29 February 2016

చంద్ర‌బాబునాయుడు జోకులు వేయ‌టంలో దిట్టం

విజ‌య‌వాడ‌ : ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు జోకులు వేయ‌టంలో దిట్టం. అబ‌ద్దాల్నే గ‌ట్టిస్వ‌రంతో చెప్పి న‌మ్మించే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. ఈసారి జాతీయ ఛానెల్ ఎన్డీ టీవీ లో అలాంటి అబ‌ద్దాలే అతికినట్లు చెప్పేశారు. కానీ అస‌లు వాస్త‌వాల్ని అక్క‌డ ఉన్న వారంతా గ‌మ‌నించి న‌వ్వుకొన్నారు. నదీ పరిరక్షణ చట్టాన్ని ఉల్లంఘించి కృష్ణా నది గట్టుపై నిర్మించిన గెస్ట్‌హౌస్‌ను అధికారిక నివాసంగా చేసుకున్న చంద్రబాబు.. ఆ గెస్ట్‌హౌస్‌లోనే ఎన్‌డీటీవీ ‘వాక్ ది టాక్’లో ఇంటర్వ్యూ ఇచ్చారు. కృష్ణా నది గట్టు మీద, గెస్ట్‌హౌస్ లాన్లలో విహరిస్తూ ఆయన చెప్పిన అబ‌ద్దాలు.. అస‌లు వాస్త‌వాల్ని  ఇప్పుడు చూద్దాం..

చంద్ర‌బాబు) ‘నా జీవితం, రాజకీయాలు అంతా పోరాటమయం. నేను ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అందరూ నన్ను అంతం చేయాలనుకున్నారు. ఎన్నో కష్టాలు.. పదేళ్ల పాటు పోరాడి చివరకు నేను నవ్యాంధ్రప్రదేశ్‌కు సీఎం అయ్యాను.
వాస్త‌వం) చంద్ర‌బాబు జీవితమంతా వెన్నుపోట‌ల మ‌యం. అప్పుడు ఎన్టీయార్ కు వెన్నుపోటు పొడిచి ఎమ్మెల్యేల‌ను లాక్కొన్నారు. ఇప్పుడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల‌ను ప్ర‌లోభ పెట్టి ఎమ్మెల్యేల‌ను లాక్కొంటున్నారు.

 
చంద్ర‌బాబు) హైదరాబాద్ నా బ్రెయిన్ చైల్డ్. హైదరాబాద్, సికిందరాబాద్‌లకు నేను సైబరాబాద్‌ను చేర్చాను. నేను హైదరాబాద్‌ను అభివృద్ధి చేశా అన్న ఆలోచనలు వస్తాయి. కానీ.. నేను జనం కోసం హైదరాబాద్‌ను నిర్మించానన్నది వాస్తవం. వారిని అనుభవించనివ్వండి.. నేను మరో నగరాన్ని నిర్మిస్తా.
వాస్త‌వం) సైబ‌రాబాద్ లో ఐటీ ప‌రిశ్ర‌మ‌ల‌కు అంకురార్ప‌ణ జ‌రిగింది. మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహ‌రావు చొర‌వ‌తో అప్ప‌టి సీఎం జ‌నార్ద‌న్ రెడ్డి హ‌యంలో. హైటెక్ సిటీ కి శంకుస్థాప‌న జ‌రిగింది కూడా అప్పుడే. కానీ దానికి రిబ్బ‌న్ క‌టింగ్ చేసి అన్నీ నేనే చేశా అంటే ఎలా బాబు.

చంద్ర‌బాబు) ఆరు నెలల కాలంలో.. గోదావరి నుంచి కృష్ణాకు నేను నీళ్లు తీసుకురాగలిగాను. ఈ ఏడాది 8 టీఎంసీ నీళ్లు ఇక్కడికి వచ్చాయి. పోలవరం ద్వారా గోదావరిలో వరద ఉన్నపుడు ఎంత నీటినైనా ఇక్కడికి తీసుకురాగలం
వాస్త‌వం) ఇప్ప‌టికీ పోల‌వ‌రం ప్రాజెక్టు అస‌లు ఏమాత్రం జ‌ర‌గ‌నే లేదు. ప‌ట్టి సీమ ప‌నులు ఇంకా సాగుతున్నాయి. ఇంకా నెల ప‌డుతుంద‌ని త‌మ‌రే చెప్పారు. మ‌రి ఇన్ని నీళ్లు ఎక్క‌డ నుంచి ఎక్క‌డ‌కు వ‌చ్చిన‌ట్లు

చంద్ర‌బాబు). దేశంలో రెండు పెద్ద నదులను తొలిసారి అనుసంధానించాం. ఇక్కడి నుంచి పెన్నాకు తీసుకెళ్లాలనుకుంటున్నాను.
వాస్త‌వం) రెండు చెంబులు నీళ్లు గోదావ‌రి నుంచి తెచ్చి క్రిష్ణా లో పోసి అనుసంధానం చేశాం అని గొప్ప‌లు చెబుతున్నారు. అస‌లు క్రిష్ణా న‌దిలో నీటి కోసం ఎంతటి డిమాండ్ ఉంది. శ్రీశైలం, నాగార్జున సాగ‌ర్‌, పులిచింత‌ల, విజ‌య‌వాడ ద‌గ్గ‌ర ఎంత కొర‌త ఉందో తెలుసు. అక్క‌డ క్రిష్ణా, గోదావ‌రి న‌దుల మీద ఎగువ రాష్ట్రాల ప్రాజెక్టులు ఆపించ‌క పోతే మిగిలేవి ఈ చెంబుల నీళ్లే.
 
చంద్ర‌బాబు).అప్పుడు (గతంలో అధికారంలో ఉన్నపుడు) నేను సంపదను సృష్టించాను. అది దానికదిగా కింది వర్గాల వారికి చేరుతుందని (ట్రికిల్ డౌన్) నేను భావించా. కానీ అలా జరగలేదు.. నేను అధికారం కోల్పోయాను. నా కృషి మొత్తం వృథా అయింది. 
వాస్త‌వం) మీరు సంప‌ద‌ను పోగేసింది ఈ సొంత కుటుంబానికి త‌ప్ప‌. మ‌రొకరికి కాదు. మీరు ప‌రిపాలించిన తొమ్మిదేళ్ల కాలంలో సామాన్యుల కోసం చేసిన ప‌ని ఒక్క‌టంటే ఒక్క‌టి చూపించ‌గ‌ల‌రా

చంద్ర‌బాబు)ఇప్పుడు మళ్లీ మైనస్‌లో నేను మొదలు పెట్టా. సున్నాతో కాదు.నావల్లే 2004 నాటికి విద్యుత్ మిగులు ఉంది. నేను మళ్లీ అధికారంలోకి వచ్చేటప్పటికి.. ఒక్క ఏపీలోనే 22.5 మిలియన్ యూనిట్ల లోటు ఉంది. తెలంగాణలో కాదు. ఒక నెల కాలంలోనే నేను దానిని మళ్లీ సరి (రివర్స్) చేయగలిగాను.
వాస్త‌వం) ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న తో తెలంగాణ లో విద్యుత్ కొర‌త‌, ఏపీలో విద్యుత్ మిగులు ఉంటుంద‌ని చిన్న‌పిల్ల‌ల‌కు కూడా తెలుసు. అయినా స‌రే ఏపీలో విద్యుత్ ను నేనే పోగేశా, సెల్ ఫోన్ ని నేనే క‌నిపెట్టా అని గొప్ప‌లు చెబితే ఏం చేయ‌గ‌లం. ఉన్న విద్యుత్ ఉండ‌గానే ప్రైవేటు విద్యుత్ కొనుగోలుకి తెర దీసిన ఘ‌న‌త మీది

చంద్ర‌బాబు) నేను ఇలా ఎందుకు పనిచేయాలి? నా కుటుంబం ఇక్కడ లేదు. వారు ఏదో వ్యాపారం చేస్తున్నారు. ఆమె కూడా బిజీ. నాకొక మనవడు ఉన్నాడు. రోజుకు గంట సమయం కూడా గడపటం లేదు. నేను మనవడితో ఆడుకునే సమయం ఇది. కానీ నేను నా జీవితం త్యాగం చేస్తున్నాను. ఎందుకు? ప్రజల కోసం.
వాస్త‌వం) జీవితం అంతా చీక‌టి మ‌యం, వెన్నుపోట్ల మయం అయితే ఎవ‌రినీ న‌మ్మ‌లేరు. అందుకే ప్ర‌శాంతంగా ఉండ‌లేరు. ఇది త్యాగం కాదు ప‌చ్చి స్వార్థం. హైద‌రాబాద్ లో ఓటుకి కోట్లు కుంభ‌కోణంలో అడ్డంగా దొరికిపోయాక విజ‌య‌వాడ‌కు జంప్ అయిపోయి, భ‌య‌ప‌డి దాక్కొన్న మ‌న‌స్త‌త్వం.

చంద్ర‌బాబు) నేను ఎన్నికల్లో అతిగా హామీలు ఇవ్వలేదు. నేను హామీలు ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇస్తున్నా. కొన్నిసార్లు మేం ఆలోచనలు మార్చుకోవచ్చు. అప్పుడు అది సరికావచ్చు.. ఇప్పుడు ఇంకొకటి సరికావచ్చు. 
వాస్త‌వం) అన్ని అతి హామీలే. అధికారంలోకి వ‌చ్చాక మొట్ట‌మొద‌టి సంత‌కం పెట్టిన ఐదు హామీలు కూడా అలాగే ఉన్నాయి. రైతు రుణ‌మాఫీ, డ్వాక్రా రుణ‌మాఫీ, నిరుద్యోగుల‌కు ఉద్యోగాలు, ప‌క్కా ఇళ్ల నిర్మాణం, ప్ర‌త్యేక హోదా.. అటువంటప్పుడు వీటిని దొంగ హామీలు అన‌టంలో త‌ప్పేముంది. 

చంద్ర‌బాబు)తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు 15 మందిలో 9 మందిని (కేసీఆర్) తీసుకెళ్లటం చట్టబద్ధం కాదు. పార్టీ ఫిరాయింపుల చట్టం ఉంది. అసలు పార్టీని చీల్చలేరు. దానిపై న్యాయపోరాటం ఒక నిరంతర ప్రక్రియ.
 వాస్త‌వం) ఓటుకి కోట్లు కుంభ‌కోణం లో దొరికి పోయి, కేసీయార్ తో సెటిల్ మెంట్ చేయించుకొన్నాక‌ ఈ పోరాటాల‌న్నీ నిరంత‌ర‌మే అని మీ నాయ‌కులే చెవులు కొరుక్కొంటున్నారు. కానీ ఏపీలో మాత్రం కోట్లుకుమ్మ‌రించి ఎమ్మెల్యేల‌ను కొనేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. 

చంద్ర‌బాబు)హైదరాబాద్‌లో తెలంగాణలో నా జనం ఉంటారు.. నేను అక్కడికి వెళ్లలేను. అక్కడ (అసెంబ్లీ ఎన్నికల్లో) పోటీ చేయలేను. 2018 ఎన్నికల్లో అక్కడ అధికారం కోసం పోటీచేస్తాం.’’
వాస్త‌వం) మ‌ళ్లీ హైద‌రాబాద్ లో పోటీ చేస్తే నెంబ‌ర్ వ‌న్ అవుతార‌ని జ‌నం అనుకొంటున్నారు. కానీ ఇప్పుడు చేస్తున్న మోసాల‌తో ఏపీ లో కూడా ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు పెడితే అస‌లు రంగు బ‌య‌ట ప‌డుతుంది. క‌నీసం మునిసిప‌ల్ ఎన్నిక‌లు పెట్టినా బండారం బ‌య‌ట ప‌డుతుంది. 

No comments:

Post a Comment