19 May 2016

అడ్డగోలుగా నీళ్లు తోడుకోవడం అన్యాయం కేసీఆర్ః వైయస్ జగన్

  • ఢిల్లీ వెళ్లి ఏం సాధించావు చంద్రబాబు
  • హోదాపై రెండు నాల్కల ధోరణితో మాట్లాడుతున్నాడు
  • ఆంధ్ర తగలబడుతుంటే ఫిడేల్ వాయిస్తున్నాడు
  • ఇలాంటి ముఖ్యమంత్రి మనకుండడం సిగ్గుచేటు
  • కేసుల భయంతోనే బాబు నోరుమెదపడం లేదు

కర్నూలు: రాష్ట్రం తగలబడిపోతుంటే పోతే పోనీయ్ అన్నట్లు చంద్రబాబు నీరో చక్రవర్తిలా ఫిడేల్ వాయిస్తున్నాడని వైయస్సార్సీపీ అధ్యక్షులు ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మండిపడ్డారు. ఓ పక్క తెలంగాణ అక్రమ ప్రాజెక్ట్ లు నిర్మిస్తూ ఏపీకి అన్యాయం చేస్తుంటే బాబు అవేమీ పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. గతంలో పై రాష్ట్రాలు ఆల్మట్టి, బాబ్లీలు నిర్మించినా బాబు పట్టించుకోలేదని... ఇప్పుడు తెలంగాణ ప్రాజెక్ట్ లను అడ్డుకోవడం లేదని దుయ్యబట్టారు. 
 
రెండు నాల్కల ధోరణి 
చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ప్రత్యేక హోదా గురించి మాట్లాడకపోవడం దురదృష్టకరమని వైయస్‌ జగన్‌ మండిపడ్డారు. ఢిల్లీ వెళ్లిన బాబు  ప్రత్యేక హోదా వస్తే నిధులు రావని «రెండు నాల్కల దోరణితో మాట్లాడటం సిగ్గు చేటన్నారు. కర్నూలు దీక్షాస్థలి నుంచి వైయస్ జగన్ మాట్లాడారు. తెలంగాణ ప్రాజెక్టులపై విలేకరి అడిగి ప్రశ్నలకు బాబు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా..! జలవనరుల అనుమతి తీసుకోవాలని, సీడబ్ల్యూసీ అనుమతి తీసుకోవాలని బాబు సమాధానం చెప్పడం హాస్యాస్పదం. ఇవన్ని మనకు తెలియవా అని వైయస్ జగన్ బాబును తూర్పారబట్టారు. గతంలో  9 ఏళ్లు బాబు సీఎంగా చేశారు. అప్పట్లో మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు అడ్డగోలుగా ప్రాజెక్టులు కడుతున్నా పట్టించుకోలేదు. ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


జైలుకు పోతావని భయమా బాబు
తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో ఎమ్మెల్యేలకు లంచం ఇస్తూ ఆడియో, వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు....ప్రాజెక్ట్ లపై  కేసీఆర్‌ను ప్రశ్నిస్తే  జైలుకు పంపిస్తాడని భయపడుతున్నాడు. పోనీ కేంద్రాన్నైనా అడుగుతారా అని చూస్తే..అది కూడా లేదు. కేంద్రానికి అల్టిమేటం ఇచ్చే కెపాసిటి చంద్రబాబుకు లేదు. కారణం. నరేంద్రమోదీ వద్దకు వెళ్లి మాట్లాడితే అవినీతిపై విచారణ చేపడతారని బాబు భయపడుతున్నాడు. చంద్రబాబు ఆలోచనలో మార్పు రావాలని, ఇకనైనా ఆయనకు జ్ఞానోదయం కలగాలని వైయస్ జగన్ అన్నారు. ఆయనపై ఒత్తిడి తెచ్చేందుకు రాబోయే రోజుల్లో ఈ పోరాటాలు కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. కృష్ణా ప్రాంతంలో జలదీక్ష చేశాం. రాబోయే రోజుల్లో గోదావరి జలాలపై ఆందోళనలు చేపడుదామని చెప్పారు. దమాషా ప్రకారం కిందకు నీటిని వదలకపోతే రాష్ట్రాలు బతకవని జననేత వాపోయారు. వ్యవస్థలో మార్పు కోసం కలిసికట్టుగా ఉద్యమిద్దామని ప్రజానీకానికి పిలుపునిచ్చారు.

 

ఎడాపెడా నీళ్లు తోడుకుంటే మా పరిస్థితి ఏంటి..?
తెలంగాణ ప్రభుత్వం ఎగువన ఎడాపెడా నీళ్లు తోడుకుంటే దిగువన ఉన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటని వైయస్‌ జగన్‌ ప్రశ్నించారు. అయ్యా కేసీఆర్‌.. మనమందరం అన్నదమ్ముళ్లా కలిసి మెలిసి ఉన్నాం. ఆరోజు పై రాష్ట్రాల్లో బాబ్లీ, ఆల్మట్టి కడుతున్నప్పుడు అందరం కలిసి కట్టుగా పోరాటం చేశాం. నాటి పోరాటం కేసీఆర్‌కు గుర్తుకు రావడం లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్‌..మీ గుండెల మీద చేయి వేసుకొని ఆలోచించాలని సూచించారు.  మహారాష్ట్ర అవసరాలు తీరనిదే మనకు నీళ్లు రావలని తెలుసు. ఇవాళ మీరు కూడా మధ్యలో వచ్చి శ్రీశైలానికి నీరు రాకముందే మోటర్లు పెట్టి తోడుకుంటామని చెప్పడం ఎంత వరకు సమంజసం అని నిలదీశారు.

ప్రతీ వాటాకు లెక్కలు కట్టాలి
ఎడాపెడా రోజుకు 2 టీఎంసీల నీళ్లు తోడుకుంటే కిందకి నీళ్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు.  మేమే పైనుండి మీకు నీళ్లు రాకుండా ఆపి ఉంటే మీ పరిస్థితి ఏంటని కడిగిపారేశారు. పాలించే వాళ్లు, పాలకులు గతం మరచి నాది నాది అని మొదలు పెడితే  భవిష్యత్‌లో అది ఏదీ మీకు అందదన్నారు. ఇవాళ అందరం కలిసి కట్టుగా ఒక్కటై మార్పు తీసుకొని వద్దామని పిలుపునిచ్చారు. మహారాష్ట్ర, కార్ణాటక, తెలంగాణ, ఏపీ పాలకులు అందరు కూడా ఆలోచించాలన్నారు. కేసీఆర్‌ కూడా ఆలోచించాలి..పైన ఉన్న కర్నాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఎడాపెడా ప్రాజెక్టులు కడితే తెలంగాణ, ఆంధ్రకు కూడా నీళ్లు రావన్నారు. ప్రతి చుక్కలో మీ వాట ఇంత అని లెక్కలు కట్టాలన్నారు. దమాషా ప్రకారం కిందకు నీళ్లు వదిలినప్పుడు కరువు వస్తే అందరికి వస్తుందని, వరదలు రావని చెప్పారు. వ్యవస్థలో మార్పు కోసం మనమందరం కృషి చేయాలన్నారు. 

మొండిగా వ్యవహరిస్తే తాగడానికి కూడా నీళ్లుండవు
మహబూబునగర్‌లో లిఫ్టులు పెట్టి ఎడాపెడా నీళ్లు తోడుకుంటున్నారు. ఇది న్యాయామా..?. 800 అడుగులకే రోజుకు 30 వేల క్యుసెక్కుల నీళ్లు తోడుకుంటే కింది ప్రాంతాల పరిస్థితి ఏంటి..ఇది అన్యాయం కాదా అని నిలదీశారు. పునర్ వ్యవస్థీకరణ చట్టంలో కృష్ణా, గోదావరి నదులపై కొత్తగా కట్టే ప్రాజెక్టులు కట్టాలని నిబంధనలు లేవన్నారు. మీ చేతుల్లో అధికారం ఉందని, బలం లేని మాపై ప్రతాపం చూడటం న్యాయామా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాజెక్టులకు ఎఫెక్సు కమిటీ అనుమతులు, జలవనరుల అనుమతులు లేవని చెప్పారు. మా రాష్ట్రం నుంచి కిందకు నీళ్లు వెళ్తున్నాయని, మాఇష్టం అని తెలంగాణ సర్కార్‌ మొండిగా వ్యవహరిస్తే..రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు తాగడానికి నీళ్లు ఉండవని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే మాదిరిగా గోదావరిలో 70 వేల క్యూసెక్కుల నీళ్లు కేసీఆర్‌ తోడుకుంటే కింది ఆయకట్టు పరిస్థితి ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

No comments:

Post a Comment