15 February 2016

రాజ‌ధాని నిర్వాసితుల‌కు చంద్ర‌బాబు షాక్‌

* కొత్త నిబంధ‌న‌లు అమ‌ల్లోకి తెస్తున్న బాబు
* కుటుంబంలో ఒక‌రికే పెన్ష‌న్‌
* ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నా పెన్ష‌న్ ఇచ్చేది లేద‌ని స్ప‌ష్టీక‌ర‌ణ‌

అమ‌రావ‌తి : రాజ‌ధాని ప్రాంతంలో రైతుల నుంచి భూములు లాక్కొనేట‌ప్పుడు క‌ల్ల‌బొల్లి క‌బుర్లు చెప్పిన ప్ర‌భుత్వం ఇప్పుడు త‌న వైఖ‌రిని బ‌య‌ట పెట్టుకొంటోంది.  సీఆర్‌డీఏ ప‌రిధిలో భూములు లేని పేద‌ల‌కు పదేళ్ల పాటు నెల‌కు రూ. 2,500 ఇస్తామ‌ని ప్ర‌భుత్వం హామి ఇచ్చింది. రాజ‌ధాని నిర్మాణం కార‌ణంగా వీళ్లంద‌రూ ఉపాధి కోల్పోతార‌న్న ఉద్దేశ్యంతో ప్ర‌క‌టించిన ఈ పెన్ష‌న్‌కు ఇప్పుడు నిబంధ‌న‌ల‌ను జ‌త ప‌ర్చారు.
భూములు లేని పేద‌ల‌కు ఇచ్చే పెన్ష‌న్ కుటుంబంలో ఒక్క‌రికేన‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఆర్‌డీఏ కార్య‌ద‌ర్శి ఆజ‌య్ జైన్ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేశారు. గ‌తంలో కుటుంబంలో ఒక్క‌రికే పెన్ష‌న్ ఇస్తామ‌ని తాజా మార్గ‌ద‌ర్శ‌కాల్లో ప్ర‌క‌టించ‌డం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది. 2014 డిసెంబ‌ర్ 8కి ముందే అమ‌రావ‌తి కేపిట‌ర్ ఏరియాలో నివ‌సిస్తూ ఉన్న‌వారై, కుటుంబంలో ఎంత‌మంది ఉన్నా ఒక్క‌రికే పెన్ష‌న్‌, పెన్ష‌న్ ద‌ర‌ఖాస్తుదారుడు బ్యాంక్ ఖాతా వివ‌రాల‌తో పాటు ఆఫిడ‌విట్‌ను సైతం పొందుప‌ర్చాలి. ప్ర‌భుత్వం లేదా ప్రైవేటు కార్యాల‌యాల్లో ప‌ని చేస్తూ, ఏడాదికి రూ. 60వేల సంపాద‌న ఉన్న‌వారికి పెన్ష‌న్ వ‌ర్తించ‌దు. భూమి లేని విష‌యాన్ని, దారిద్ర్యరేఖ దిగువ‌న ఉన్నారా అన్న‌దాన్ని త‌హ‌శీల్దార్ నిర్ణ‌యిస్తారు. పెన్ష‌న్ స్కీం సీఆర్‌డీఏ క‌మిష‌న‌ర్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉండి, భూములు ఉన్నాయా లేదా అన్నది క‌లెక్ట‌ర్ స‌మీక్షిస్తే త‌ప్ప ఇది ఆమోదం పొంద‌దు.
భూములు లాక్కొనే స‌మ‌యంలో ఎడా పెడా హామీలు ఇచ్చిన ప్ర‌భుత్వం త‌ర్వాత కాలంలో మాట మార్చింద‌ని రైతుకూలీలు వాపోతున్నారు. అప్పుడే ఈ నిబంధ‌న‌లు బ‌య‌ట పెట్టి ఉంటే ఆందోళ‌న చేసి ఉండేవార‌మ‌ని, ఇప్పుడు త‌మ‌ను ప్ర‌భుత్వం మోస‌గించిందని ఆవేద‌న చెందుతున్నారు. 

No comments:

Post a Comment