20 February 2016

ముఖ్యమంత్రి అయ్యాక ఒక్కసారిగా స్టయిల్ మార్చిన చంద్రబాబు

* రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు దక్కలేదు
* రుణమాఫీ వంటి హామీలు అమలు చేయలేదు
* ప్రత్యేక విమానాల్లో ప్రయాణాలు మాత్రం చేస్తున్నారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి గా చంద్రబాబు అధికారంలోకి వచ్చి దాదాపు 20 నెలలు దాటుతోంది. ఎంతో చేస్తాం.. ఏదేదో చేస్తాం అంటూ గ్రాఫిక్ మాయా జాలం చూపించి గద్దె నెక్కిన చంద్రబాబు .. ప్రజలకు ఉపయోగ పడే పని ఒక్కటంటే ఒక్కటి చేయలేదు. కానీ, ప్రజల సొమ్ముని మాత్రం విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు.
          చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఒక్కసారిగా స్టయిల్ మార్చేశారు. ప్రయాణాలకు విమానాల వాడకం ఎక్కువైంది. అది కూడా ప్రత్యేక విమానాలు బుక్ చేసుకొని వాటి మీద ప్రయాణం సాగిస్తున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి మద్య ఈ ప్రత్యేక విమానం తీసుకొని, దాంట్లో ప్రయాణం సాగిస్తున్నారు. నగరాల మధ్య కూడా విమానాల్నే పెద్ద సంఖ్యలో వినియోగిస్తున్నారు. వందల సంఖ్యలో విమాన ప్రయాణాలు చేస్తున్నారు.  ఈ ఖర్చంతా వెరిసి ప్రజల నెత్తినే పడుతోంది. చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చిన త‌ర‌వాత 23 సార్లు దేశ రాజ‌ధానికి వెళ్ళారు. మొత్తం 27 రోజు లు అక్క‌డ గ‌డిపారు. ద‌క్షిణాదిలోని ఐదు రాష్ట్రాల‌లో ఏ ముఖ్య‌మంత్రీ ఈ ఘ‌న‌త సాధించ‌ లేదు. ఫ‌లిత‌మేమైనా ద‌క్కిందా అంటే అదీ లేదు. శంకుస్థాపన సమయంలో చెంబుడు నీళ్లు, చెంబుడు మట్టి తప్ప నేరుగా కేంద్రం నుంచి కొత్త ప్రాజెక్టుని సంపాదించలేదు. పైగా విభజన చట్టంలో హామీ ఇచ్చిన విద్యాసంస్థల్నే పూర్తిగా ఏర్పాటు చేయలేదు.
         ఇక, విదేశీ ప్రయాణాల గురించి చెప్పనే అక్కర లేదు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రత్యేక విమానాల్లో మందీ మార్భలం వెంట పెట్టుకొని చక్కర్లు కొట్టి వస్తున్నారు. ఆసియాలోనే ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసుకొని ఐదు దేశాల్లో పర్యటించారు. మొత్తం ఏడుసార్లు విదేశీ యాత్రలు చేశారు. దాదాపు 30 రోజులు అక్క‌ డ గ‌డిపారు. రెండుసార్లు సింగ‌పూర్, జపాన్‌, దావోస్‌ వెళ్ళారు. కానీ రాజధాని పేరుతో వేల ఎకరాలు చంద్రబాబు సింగపూర్ బినామీ సంస్థలకు ఇచ్చేశారు తప్పితే విదేశీ సంస్థలేమీ తమ ప్రాజెక్టులను ఇక్కడ ఏర్పాటు చేయలేదు.
        చంద్రబాబు చలవతో కొత్త ప్రాజెక్టులేమీ రానే రాలేదు. కనీసం విభజన చట్టంలో హామీలను అమలు చేయటానికి కేంద్రం మీద ఒత్తిడి తేలేదు. ఫలితంగా  2014-15లోని 7300కోట్ల లోటు బ‌డ్జెట్.. 2016-17కి 16 వేల కోట్ల రూపాయ‌ల‌కు చేరుకుంటోంది. అయినప్పటికీ చంద్రబాబు ఏమాత్రం తగ్గకుండా యాత్రల జోరుని కొనసాగిస్తున్నారు. 

No comments:

Post a Comment