18 February 2016

ఆర్టీసీ ఎన్నికల్లో ఇది ప్రధాన అంశంగా నిలుస్తోంది

* ఆర్టీసీ ని పరిరక్షించేందుకు వైఎస్సార్సీపీ ఉద్యమం
* కార్మికులు, ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యం
* టేబుల్ ఫ్యాన్ గుర్తుతో బరిలోకి దిగిన వైఎస్సార్సీపీ మజ్దూర్ యూనియన్
హైదరాబాద్: అధికారంలోకి వచ్చాక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని వైఎస్సార్సీపీ ఇచ్చిన హామీ .. ఆర్టీసీ కార్మిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గురువారం అంటే ఈ నెల 18న జరగబోయే ఆర్టీసీ ఎన్నికల్లో ఇది ప్రధాన అంశంగా నిలుస్తోంది. మొత్తం మీద ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ గట్టి పోటీ ఇస్తోంది.
గురువారం ఉదయం నుంచి సాయంత్రం దాకా 13 జిల్లాల్లోనూ ఆర్టీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో వేల సంఖ్యలో సిబ్బంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. గుర్తింపు యూనియన్ ఎన్నికలు కాబట్టి వ్యక్తిగతంగా కాకుండా, యూనియన్ల పరంగానే ఎన్నికలు జరుగుతాయి. ఇందులో రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. రీజియన్ స్థాయికి ఒక ఓటు, రాష్ట్ర స్థాయి యూనియన్ కు ఒక ఓటు వేయాలి. గెలిచిన తర్వాత ఆయా యూనియన్లు తమ కార్యవర్గాన్ని నియమించుకొంటాయి.
ఆర్టీసీ ఎన్నికల్లోకి బరిలోకి దిగుతున్న వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ అన్ని ప్రధాన డిపోల దగ్గర విస్తారంగా ప్రచారం చేసింది. ముఖ్యంగా వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. దీంతో పాటు ఉద్యోగులు, కార్మికుల సంక్షేమమే ప్రధాన అజెండా గా తొమ్మిది అంశాలతో ప్రచారాన్ని నిర్వహించింది. దీని మీద కార్మిక వర్గాల్లో చక్కటి స్పందన వ్యక్తం అవుతోంది. టేబుల్ ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసేందుకు కార్మికులు పెద్ద ఎత్తున సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్లు యూనియన్ నాయకులు చెబుతున్నారు. 

No comments:

Post a Comment