27 February 2016

వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని చూసి విలువ‌లు నేర్చుకో చంద్ర‌బాబు

టీడీపీ నేత‌ల స‌వాల్‌ను స్వీక‌రించిన వైయ‌స్ఆర్‌సీపీ
చంద్ర‌బాబుది నీతిమాలిన క్యారెక్ట‌ర్‌
కాంగ్రెస్సే ఏమీ చేయ‌లేక‌పోయింది. టీడీపీ ఎంత‌?
16 నెల‌లు వైయ‌స్ జ‌గ‌న్‌ను జైల్లో పెట్టినా తొణ‌క‌లేదు
తండ్రి అడుగుజాడ‌ల్లో వెన్నుపోటు రాజ‌కీయాలు చేస్తున్న లోకేష్‌
వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా

హైద‌రాబాద్‌: తెలుగుదేశం పార్టీ నాయ‌కుల‌కు  ద‌మ్మూ, ధైర్యం ఉంటే.. మీరు అభివృద్ధి చేశామ‌ని భావిస్తే ముందు మీరు రాజీనామా చేయాల‌ని, మేం కూడా వెంట‌నే రాజీనామా చేస్తామ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా స్ప‌ష్టం చేశారు. వైయ‌స్ఆర్‌సీపీకి చెందిన 62 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాల‌న్న టీడీపీ నాయ‌కులు ప‌య్యావుల కేశ‌వ్, బోండా ఉమా విసిరిన స‌వాల్‌ను వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీక‌రించింది. అయితే మాతో పాటు మీరు కూడా ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి, శాస‌న స‌భ ర‌ద్దుకు డేట్ ఫిక్స్ చేయాల‌ని రోజా డిమాండ్ చేశారు. హైద‌రాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో శుక్ర‌వారం ఆమె విలేక‌రుల‌తో మాట్లాడుతూ చంద్ర‌బాబుది నీతిమాలిన క్యారెక్ట‌ర్ అని అభివ‌ర్ణించారు.  టీడీపీ నాయ‌కులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని శాశ్వ‌తంగా రాజ‌కీయాల నుంచి త‌ప్పిస్తామ‌ని పేర్కొన‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌న్నారు. ఆయ‌న ఎప్ప‌టికీ సీఎం కాలేర‌ని టీడీపీ ఎమ్మెల్సీ ప‌య్యావుల కేశ‌వ్ చెప్ప‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు. క‌నీసం ఎమ్మెల్యేగా కూడా గెల‌వ‌లేక దొడ్డి దారిన ఎమ్మెల్సీగా వ‌చ్చిన కేశ‌వ్‌కు జ‌గ‌న్ గురించి మాట్లాడే అర్హ‌త ఉందా అని ప్ర‌శ్నించారు. అర్హ‌త లేక‌పోయిన ప‌ర్వాలేదు. ఆయ‌న ఇచ్చిన స‌వాల్‌ను మేం స్వీక‌రిస్తున్నామ‌న్నారు. వైయ‌స్ార్‌సీపీకి  చెందిన 62 మంది ఎమ్మెల్యేతో రాజీనామా చేసి ప్ర‌జా క్షేత్రంలోకి వెళ్లి ప్ర‌జ‌లు మా ప‌క్షంలో ఉన్నార‌ని నిరూపించుకునే ద‌మ్మూ, ధైర్యం మా నాయ‌కుడు వైయ‌స్ జ‌గ‌న్‌కు ఉంద‌న్నారు. స‌ల‌హా ఇచ్చే ముందు మీరు పాటించి ఉంటే బాగుండేద‌ని సూచించారు. టీడీపీ ఎమ్మెల్యేలు , ఎంపీలంద‌రితో రాజీనామా చేయించాల‌ని ఆమె ప‌ట్టుబ‌ట్టారు. మీరు చేసిన అభివృద్ధి  ఏంటో.. మీ ఫేస్ వ్యాల్యూ ఏంటో ప్ర‌జాక్షేత్రంలో తేల్చుకుందామ‌ని ఛాలెంజ్ విసిరారు. ఇన్నాళ్లు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ఎలా పోరాటం చేశామో.. మా నాయ‌కుడి ఫేస్ వ్యాల్యూ ఏంటో ఉప ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించి నిరూపిస్తామ‌న్నారు. వైయ‌స్ఆర్‌సీపీ  గుర్తుతో గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల‌ను తీసుకెళ్లి.. ఈ రోజు మేం రాజీనామా చేయం, మీరే చేయాల‌ని టీడీపీ నాయ‌కులు స‌వాల్ విస‌ర‌డం దిక్కుమాలిన ప్ర‌క‌ట‌న  అన్నారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయ‌కులు చెప్పేవి శ్రీ‌రంగ నీతులు.. చేసేవి నీతిమాలిన రాజ‌కీయాల‌ని ఎద్దేవా చేశారు. 
ఇదీ చంద్ర‌బాబు క్యారెక్ట‌ర్‌
ముఖ్య‌మంత్రి  చంద్ర‌బాబుది నీతిమాలిన క్యారెక్ట‌ర్ అని ఎమ్మెల్యే ఆర్కే రోజా దుయ్య‌బ‌ట్టారు. మ‌న క్యారెక్ట‌ర్ ఎలాంటిదో ప‌ది మంది చెప్పాల‌ని  కానీ .. మ‌న గురించి మ‌నంచెప్పుకోవ‌డం బాగుండ‌ద‌న్నారు. చంద్ర‌బాబు నిన్న స‌భ‌లో మాట్లాడుతూ  నాకుండేదే క్యారెక్ట‌ర్ అన్న స్టేట్ మెంట్‌చూస్తే ఎవ‌రికైనా న‌వ్వొస్తుంద‌న్నారు. ప‌క్క పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేల‌ను కేసులు పెట్టి వేధించి, సూట్‌కేసులు ఇచ్చి మీ పార్టీలో చేర్చుకోవ‌డ‌మే రాజ‌కీయ‌మా అని ప్ర‌శ్నించారు. 35 ఏళ్ల రాజ‌కీయా జీవితంలో నేను ఏ త‌ప్పుచేయ‌లేదు అని చంద్ర‌బాబు చెప్ప‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. నీ రాజ‌కీయ జీవిత‌మే త‌ప్పుడు మార్గంలో మొద‌లైంద‌న్న‌ది అంద‌రికీ తెలుసు అన్నారు. పిల్ల‌నిచ్చిన మామ ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచావ‌న్నారు. ఈ రోజు నీవు.. నీ కుమారుడు క‌లిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నార‌ని విమ‌ర్శించారు. నాడు ఎన్టీఆర్ వ‌ద్ద ఉన్న ఎమ్మెల్యేల‌ను , నేడు వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యేల‌ను కొనే నీతిమాలిన క్యారెక్ట‌ర్ బాబుది అన్నారు. మా వాళ్లు బ్రీఫ్డ్ మీ అంటూ తెలంగాణ‌లో ఎమ్మెల్సీల‌ను కొంటూ అడ్డంగా దొరికి ప్ర‌పంచంలో తెలుగు వారి ప‌రువు బ‌జారున వేసిన క్యారెక్ట‌ర్ నీది అని సీఎం ను విమ‌ర్శించారు. రుణ‌మాఫీ చేస్తామ‌ని చెప్పి రైతుల‌తో ఓట్లు వేయించుకున్న త‌రువాత హామీ నెర‌వేర్చ‌క‌పోవ‌డంతో రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకునేలా చేసిన మోస‌కారి క్యారెక్ట‌ర్ బాబుది అన్నారు.  అస‌లు, వ‌డ్డీతో స‌హా రుణ‌మాఫీ చేస్తామ‌ని డ్వాక్రా మ‌హిళ‌ల‌ను మోసం చేసిన ద‌గా కోరు క్యారెక్ట‌ర్ చంద్ర‌బాబుది అని గుర్తు చేశారు. మ‌హిళా త‌హ‌శీల్దార్ వ‌న‌జాక్షిపై దాడి చేయించి, కాల్‌మ‌నీ సెక్స్ రాకెట్ పేరుతో అమాయ‌క మ‌హిళ‌ల‌ను వ్య‌భిచారంలోకి దించిన మ‌హిళా ద్రోహి క్యారెక్ట‌ర్ అన్నారు. రాజ‌ధాని అభివృద్ధి పేరుతో ల‌క్ష‌ల ఎక‌రాల ద‌ళితుల భూములు లాక్కున్న ద‌ళిత ద్రోహి క్యారెక్ట‌ర్ చంద్ర‌బాబుది అని రోజా అభివ‌ర్ణించారు.
వైయ‌స్ జ‌గ‌న్ ను చూసి నేర్చుకో
నాయ‌కుడంటే ఎలా ఉండాలో నైతిక విలువ‌లు ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని చూసి నేర్చుకోవాల‌ని ఎమ్మెల్యే రోజా చంద్ర‌బాబుకు సూచించారు. క్యారెక్ట‌ర్ అంటే వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిద‌ని ఆమె వివ‌రించారు. త‌న తండ్రి పోరాట స్ఫూర్తితో ఈ రోజు ఎన్ని క‌ష్టాలు ఎదురైనా తొణ‌కుండా ప్ర‌జ‌ల ప‌క్షాన ఉంటూ పోరాడుతున్న నాయ‌కుడు వైయ‌స్ జ‌గ‌న్ అని కొనియాడారు. 131 ఏళ్ల చ‌రిత్ర ఉన్న కాంగ్రెస్  పార్టీనే వైయ‌స్ జ‌గ‌న్‌ను ఏమీ చేయ‌లేక‌పోయింద‌ని, 33 ఏళ్ల టీడీపీ ఇంకేం చేస్తుంద‌ని  ప్ర‌శ్నించారు. సోనియాగాంధీ, చంద్ర‌బాబు కుమ్మ‌క్క వైయ‌స్ జ‌గ‌న్‌ను 16 నెల‌లు జైల్లో నిర్భందించినా కూడా తొణ‌కుండా, బెణ‌క‌కుండా ఎవ‌రి కాళ్లు కూడా ప‌ట్టుకోకుండా ఎదుర్కొంటున్న ధైర్య‌శాలీ.. మొన‌గాడు వైయ‌స్ జ‌గ‌న్ అన్నారు.  ఎవ‌రైనా త‌న నాయ‌క‌త్వంపై న‌మ్మ‌కంతో పార్టీలోకి రావాలంటే ముందుగా వారి ప‌ద‌వికి రాజీనామా చేయించి త‌న సొంత జెండా, అసెండాతో ప్ర‌జ‌ల్లోకి వెళ్లి ఆమోదం పొందిన యంగ్ అండ్ డైన‌మిక్ లీడ‌ర్ వైఎస్ జ‌గ‌న్ అన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వ‌ర‌కు ముఖ్య‌మంత్రి  అయ్యేందుకు ఎన్నో అవ‌కాశాలు వ‌చ్చినా కూడా లెక్క చేయ‌లేద‌న్నారు. చంద్ర‌బాబు వైశ్రాయ్‌లో మీటింగ్ పెట్టిన విధంగా వైయ‌స్ జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రించి ఉంటే వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి మ‌ర‌ణించిన త‌ర్వాత ఈ పాటికి ఎన్నిసార్లు సీఎం అయ్యేవారో ఆలోచించాల‌న్నారు. ప్ర‌తి  సంద‌ర్భంలో కూడా విలువ‌ల‌కు ప్రాముఖ్య‌త ఇవ్వాల‌ని, రాజ‌కీయాల్లో విలువ‌ల‌ను కాపాడాల‌ని ప్ర‌జ‌ల్లోకి వెళ్లి వారి ఆశీస్సులు పొందార‌న్నారు. ప్ర‌జ‌లు ఎప్పుడు అవ‌కాశం ఇస్తే అప్పుడు ప్ర‌భుత్వంలోకి వ‌చ్చి ప్ర‌జ‌ల‌కు న్యాయం చేయాల‌న్న ఆశ‌యంతో వైయ‌స్ జ‌గ‌న్ ముందుకు వెళ్తున్నార‌న్నారు. చంద్ర‌బాబు మాదిరిగా దొడ్డిదారిన అధికారంలోకి రావాల‌ని వైయ‌స్ జ‌గ‌న్  ఎప్పుడూ అనుకోలేద‌న్నారు. మా నాయ‌కుడికి ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ఉంది. ఫేస్ వ్యాల్యూ త‌న తండ్రి ఆశీర్వాదం ఉంద‌ని టీడీపీ నాయ‌కుల‌కు గుర్తు చేశారు. ఈ రోజు అంద‌రి ఎమ్మెల్యేల‌తో రాజీనామా చేయించి ప్ర‌జా క్షేత్రంలోకి వెళ్లే ద‌మ్మూ, ధైర్యం వైయ‌స్ జ‌గ‌న్‌కు ఉంద‌న్నారు. మీకు ద‌మ్ము లేన‌ప్పుడు మ‌మ్మ‌ల్ని రాజీనామా చేయ‌మ‌ని కోరే హ‌క్కు లేద‌ని టీడీపీ నాయ‌కుల‌ను నిల‌దీశారు. ఇక‌నైన బుద్ధి తెచ్చుకొని ప్ర‌జ‌ల‌కు ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీలు నెర‌వేర్చాల‌న్నారు. మీకు క్యారెక్ట‌ర్ ఉంటే రైతులు, డ్వాక్రా మ‌హిళ‌ల‌కు అస‌లు, వ‌డ్డీతో స‌హా రుణాలు మాఫీ చేయాల‌న‌నారు. ప్ర‌తి ఇంటికో ఉద్యోగం ఇవ్వాల‌ని, లేదంటేనిరుద్యోగ భృతి ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. ఆత్మ‌హ‌త్య‌ల‌ను నియంత్రించి.. సంబంధిత క‌ళాశాల‌ల యాజ‌మాన్యాల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.
భ‌యంతోనే ఎమ్మెల్యేల కొనుగోలు
చంద్ర‌బాబుకు సొంత‌పార్టీ ఎమ్మెల్యేల‌పై న‌మ్మ‌కం లేక ప‌క్క‌పార్టీ ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేస్తున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత రోజా విమ‌ర్శించారు. న‌మ్ముకున్న కార్య‌క‌ర్త‌నైనా.. బంధువ‌నైనా వెన్నుపోటు పొడ‌వ‌గ‌ల నారా వారి సిద్ధాంతం చంద్ర‌బాబుది అన్నారు. ఆ సిద్ధాంతాన్ని ప‌క్క‌న పెట్టి ఏ సిద్ధాంతంతో తెలుగుదేశం పార్టీని స్థాపించారో వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్‌టీ రామారావు ఆశ‌య సాధ‌నకు పాటుప‌డాల‌ని హిత‌వు ప‌లికారు. ప‌క్క‌పార్టీలో నాయ‌కుల‌ను తీసుకెళ్లినంత మాత్రానా బ‌ల‌ప‌డ‌ర‌న్నారు. టీడీపీ తెలంగాణ‌లో టీఆర్ ఎస్ లో విలీనం అయిన త‌రువాత విశ్వ‌స‌నీయ‌త కొల్పోయాన్నార‌న్నారు. ఆంధ్రాలో కూడా అదే పున‌రావృతం అవుతుంద‌న్న భ‌యంతో ఈ రోజు వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. కౌర‌వ సంత‌తి లాగా 102 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ప‌క్క పార్టీ ఎమ్మెల్యేల‌ను కొంటున్నారంటే చంద్ర‌బాబుకు ఆ పార్టీ నేత‌ల‌పై న‌మ్మ‌కం లేన‌ట్లే అన్నారు.

రాజ‌కీయాల‌కు ప‌ట్టిన తుప్పు చంద్ర‌బాబు
రాజ‌కీయాల‌కు ప‌ట్టిన తుప్పు చంద్ర‌బాబు అని రోజా దుయ్య‌బ‌ట్టారు. మీ అడుగు జాడ‌ల్లోనే మీ అబ్బాయి లోకేష్ వెన్నుపోటు రాజ‌కీయాలు చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. మీ అబ్బాయి ప‌ప్పు స‌న్నాఫ్ నిప్పు అంటున్నార‌ని, అది తుప్పు అని వ్యాఖ్యానించారు. ఇసుక మాఫియా నుంచి క‌ల్తీ మ‌ద్యం వ‌ర‌కు అవినీతి సొమ్ము కూడ‌గ‌ట్టుకున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. ప్రాజెక్టులో సీఎస్‌లు సంత‌కం పెట్ట‌క‌పోయినా కూడా వేల కోట్ల‌లో  దోచుకున్నార‌న్నారు. కాల్‌మ‌నీ సెక్స్ రాకెట్లో కూడా లోకేష్ అనుచ‌రులు ఉన్నార‌ని ఆరోపించారు. ఇన్ని త‌ప్పులు చేసిన చంద్ర‌బాబు నేను త‌ప్పు చేసిన‌ట్లు నిరూపిస్తే రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటా అన్న స్టేట్ మెంట్  సిగ్గు చేట‌న్నారు. అదే బాట‌లో చిన్న‌బాబు కూడా ప్ర‌క‌ట‌న‌లు చేస్తూ ఇంత చిన్న వ‌య‌సులో కూడా చిన్న త‌ప్పు కూడా దొర‌క‌కుండా జాగ్ర‌త్త ప‌డుతున్నారంటే భ‌విష్య‌త్‌లో రాష్ట్రానికి లోకేష్ వ‌ల్ల పెనుముప్పు ఉంద‌ని.. మొగ్గ‌లోనే ఆయ‌న త‌ప్పుడు ఆలోచ‌న‌లు తుంచి వేయాల‌ని రోజా కోరారు.

పార్టీ ఎందుకు మారారో అంద‌రికీ తెలుసు
ఇటీవ‌ల పార్టీ మారిన ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఎందుకు వెళ్లారో అంద‌రికీ తెలుసు అని ఎమ్మెల్యే ఆర్కే రోజా పేర్కొన్నారు. మా నియోజ‌క‌వ‌ర్గంలో 20ఏళ్లుగా అభివృద్ధి జ‌ర‌గ‌లేదు అని భూమా అఖిల ప్రియ చెప్ప‌డం ఆశ్చ‌ర్యంగా ఉంద‌న్నారు. చాలా ఏళ్లుగా ఆ నియోజ‌క‌వ‌ర్గంలో వాళ్ల అమ్మ దివంగ‌త శోభానాగిరెడ్డి ఎమె్మ‌లే్య‌గా ఉన్నార‌ని గుర్తు చేశారు. ఆ నియోజ‌క‌వ‌ర్గంలో ఆవిడ‌ను చూసే ఎవ‌రైనా ఓట్లు వేస్తార‌న్నారు. అలాంటిది శోభానాగిరెడ్డి ప‌నిచేయ‌లేద‌ని వాళ్ల కూతురు చెప్ప‌డం బాధాక‌ర‌మ‌న్నారు. త‌న తండ్రిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన చంద్ర‌బాబుతో చేతులు క‌ల‌ప‌డం ఎంత‌వ‌ర‌కు న్యాయ‌మ‌న్నారు. ఆదినారాయ‌ణ‌రెడ్డి ఎందుకు పార్టీ మారారో అంద‌రికీ తెలుసు అన్నారు. అలాంటి అవ‌స‌రాలు మిగ‌తా ఎమ్మెల్యేల‌కు లేవ‌ని రోజా స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టికైనా ప్ర‌జ‌లు, మీ పార్టీ ఎమ్మెల్యేల మ‌న్న‌న‌లు పొందాలంటే ఎన్నిక‌ల్లో ఇచ్చిన వాగ్దానాలు నెర‌వేర్చాల‌ని రోజా హితువు ప‌లికారు. 

No comments:

Post a Comment