* జనంతో మమేకం అయిపోయే జన నేత
* వైఎస్ జగన్ పర్యటనల్లో కనిపించే ఆదరణ
* అన్ని వర్గాల ప్రజలతో కలిసిపోయే ఆప్యాయత

ఈ వారం ప్రారంభంలో వైఎస్ జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళ్లారు. అక్కడ దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహాల్ని ఆవిష్కరించేందుకు వెళ్లారు. ఉదయం విశాఖ ఎయిర్ పోర్టులో దిగిన జన నేత ఆవిష్కరణ స్థలికి వెళ్లేసరికి మధ్యాహ్నం అయిపోయింది. దారి పొడవునా నాలుగు, అయిదు సార్లు ఆయన గ్రామాల కూడళ్ల దగ్గర ఆగారు. వైఎస్ జగన్ రాకను తెలుసుకొని స్థానిక నాయకులు పలకరించేందుకు ఉద్యుక్తులు అయ్యారు. గ్రామాల్లో ఆగి వైఎస్సార్సీపీ నాయకుల మంచి చెడ్డలు తెలుసుకొని వచ్చారు. స్తానికంగా ఉండే కార్యకర్తలు, అభిమానుల్ని పలకరించి ముందుకు సాగారు. సాయంత్రం ఎమ్మెల్యే కలమట వెంకట రమణ ఇంటికి చేరుకొని అక్కడ కుటుంబసభ్యులతో కొద్ది సేపు ఉండి వచ్చారు.

తర్వాత కర్నూలు జిల్లా పర్యటన సాగింది. అమరుడైన జవాన్ ముస్తాక్ అహ్మద్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించటానికి అక్కడకు వెళ్లారు. తెల్లవారు జామునే హైదరాబాద్ లో బయలు దేరినప్పటికీ పార్నపల్లి దగ్గరకు చేరేసరికి మధ్యాహ్నం అయింది. అక్కడ స్థానిక సంస్క్రతి ప్రకారం ప్రార్థనలు చేశారు. అనంతరం నల్ల కలువ దగ్గరకు వెళ్లి స్మ్రతి వనాన్ని సందర్శించారు. అక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల సాధక బాధకాల్ని అడిగి తెలుసుకొన్నారు. ఆ మార్గంలో వెళుతూ తమ బాగోగుల్ని పట్టించుకొన్న జన నేత ఆప్యాయతను చూసి కన్నీటి భాష్పాలు రాల్చారు.

ఈ విదంగా జన నేత వైఎస్ జగన్ తన పర్యటనల్లో ఎక్కువ సమయం అబిమానులు, కార్యకర్తలతో గడిపేందుకు వెచ్చిస్తున్నారు. వైఎస్ జగన్ జరుపుతున్న పర్యటనల తీరుని చూసి గతంలో దివంగత మహానేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి జరిపిన పర్యటనలు, చూపించిన ఆదరణ ను జనం గుర్తు చేసుకొంటున్నారు.
No comments:
Post a Comment