స్ కూడా కాలానుగుణ అభిప్రాయమే మరి! మీరన్న మాటే ఆ ఇద్దరూ కూడా అనుకుని కూడబలుక్కుని ఇంకా పైపైకి తప్పక ఎదుగుతారులెండి.

      "రాష్ట్రం విడిపోయాక చంద్రబాబుగారు మాత్రమే వెళ్ళారు. ఈ ఒక్క కారణంతో ఓటు వేయవచ్చు"---- ఏమంటిరి ఏమంటిరి ! చంద్రబాబు గారు వెళ్ళారా? వెళ్లగొట్ట బడ్డారా? విభజన తర్వాతే ఆయన 200 కోట్ల పైబడి ఖర్చుతో హైదరాబాద్ లో రాజమహల్ నిర్మించుకుంటిరని వింటిమే? అయిననూ ఆయన ఇప్పుడు ఉంటున్నది కిరాయి గృహమే గాని స్వంతది కాదే? ఏమైననూ ఆ కారణం చాలన్న మీ విశాల హృదయానికి నమోవాకములు తల్లీ.

      నిజాయితీగా ఓ మాట చెప్పుండ్రి - అధికారం ఖాయంగానో, అప్పనంగానో, దొరుకుందంటే లగెత్తనోళ్ళేవరంటారు? పక్కనున్న రాష్రమేంటి, పరాయి దేశమైననూ పరుగు పెట్టేదమే! మీది ఉదార హృదయం గనుక ఆ లగెత్తినోళ్లకు ఊరికి ఉపకారి అనే టాగ్ తగిలిస్తారు. పేరైతే మీరు పెట్టగలరు గానీ ఓం బీమ్ బుష్ అంటూ వాళ్ళను హీరో చలం చెయ్యలేరు కదా?

      "కబుర్లకన్నా ఆచరణ ముఖ్యం కదా ? " == బాగా చెప్పారు. సరిగ్గా మెజారిటీ ప్రజలు కూడా ఇదే అనుకుంటున్నారు ---- ఇదేంటి ఎప్పుడు చూసినా కబుర్లే చెబుతాడు ఆచరణ ఎక్కడ ? అని.
      సర్లెండి ఇది ముగించగలిగిన వాదం కాదు లెండి.

      "చంద్రబాబు గారికి కాకుండా ఎవరికి ఓటు వేయాలి ?" ----- ఆయనకే ఓటు వేసినప్పుడు ఎవరికేస్తే మాత్రం ఏమిటిట? ఆయన లేకపోతె రాష్ట్రం చీకటి కమ్మేస్తుందా? తలకిందులుగా వేలాడుతుందా? పోలవరంలో భూమికి బీట్లిచ్చినట్లు రాష్ట్రమంతా పగుళ్ళొస్తాయంటారా?

      కేవలం అయిదు లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయినా జగన్ కు కూడా ఈయనకున్నంత ఆదరణ ఉన్నట్లే కదా? అవినీతి ఆరోపణలు ఈయన మీదా ఆయన మీదా లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి కదా? బరిలో ఉన్నవాళ్ళంతా వెధవలే అయినప్పుడు రెండో వాడికి, ఆపై మూడో వాడికి కూడా అవకాశమిచ్చి ఎవరు మెరుగో తేల్చుకోవచ్చు కదా!

      సరైనోడికి ఆలోచించి ఓటేస్తే పోయేదేం లేదు - ఉన్నోడి అధికారం ఊడటం తప్ప - తలకెక్కిన అహంకారం దిగటం తప్ప!

      Delete
    22. Anonymous,
      ఇదేంటి ఎప్పుడు చూసినా కబుర్లే చెబుతాడు ఆచరణ ఎక్కడ ?

      దేంట్లో ఆచరణ కనిపించలేదు మీకు? పోలవరం శరవేగంగా నడవట్లేదా, రాజధానిలో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్‌లు, కోర్ట్ కాంప్లెక్స్ పూర్తి కావస్తోంది చూడట్లేదా, చిత్తూర్లో శ్రీసిటీ మొబైల్ హార్డ్‌వేర్ హబ్ అవ్వలేదా, దేశంలోనే అతిపెద్ద ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ఒకటైన కియా మోటర్స్ అనంతపూర్లో కనిపించటం లేదా, లోటు బడ్జెట్‌లో ఐనా సంక్షేమ పధకాలు నడవట్లేదా, ప్రకౄతి విపత్తులకు గురైన ప్రాంతాలను గాడిలొ పెట్టట్లెదా, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు కేంద్రం ఇచ్చే అవార్డులు ప్రతి ఏడాది తెచ్చుకోటం మీ ద్రుష్టికి రాలెదా.

      Delete
    23. తెలంగాణా వాళ్ళు చావుదెబ్బకొట్టినా ఆంధ్రుల అహంకారం కొంచెం కూడా తగ్గలేదు. ఆ సరైనోడి కోసమే ఎదురుచూపులు ! పవన్ కళ్యాణ్ కానీ జగన్ కానీ సరి అయిన వాళ్ళు కానేకాదు. ఎవరూ నచ్చకపోతే నోటాకి వేసుకోవచ్చు. నోటా బదులు నారావారే సో బెటరూ !

      ప్రభుత్వాన్ని ఎలా నడపాలో అనుభవం ఉన్న జగన్ గారు ఈ 4 స లూ ఖాళీగా రోడ్లవెంట తిరుగుతుంటే మీలాంటివారికి అభివృద్ధి కనపడకపోవడంలో ఆశ్చర్యం ఏమీలేదు.

      వ్యాపారాభివృద్ధిలో ధనిక రాష్ట్రమైన తెలంగాణాని త్రోసిరాజని ఆంధ్రా మొదటి స్థానాన్ని చేజిక్కించుకోవడం సామాన్యమైన విషయంలాగా మీకు కనిపిస్తుందా ?

      విభజన చట్టంలో అమలు జరుగవలసిన అంశాల గురించి ప్రభుత్వానికి సహకరించనందుకు జగన్, పవన్ ఇద్దరికీ పోటీ చేసే అర్హతే లేదసలు.

      Delete
    24. అనానిమస్ గారు, నీహారిక గారు, దయచేసి ఈ వీడియోను పూర్తిగా, చివరి వరకు చూడగలరు.
      నాకు తెలిసి మీ సందేహాలకు, నా అభిప్రాయాలకు చాలా వరకు, అన్నీ కాకపోయినా, చాలా వరకు
      సమాధానాలు ఈ వీడియోలో, స్థూలంగా దొరుకుతాయి. నిజానికి నేను కొన్ని న్యూస్ పేపర్స్ పోగు చేసుకుని మీ ఇరువురి వ్యాఖ్యలకు జవాబు వ్రాద్దామని కూర్చుంటూ, కొన్ని వీడియో క్లిప్పింగ్స్ జత చేద్దామని యూట్యూబ్ వెతుకుతుంటే వాటన్నిటి సారాంశం దీన్లో ఒక్కదాన్లోనే నాకు ఉన్నట్లనిపించింది. దయచేసి చూడగలరు. అయినప్పటికీ మీకు ఒప్పుకుంటానికి మనస్కరించనట్లయితే మీ దారి మీది, నా దారి నాది, ఎందుకనంటే ఏ రెండు సమాంతర రేఖలు కలవవు గనుక - మున్ముందుకు వాదాన్ని పొడిగించడంలో సహేతుకత ఉండే అవకాశం లేదు గనుక. ఒప్పుకుంటారనుకుంటాను. thanks to both of you for the lively interaction.

      చదువరులందరికీ గమనిక - దయచేసి మీరు గనుక ఈ వాదోపవాదాలను గనుక గమనిస్తూ ఉండి ఉన్నప్పటికీ, లేకున్నప్పటికీ ఈ వీడియో ను తప్పక చూడగలరు.

      https://www.youtube.com/watch?v=ls0tQT_fdV0
      (https://www.youtube.com/watch?v=15aM6iiDqwk)

      అలాగే చంద్రబాబు గారి వ్యక్తిత్వపు తీరును కళ్ళకు కట్టేట్లు
      ఉండవల్లి గారు వర్ణించిన మరో వీడియో ఇక్కడ :

      https://www.youtube.com/watch?v=82TR7BHMB-g&t=2s

      Delete
    25. నిన్ననే బుద్ధా మురళి గారు చాలా మంచి వ్యాసం వ్రాసారు. తెలంగాణా వారు ఎదగకపోడానికి ఆంధ్రావారే కారణం అన్నవారికి ఈ వ్యాసం ఒక చెంపపెట్టులాంటిది.

      http://amruthamathanam.blogspot.com/2018/12/blog-post_17.html?m=1

      అధికారంలో ఉన్నపుడు కాంగ్రెస్ వారిని అందరూ(ఖర్మతో సహా) విమర్శించినవారే ! 2 జీ స్కాం గురించి కాగ్ ఎత్తిచూపింది అని అన్నారు. ఒకవైపు కాగ్ రిపోర్ట్ కి సమాధానం చెప్పండి అని ప్రెస్ మీట్ పెట్టి కాగ్ చెప్పినదాన్ని కోర్టు కొట్టివేస్తే తప్పు ఎవరిది ? మరి కోర్టు ఎందుకు వదిలేసింది. అది కూడా ఉండవల్లిగారే చెప్పారు.మీరంతా గొప్ప గొప్ప వాళ్ళు ఇంత చిన్న లాజిక్ మీకు అర్ధం కావడం లేదా ?

      అధికారంలో ఇపుడు తెరాస ఉంది కాబట్టి సంపన్నులగురించి నీతులు చెపుతున్నారు. వాళ్ళు అధికారంలో లేనపుడు కొడుకుకి పట్టాభిషేకం చేస్తున్నారు, అంతా హైకమాండ్ చేతిలో ఉంది అని కేసీఆర్ ఎన్ని తిట్లు తిట్టారో మరిచిపోయారా ? ఇపుడు వాళ్ళు చేస్తిన్నది ఏమిటి ? కేసీఆర్ గారు కూడా కొడుకుకే పట్టాభిషేకం చేయలేదా ? ఎవరు కొడుకులను వదిలేసుకున్నారు ? అపుడు విమర్శించడానికి కాంగ్రెస్ మాత్రమే దొరికింది. ఇపుడు చంద్రబాబు గారు దొరికారు.

      Delete
    26. ఇన్ని చర్చలు అనవసరం ఏ ఒక్క వ్యక్తి అయినా ధైర్యంగా హైదరాబాద్ గడ్డపై నిలబడి కాళేశ్వరం ప్రాజెక్టులో గానీ, మిషన్ భగీరధ, మిషన్ కాకతీయలో గానీ అవినీతి జరగలేదని చెప్పమనండి.బ్రతుకమ్మ చీరలు, రైతుబంధు పధకం, ఉచితబోజనాలు ఇవన్నీ ఎవరి ప్రయోజనాలకోసం చేస్తున్నారో చెప్పమనండి.

      అన్న క్యాంటీన్ లోనే అవినీతి కనపడిందా ? చంద్రబాబుగారు చేసేదంతా కేసీఆర్ పధకాలే! ఇక్కడ కిట్లు ఇస్తే అక్కడ కిట్లు ఇస్తున్నారు.ఇక్కడ ఏ పధకం వస్తే అది ఆంధ్రాలో కావాలని ప్రజలే అడుగుతున్నారు. మీసమున్నోడు ఎవడైనా వచ్చి కేసీఆర్ కి నాలుగు వాతలు పెడ్తే అంతా సక్కగ అయితది.

      Delete
  3. @నీహారిక:

    ఫరవాలేదు లెండి గుడ్డిలో మెల్లన్నట్టు హస్తం గుర్తుపై గెలిచిన 19 అభర్ధులలో పన్నెండుగురు నిఖార్సయిన కాంగ్రెస్ వాదులు. తత్తిమ్మా ఏడుగురిలో కూడా జగ్గారెడ్డి & సీతక్క ఇద్దరే సిసలయిన పచ్చ బాచీ కోవర్టులు.

    ReplyDelete
  4. Uttam Kumar Reddy's constituency headquarter Huzurnagar was once a part of Madras state. Munagala zameendari estate was a part of Madras province but surrounded by Hyderabad state. Since Uttam Kumar Reddy was from such border constituency, he never supported Telangana movement. Since T-Congress' senior most leader does not have Telangana soul, it was easily defeated in this election.

    ReplyDelete
  5. తెలగాణ ప్రజలు విఙ్ఞులు ,
    తెలివిగ , మన బాబు తెలివి తేటల బురిడీ
    వలలో పడలేదు , తమకు
    వలసిన దేదో తలచిరి , వందన మిడుదున్ .

    మన ఆంధ్రా జన మింకా
    ఘన విఙ్ఞులు గద ! రేపు కనమా ! బురిడీ
    ఘనునికి పట్టము కట్టెద
    రొ ! నెగడి , కాక , గణుతింతురో తమ మేలున్ .

    ReplyDelete
  6. విభజించి ఆంధ్రకు విద్రోహ మొనరించి
    ఘనశత్రువై నిల్చె కాంగిరేసు ,
    విభజన తోడుగా విద్రోహ మొహరించి
    తదుపరి బీజేపి తాను నిలిచె ,
    పాలనా రతుడని బాబు నెంపిక చేయ
    సొంత మనుజుల చేత చింతదీర్చె ,
    రాజధానీ లేదు ప్రజల బాగూ లేదు
    నాయకుల్ దోపిడీ చేయ బట్టి ,

    మొదటి శత్రువు కాంగ్రెసు , మది దలంప
    రెండు బీజేపి , మూడు సారించి చూడ
    తెలుగు దేశము శత్రువుల్ , తెలియ నొకటి
    మించి యింకోటి , మన పుట్టి ముంచినారు .

    ReplyDelete