- ఒక్క వాగ్ధానమైనా నేరవేర్చావా బాబు
 - ఇంకెంతకాలం ప్రజలను మభ్యపెడతారు
 - బాబు ఇకనైనా కళ్లు తెరువు
 - కేంద్రం నుంచి బయటకు రాఃధర్మాన
 
హైదరాబాద్ః  ప్రత్యేక హొదాపై కేంద్రం వైఖరి స్పష్టమైందని...రాష్ట్ర ప్రభుత్వం  వైఖరేంటో చెప్పాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాద్ రావు డిమాండ్ చేశారు.  ఇప్పటికైనా బాబు నిద్రమత్తులోంచి తేరుకోవాలని హెచ్చరించారు. కేంద్రం నుంచి బయటకు రావాలని సూచించారు. మీ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలు తాకట్టుపెట్టొద్దని బాబుకు హితవు పలికారు. కాకమ్మ కథలు కట్టిబెట్టి ప్రత్యేకహోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు.  ఈ నెల 10న ప్రత్యేక హోదా ఆకాంక్షను కేంద్రప్రభుత్వానికి తెలియజేద్దామన్నారు. 
రాష్ట్ర విభజనకు ముందు శివరామకృష్ణ కమిషన్ రాష్ట్రంలో ఉండే అన్ని జిల్లాలను ఎక్సెంటివ్‌గా టూర్ చేసి ఆ నివేదికను ప్రజలకు, కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారని  ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన జిల్లా శ్రీకాకుళమని పేర్కొందని చెప్పారు. ప్రభుత్వాలకు అందుబాటులో ఉండే అన్ని నివేదికల్లోనూ శ్రీకాకుళమే వెనుకబడిన జిల్లాగా ఉందన్నారు. టీడీపీ ప్రభుత్వం సెప్టెంబర్ 4, 2014న అసెంబ్లీలో శ్రీకాకుళం గురించి కొన్ని ప్రకటనలు చేసిందని, ఐతే అందులో ఒక్కటి కూడా పూర్తి చేసిన పాపాన పోలేదని అన్నారు. ఆహామీలు ఏమయ్యాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 
శ్రీకాకళాన్ని నూతన పారిశ్రామిక నగరంగా చేయడంతో పాటు, భవనపాడు సిపోర్టు, కలిగపట్నం సిపోర్టు నిర్మాణం, పైడిబీమవరం పారిశ్రామిక ఓడ,  పారిశ్రామిక క్యారిడర్, కొత్త విమానశ్రయం, స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడం , ఫుడ్‌పార్క్‌ను ఏర్పాటు చేయడం, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటేచర్ ను ఏర్పాటుచేయడం, వంశధార - నాగవళి నదులపై నిర్మాణంలో ఉన్నప్రాజెక్టులను పూర్తిచేయడం,  బారవ బీచ్ అభివృద్ధి, ఓపెన్ యూనివర్పిటీ, ఎలక్రానిక్ హార్డ్‌వేర్ పార్క్‌లు  సహా అనేక హామీలు గుప్పించిన  చంద్రబాబు ఆ  వాగ్ధానాల్లో ఒక్కదానికైనా శంకుస్థాపన చేశారా అని ధర్మాన ప్రసాదరావు నిలదీశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను చూసి జిల్లా ప్రజలు వెనుకబాటు నుంచి కొంతమేరైనా బాగు పడుతుందని ఆశించారని...కానీ అవి అడిఆశలే అయ్యాయని వాపోయారు. 
చెప్పిందే చెబుతున్న బాబూ....
రెండేళ్ల క్రితం చెప్పిన మాటలనే చెబుతూ చంద్రబాబు కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ నిర్వాకం కారణంగా శ్రీకాకుళం జిల్లా ప్రజలు వలసలు పోతుండడంతో గ్రామాలకు గ్రామలే  ఖాళీ అవుతున్నాయన్నారు. వలసలను నివారించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు.  ఇచ్చిన వాగ్దానాల్లో ఏ ఒక్క కార్యక్రమాన్నైనా చేపట్టారా అని నిలదీశారు. కనీసం నిధులు కేటాయించడానికి కూడా ప్రయత్నం చేయకపోవడం బాధాకరమన్నారు.  ఇప్పటికే రెండేళ్లు అయిపోయాయి... మిగిలిన రెండేళ్లలో ఏం అభివృద్ధి చేస్తారు.?.. ఏం ముఖం పెట్టుకొని శ్రీకాకళానికి వస్తారని ఆయన కడిగిపారేశారు.  ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎక్కడికక్కడ ఆగిపోయాయన్నారు.  సీఎం పర్యటన ఎంత నిరుత్సాహంగా జరిగిందో అందరికీ అర్థమైందేనని తూర్పారబట్టారు.  అత్యంత వెనుకబడిన జిల్లా అని తెలిసి కూడా సీఎం నిర్లక్ష్యం వహించడం దారుణమని మండిపడ్డారు. 
కొనుగోలు కేంద్రాలైనా ఏర్పాటు చేశారా..?
పండించిన ధాన్యాన్ని జిల్లాలో కొనుగోలు చేసేందుకు కనీసం కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతోందన్నారు. 1994 నుంచి 2004 వరకు ఏ తప్పులనైతే టీడీపీ ప్రభుత్వం చేసిందో... మళ్లీ అవే తప్పులు చేస్తోందని దుయ్యబట్టారు.  ప్రజలంతా గ్రామాలు విడిచిపోతుంటే దాన్ని విస్మరించి....ఇంకుడు గుంతలతో సమస్యలన్నీ పరిష్కరమవుతాయని బాబు చెప్పడం హాస్యాస్పదమన్నారు. శ్రీకాకుళం జిల్లా 65 సంవత్సరాల వెనుకబాటుకు గురైందని ధర్మాన వాపోయారు. 

No comments:
Post a Comment