10 February 2016

కేసుల సంగ‌తి ఏమిటి..!

* కొండంత కేసుల చిట్టా
* కేసుల ఉప‌సంహ‌ర‌ణ‌లోనూ రాజ‌కీయం
* జిల్లా పోలీసు అధికారుల మీద ఒత్తిడి

కాకినాడ‌: కాపుల రిజ‌ర్వేష‌న్ డిమాండ్ తో మాజీమంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం మొద‌లు పెట్టిన నిరాహార దీక్ష ను విర‌మించారు. ప్ర‌భుత్వ ప్ర‌తిపాద‌న‌ల్ని ఆమోదించిన‌ట్లు ముద్ర‌గ‌డ ప్ర‌క‌టించారు. కానీ కేసుల విష‌యంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.

కొండంత కేసుల చిట్టా
తుని పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోనే 63 దాకా కేసుల్ని న‌మోదు చేసిన‌ట్లు పోలీసు వ‌ర్గాలు చెబుతున్నాయి. వీటిలో 400 మంది దాకా నిందితుల్ని చేర్చారు. వీటిలో 22 కేసుల్లో ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా ముద్ర‌గ‌డ అండ్ అద‌ర్స్ అంటూ మాత్ర‌మే కేసులు పెట్టారు. అంటే త‌ర్వాత ద‌ర్యాప్తు ద‌శ‌ల్లో నిందితుల పేర్ల‌ను ఎక్కువ‌గా చేర్చేందుకు వీలుగా ఎఫ్ ఐ ఆర్ ల‌లో ఖాళీ ఉంచారు. దీన్ని బ‌ట్టి నిందితుల సంఖ్య‌ను పెంచే యోచ‌న ఉన్న‌ట్లు చెబుతున్నారు. ప్రాథ‌మిక స‌మాచారం మేర‌కు తుని నియోజ‌క వ‌ర్గంలో దాదాపు 50 మంది దాకా వైఎస్సార్సీ్పీ నేత‌ల్ని కేసుల్లో పెట్టించారు. వీరిలో 22 మంది బీసీ, ఎస్సీ వ‌ర్గాల‌కు చెందిన వారు. అంటే కాపు గ‌ర్జ‌న‌కు హాజ‌రు కాక‌పోయినా కేసులు పెట్టార‌ని అర్థం అవుతోంది.

ఉప‌సంహ‌ర‌ణ లోనూ రాజ‌కీయం
కేసుల్ని ఉప‌సంహ‌రించే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నా దీని మీద స్ప‌ష్ట‌త లేదు.  ఇప్ప‌టికే కేసులు పెట్టించ‌టంతో జిల్లాకు చెందిన టీడీపీ నేత‌లు చురుకైన పాత్ర పోషించారు. ముఖ్యంగా తుని ప్రాంతానికి చెందిన య‌న‌మ‌ల సోద‌రులు ఈవిష‌యంలో చ‌క్రం తిప్పార‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. ఇప్పుడు కేసులు ఉప‌సంహ‌ర‌ణ‌లోనూ రాజ‌కీయ ప్రాధాన్యాలే పెద్ద పాత్ర పోషించే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.

పోలీసు అధికారుల మీద ఒత్తిడి ఇప్ప‌టికే జిల్లా పోలీసు అధికారుల‌కు సిఫార్స‌లు అందుతున్న‌ట్లు స‌మాచారం. ముఖ్యంగా కేసులు ఎత్తివేసే ప్ర‌తిపాద‌న‌కు సంబంధించిన మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల అయ్యాక చెబుతామ‌ని త‌ప్పించుకొనేందుకు అధికారులు ప్ర‌య‌త్నిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ ఒత్తిడి తీవ్రంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. 

No comments:

Post a Comment