13 February 2016

మాకొద్దు బాబోయ్ ఈ చంద్రబాబు

ప్రతి నోట ఒకటే మాట .. బాబు మాకొద్దని
బాబు పరిపాలనంతా మోసం..మోసం..మోసం
హామీలు విస్మరించాడు..ప్రజలకు తీరని అన్యాయం చేశాడు
ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలని వైఎస్సార్ దేశానికే చాటిచెప్పారుః వైఎస్ జగన్

శ్రీకాకుళంః ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ...చంద్రబాబు మోసపూరిత పాలనపై నిప్పులు చెరిగారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా పైడి భీమవరంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని జననేత ఆవిష్కరించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ...చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రి మాకు వద్దు బాబోయ్ అని ప్రజలు గగ్గోలు పెడుతున్నారని వైఎస్ జగన్ అన్నారు. ఇలాంటి మోసకారి సీఎంను తాము ఎక్కడా చూడలేదని ప్రజలు అంటున్నారని జననేత చెప్పారు. ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలని మహానేత వైఎస్సార్ దేశానికే చాటిచెప్పారని  వైఎస్ జగన్ పేర్కొన్నారు. 

చంద్రబాబు పరిపాలన గురించి రైతన్నను అడిగితే, వారు ఒకటే చెబుతున్నారని...చంద్రబాబు లాంటి మోసగాడు దేశంలోనే ఎవరూ లేరని ప్రతి రైతు నోటా వినిపిస్తోందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఎన్నికల ముందు రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానన్నాడు. బ్యాంకుల్లో బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. బాబయితే ముఖ్యమంత్రి అయ్యాడు గానీ రుణాలు మాఫీ కాలేదని,  రుణాలు చెల్లించాలని బ్యాంకర్లు నోటీసులు పంపిస్తుండడంతో రైతన్నలు లబోదిబోమంటున్నారని వైఎస్ జగన్ చెప్పారు. 

చంద్రబాబు పరిపాలన గురించి డ్వాక్రా అక్కచెల్లెల్లను అడిగితే...అన్నా ఎన్నికలకు ముందు పావలా వడ్డీకే రుణాలు లభించేవి. ఇవాళ బ్యాంకులకు పోతే రూ. 2 వడ్డీ వసూలు చేస్తున్నారు. ఇంత అన్యాయమైన ముఖ్యమంత్రిని జీవితంలో చూడలేదని డ్వాక్రా అక్కాచెల్లెల్లు బాధపడుతున్నారని  వైఎస్ జగన్ అన్నారు. ఎన్నికల ముందు ఏ టీవీ ఆన్ చేసినా ఒకటే వినిపించేది, కనిపించేది. జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్న మాట వినిపిచేంది. బాబు ఐతే ముఖ్యమంత్రి అయ్యాడు, ఉన్న జాబులు ఊడబెరుకుతున్నారని  ప్రతి విద్యార్థి, నిరుద్యోగి చెబుతున్నారని జననేత చెప్పారు. 

ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం లేని వారికి నెలకు రూ. 2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు. అందరికీ ఇళ్లు కట్టిస్తానన్నాడు. ఇవాళ ఇచ్చిన హామీల గురించి నిలదీస్తే...చంద్రబాబు ఖాళీ చేతులూపుతున్నాడు. బాబు పాలన గురించి మూడు మాటల్లో చెప్పాలంటే...మోసం, మోసం, మోసమని వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. ప్రతి  పేదవాడికి అభివృద్ధి ఫలాలు అందించి వైఎస్సార్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని, అందుకే రాజన్నను మర్చిపోలేకపోతున్నారని చెప్పారు.  

No comments:

Post a Comment