23 February 2016

చంద్రబాబుకి నీతి, నిబద్దతత ప్రజాస్వామ్య విలువలు తెలుసా...?

బాబు వాపు చూసి బలుపు అనుకుంటున్నాడు
దొంగకేసులు, అక్రమ సూట్ కేసులతో ప్రలోభ పెట్టి..
ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నాడు
ఎప్పుడు ఎన్నికలొచ్చినా టీడీపీ కుప్పకూలుతుంది
వైఎస్ జగన్ కు రాష్ట్రనాయకత్వాన్ని అప్పగించాలని..
ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్నారుః జ్యోతుల

హైదరాబాద్ః వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, శాసనసభా పక్ష ఉనేత జ్యోతుల నెహ్రూ టీడీపీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. చంద్రబాబు రాష్ట్రంలో రాజకీయ వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు పరిపాలన చేయమని అధికారమిస్తే.....ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ బాబు నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నాడని దుమ్మెత్తిపోశారు.  రాష్ట్రంలో వైఎస్సార్సీపీ బలోపేతాన్ని చూసి ఓర్వలేక పార్టీని నిర్వీర్యం చేయాలన్న కుట్రతో ... చంద్రబాబు నీచ సంస్కృతికి పాల్పడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగ కేసులు, అక్రమ సూట్ కేసులతో ప్రలోభ పెట్టి చంద్రబాబు ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారని మండిపడ్డారు. 

చంద్రబాబుకు దమ్ముంటే పార్టీలో చేరిన వారితో రాజీనామా చేయించి ఎన్నికలకు సిద్ధం కావాలని జ్యోతుల సవాల్ విసిరారు. భూమా నాగిరెడ్డికి వైఎస్సార్సీపీ ఇంకో అవకాశం ఇస్తుందని...నియోజకవర్గంలో కోరుకున్న వ్యక్తిని తనపై పోటీకి ఎంచుకొని గెలవాలని ఛాలెంజ్ చేశారు. ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన  ఇద్దరు వైఎస్సార్సీపీ ఎంపీలను ప్రలోభ పెట్టి పార్టీలోకి తీసుకున్న చంద్రబాబు... అధికారదాహం చాలక ఇప్పుడు మరో నలుగురు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీని చేర్చుకోవడంపై  జ్యోతుల ధ్వజమెత్తారు.  మాట్లాడితే నీతి, నిబద్ధత అని మాట్లాడే చంద్రబాబుకు...ఏమాత్రం ప్రజాస్వామ్య విలువలు తెలుసో అర్థం కావడం లేదని ఎధ్దేవా చేశారు.  ఎన్నికల హామీలు నెరవేర్చని చంద్రబాబుపై అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని జ్యోతుల అన్నారు. 

కేసీఆర్ టీడీపీ ఎమ్మెల్యేలను దౌర్జన్యంగా తీసుకుంటున్నారని మాట్లాడిన చంద్రబాబు..మరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను తీసుకోవడం ఏవిధంగా నిబద్ధత అనిపించుకుంటుందో చెప్పాలన్నారు. హామీలు అమలు చేసే చిత్తశుద్ధి లేక...జిమ్మిక్కులతో పార్టీని బలహీనపర్చాలన్న దురాలోచనతో చంద్రబాబు కుయుక్తులు పన్నుతున్నాడని జ్యోతుల ఫైరయ్యారు. బాబు నీవు ఎంత ఇలాంటి కార్యక్రమాలు చేస్తే అంత కుప్పకూలిపోవడం ఖాయమన్నారు. రోజురోజుకు  టీడీపీ బలహీనపడుతుందునే చంద్రబాబు నీతిమాలిన పనులు చేస్తున్నాడన్నది తేటతెల్లం అవుతుందన్నారు. బాబు చిన్నగీత పక్కన పెద్ద గీత గీస్తూ వాపును చూసి బలుపు అనుకుంటున్నాడని దుయ్యబట్టారు. 

ప్రజలు వైఎస్ జగన్ ను విశ్వసిస్తున్నారని జ్యోతుల తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా...  వైఎస్ జగన్ కు రాష్ట్ర నాయకత్వం అప్పగించాలని ఆతృతతో ఎదురుచూస్తున్నారని చెప్పారు. అది గ్రహించే చంద్రబాబు నీచ పనులు చేస్తున్నాడన్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే  టీడీపీ నిర్వీర్యం అవ్వడం ఖాయన్నారు. నీ మైండ్ గేమ్ కు లొంగే వ్యక్తులు పోయారని, ఇక  నీవు సాధించేదేమీ లేదన్నారు. పార్టీ వీడిన వారిపై పార్టీ పరంగా, లీగల్ గా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు కూడా చంద్రబాబుపై చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని, సరైన సమయంలో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 

No comments:

Post a Comment