10 February 2016

మెంటల్ ముఖ్యమంత్రి

మంటలు ఆర్పలేని దద్మమ్మ ప్రభుత్వం
రైలు తగలబడుతుంటే గాడిద పళ్లు తోముతున్నారా..?
చంద్రబాబు తప్పులన్నీ నీవు చేస్తూ...ప్రతిపక్ష నేతపై నిందలు వేస్తావా
దమ్ముంటే తుని ఘటనపై సీబీఐ ఎంక్వైరీనీ ఆదేశించు
చంద్రబాబు నీ క్రిమినల్ మైండ్ సెట్ మార్చుకోః వాసిరెడ్డి పద్మ

హైదరాబాద్ః చంద్రబాబు క్రిమినల్ మైండ్ తో నోటికొచ్చినట్లు మాట్లాడుతూ రాష్ట్రంలో కులాలు, మతాలు, ప్రాంతాలు, మనుషుల మధ్య చిచ్చుపెడుతున్నాడని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. తప్పులన్నీ చంద్రబాబు చేస్తూ ప్రతిపక్ష నాయకునిపై నిందలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏం జరిగినా వైఎస్ జగన్ కు ఆపాదిస్తూ చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు లాంటి మెంటల్ ముఖ్యమంత్రి మరొకరు ఉండరని ఎద్దేవా చేశారు. 

దళితులపై చంద్రబాబు మానసిక దాడి చేస్తున్నారని వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. తప్పు ఒప్పుకొని దళితులకు క్షమాపణ చెప్పాల్సింది పోయి ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయంటూ... చంద్రబాబు క్రిమినల్ మైండ్ తో ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఢిల్లీలో ప్రధానమంత్రి, కేంద్ర మంత్రుల సమక్షంలో ప్రెస్ మీట్ పెట్టి...తునిలో రైళ్లు తగలబెట్టింది రాయలసీమ వాళ్లేనంటూ చంద్రబాబు మాట్లాడడంపై వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటికొచ్చినట్లు అడ్డూ అదుపు లేకుండా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమన్నారు. కులాలు, ప్రతిపక్ష నాయకునిపై బురదజల్లడం మానుకోవాలని చంద్రబాబుకు హితపు పలికారు. 

తుని  రైల్వేస్టేషన్ లో ఓ రైలు తగలబడుతుంటే దాన్ని ఆర్పలేని దద్దమ్మ ప్రభుత్వం ఏపీలో ఉందని పద్మ ఆక్రోషించారు. అక్కడ జరుగుతున్న ఉద్రేక సంఘటనలను అదుపుచేయలేని అసమర్థ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయామన్న ఆందోళనతో ఓ సామాజిక వర్గం సభ నిర్వహిస్తుంటే....అక్కడ ఒక్క పోలీసు లేడు. మీ పోలీసులు, డీజీపీ గాడిదలు కాస్తున్నారా. మీ గుర్రాలకు పళ్లు తోముతున్నారా అంటూ చంద్రబాబుపై పద్మ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. తుని ఘటనపై సీబీఐ ఎంక్వైరీని ఎందుకు ఆదేశించలేదని బాబును నిలదీశారు. అదేపనిగా వైఎస్ జగన్ మీద బండలు వేయడం చంద్రబాబుకు పరిపాటిగా మారిందని పద్మ ఫైరయ్యారు. దమ్ముంటే ఆధారాలు బయటపెట్టాలని సవాల్ విసిరారు. 

తునిలో పరిస్థితి అదుపులోకి రాకముందే...రాయలసీమ వాళ్లు చేశారంటూ చంద్రబాబు ఆధారాలు లేకుండా ఏవిధంగా మాట్లాడుతారని పద్మ ప్రశ్నించారు. ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు వైఎస్ జగన్ ను శత్రువును చేసి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అందుకోసం చంద్రబాబు ఏ వేదికనైనా ఉపయోగించుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇది చిన్న పిల్లల ఆటలు కాదని, రాష్ట్రానికి ముఖ్యమంత్రివి అన్న విషయం మర్చిపోవద్దన్నారు. ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలేదన్న విధంగా చంద్రబాబు వ్యవహరించారని దుయ్యబట్టారు. తుని ఘటనపై  రాష్ట్రంలోని ప్రతి  వేలు చంద్రబాబు వైపే చూస్తోందన్న విషయం మరవద్దన్నారు. 

రాష్ట్రంలో ఏది జరిగినా వైఎస్సార్సీపీకి పూయండి అంటూ ...చంద్రబాబు తెలుగుదేశం వాళ్లను ఉసిగొల్పుతున్నాడని వాసిరెడ్డి పద్మ అన్నారు. మీరు ముఖ్యమంత్రా, రౌడీస్థానంలో కూర్చున్నారా అంటూ చంద్రబాబుపై పద్మ విరుచుకుపడ్డారు. ప్రతిపక్షంపై దాడి చేయడం కోసం చంద్రబాబు ఎన్ని అబద్దాలైనా మాట్లాడుతారని తూర్పారబట్టారు. గుంటూరులో చంద్రబాబు మనుషులు పంటలు తగలబెట్టి...వైఎస్ జగన్ పై నిందలు మోపారు. చంద్రబాబు మీ క్రిమినల్ మైండ్ సైట్ ఎటు వెళుతుందని పద్మ ప్రశ్నించారు. నేరస్తుని చేయాలంటే మీ బామ్మర్దిని చేసుకోండి . అంతేగానీ టార్గెట్ చేసి ప్రతిపక్ష నేతను విమర్శించడం మానుకోవాలన్నారు. 

బాధ్యత గల ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని పద్మ బాబును హెచ్చరించారు. చంద్రబాబు వ్యాఖ్యలతో దళితులు అమానవీయ పరిస్థితుల్లో ఉన్నారని వాసిరెడ్డి పద్మ అన్నారు. దళితుల హక్కులను కాపాడడం ప్రధానమైన బాధ్యత అని దేశం అనుకుంది కాబట్టే...చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ తీసుకొచ్చామన్నారు. ఎస్సీ కులంలో పుట్టడం ఎవరు కోరుకుంటారంటూ..చంద్రబాబు మాట్లాడడం దుర్మార్గమన్నారు. ప్రజాజీవితంలో ఉన్న వ్యక్తికి సహనం, వివేకం ఉండాలని బాబుకు చురక అంటించారు. 

No comments:

Post a Comment