16 February 2016

చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలి

సిపాయి పట్ల ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా
దేశం మొత్తం ముస్తాక్ ను గౌరవిస్తుంటే..
చంద్రబాబు పట్టించుకోకపోవడం దుర్మార్గం
వైఎస్సార్సీపీ పోరాడితే తప్ప సహాయం చేయరా..?
ఇకనైనా కళ్లు తెరువు చంద్రబాబుః వైఎస్ జగన్

 కర్నూలు(పార్నపల్లి): వీరజవాన్ ముస్తాక్ అహ్మద్ పట్ల  ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపడ్డారు.  దేశ మొత్తం సిపాయి ముస్తాక్ ని గౌరవిస్తుంటే.. చంద్రబాబు కనీసం అంత్యక్రియలకు రాకుండా, వారి కుటుంబాన్ని పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. మన  రాష్ట్రానికి చెందిన  సిపాయి, అందులోనూ ఓ ముస్లిం సైనికుడు చనిపోతే...ప్రభుత్వం కనీసం గౌరవించకపోవడం దారుణమన్నారు. ఇందుకు చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలని వైఎస్ జగన్ అన్నారు. 

సానుభూతి లేని సర్కార్..
మొదట్లో ప్రభుత్వం కేవలం రూ. 5లక్షలు ప్రకటన చేయడం హేయనీయమని వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబు నిర్వాకం కారణంగా పక్కన ఉన్న కర్నాటక ప్రభుత్వం...చనిపోయిన సిపాయి కుటుంబానికి రూ. 25 లక్షలు, ఇళ్లు, పొలాలు, ఉద్యోగాలిచ్చారని ధర్నాలు, దీక్షలు చేయాల్సి వచ్చిందని జననేత చెప్పారు. మృతుని కుటుంబసభ్యులతో కలిసి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ధర్నాలు చేయడం వల్ల, తాను అంత్యక్రియలకు వెళ్తున్నానని తెలిసి...అప్పుడు టీడీపీ సర్కార్ రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ను రూ. 25 లక్షలు చేసిందన్నారు. అది కూడా సానుభూతితో చేయలేదని, వైఎస్సార్సీపీ న్యాయపోరాటం చేస్తే తప్ప ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించకపోవడం బాధాకరమన్నారు.


ఇకనైనా కళ్లు తెరువు బాబు..
సిపాయి చనిపోతే  కేబినెట్ లో కనీసం నివాళులు కూడా అర్పించకపోవడం దారుణమని  వైఎస్ జగన్ మండిపడ్డారు. చంద్రబాబుకు ఇకనైనా జ్ఞానోదయమై మానవతా దృక్పథంతో ఆలోచన చేసి కాస్త ముందంజలో ఉండాలని వైఎస్ జగన్ సూచించారు. కనీసం ఇచ్చేవైనా మాట తప్పకుండా చేయాలన్నారు. ఆ ఆకుటుంబానికి ఇళ్లు, భూమి, పొలంతో పాటు ఉద్యోగం కల్పించాలన్నారు.  

దేశంతో పోటీపడండి బాబు..
దేశభద్రత కోసం ముస్లింలు కూడా ఏస్థాయిలో కష్టపడుతున్నారని చెప్పే సంఘటన జరిగింది. ఇలాంటి ఘటన జరిగినప్పుడు, సహాయం చేయడంలో ప్రభుత్వం ముందడుగు వేయకపోవడం దురదృష్టకరమన్నారు. దేశ భద్రత కోసం ఓ సైనికుడు చనిపోయినప్పుడు...దేశమొత్తం మనవైపు చూసేలా, ఓరోజు సెలవు ఇచ్చి ఆదుకొని ఉంటే బాగుండేదని జననేత అన్నారు. ఇప్పటికైనా సిపాయి కొరకు హానర్స్ తెలుపుతూ ప్రభుత్వం సెలవు ప్రకటించాలన్నారు. కర్నాటకతో కాదని దేశంతో పోటీపడాలని ప్రభుత్వానికి హితవు పలికారు. అతి మెరుగైన ప్యాకేజీ ఇచ్చి ఆకుటుంబానికి తోడ్పడాలని సూచించారు. 

No comments:

Post a Comment