23 May 2016

వైయస్ రాజారెడ్డికి జననేత ఘన నివాళి

వైయస్సార్ జిల్లా(పులివెందుల): ఏపీ ప్రతిపక్ష నేత వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ వైయస్సార్ జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈసందర్భంగా పులివెందులకు వచ్చిన జననేతకు పార్టీశ్రేణులు, ప్రజలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. తమ అభిమాన నాయకునికి నీరాజనం పట్టారు. 

పులివెందుల పర్యటనలో భాగంగా వైయస్ జగన్  తన తాత దివంగత వైయస్ రాజారెడ్డికి ఘనంగా నివాళులు అర్పించారు. నేడు వైయస్ రాజారెడ్డి వర్థంతి సందర్భంగా డిగ్రీ కళాశాల రోడ్డులోని రాజారెడ్డి ఘాట్ ను సందర్శించి అంజలి ఘటించారు.  రాజారెడ్డి పార్కుకు చేరుకుని తాత విగ్రహానికి  పూలమాల వేసి నివాళులు అర్పించారు. వైఎస్ జగన్ తో పాటు ఆయన చిన్నాన వైయస్ వివేకానందరెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
అనంతరం వైయస్ఆర్ ఆడిటోరియంలో నిర్వహించిన  ప్రత్యేక ప్రార్థనల్లో వైయస్‌ జగన్‌తో పాటు వైయస్‌ఆర్‌ సీపీ గౌరవాధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ, వైయస్‌ షర్మిల, వైయస్‌ భారతి, చిన్నాన వైయస్‌ వివేకానందరెడ్డి ,ఎంపీ అవినాష్‌రెడ్డి, వైయస్‌ఆర్‌ జిల్లా పార్టీ అధ్యక్షులు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డిలు పాల్గొన్నారు. కాగా నేడు, రేపు  రెండ్రోజుల పాటు వైయస్ జగన్ పులివెందుల పర్యటన కొనసాగుతుంది.

No comments:

Post a Comment