5 May 2016

ఆ నాయుడులిద్దరూ కుమ్మక్కై రాష్ట్రాన్ని ముంచుతున్నారా..

  • చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు
  • రాష్ట్రానికి ప్రత్యేకహోదా లేదని చెప్పడం పచ్చిమోసం
  • టీడీపీ, బీజేపీలు నాటకాలు కట్టిబెట్టాలి
  • మంత్రులు తప్పుకోవాలి,  కేంద్రంపై ఒత్తిడి తేవాలి
  • రాష్ట్రప్రయోజనాలే వైఎస్సార్సీపీ ముఖ్య ఉద్దేశ్యం
  • హోదా వచ్చే వరకు మా పోరు ఆగదుః అంబటి రాంబాబు

హైదరాబాద్ః కేంద్రంలో వెంకయ్యయుడు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడులు ఇద్దరు కుమ్మక్కై రాష్ట్రాన్ని నట్టేట ముంచారని  వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. ప్రత్యేకహోదాపై టీడీపీ, బీజేపీలు నాటకాలు ఆడుతున్నాయని ఫైరయ్యారు.  చావు కబురు చల్లగా చెప్పినట్లు రెండేళ్ల తర్వాత ఏపీకి ప్రత్యేకహోదా లేదని చెప్పడం పచ్చిమోసమని, ఏపీ ప్రజలను వంచించడమేనని అంబటి అన్నారు. చంద్రబాబు తక్షణమే కేంద్రం నుంచి తన మంత్రులను ఉపసంహరించుకోవాలని, రాష్ట్రం నుంచి బీజేపీ మంత్రులను సాగనంపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా తీసుకురాకపోతే చంద్రబాబు చరిత్ర హీనుడుగా మిగిలిపోతారన్నారు. గుంటూరులో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అంబటి మాట్లాడారు. 

హోదా ఇస్తామన్న కేంద్రం, తెస్తామన్న టీడీపీ రెండు పార్టీలు ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేశాయని అంబటి నిప్పులు చెరిగారు. ఆనాడు కాంగ్రెస్, బీజేపీలు తెరచాటు రాజకీయాలు చేసి అన్యాయంగా, అక్రమంగా  రాష్ట్రాన్ని విడగొట్టాయని.. లైవ్  కట్ చేసి మరీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాష్ట్రాన్ని చీల్చాయని మండిపడ్డారు. ఇవాళ  రెండేళ్ల తర్వాత  మళ్లీ టీడీపీ, బీజేపీలు  రాష్ట్రానికి హోదా లేదని చెప్పి మోసగించిన వైనం చూస్తుంటే బాధేస్తుందన్నారు. హోదా కోసం మోడీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు వైఎస్సార్సీపీ సహా అన్ని పార్టీల నాయకుల్ని ఢిల్లీకి తీసుకుపోవాలని అంబటి చంద్రబాబుకు సూచించారు. 

రాష్ట్రాన్ని చీలుస్తున్నా వెంకయ్యనాయుడు దాన్ని పట్టించుకోకుండా...రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేకహోదా కావాలంటూ  రాజ్యసభలో ఘీంకరించిన దాన్నే మనం చూశామని అంబటి అన్నారు. అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామంటూ నాయుడులిద్దరూ ఎన్నికల ప్రచారంలో ప్రగల్భాలు పలికి ఓట్లు వేయించుకొని మోసం చేశారన్నారు. హోదాను దగా చేసే అవకాశముందని  మొదటి నుంచి వైఎస్సార్సీపీ చెబుతూనే వస్తోందని అంబటి పేర్కొన్నారు. హోదా కోసం  వైఎస్ జగన్ అనేక దీక్షలు చేపట్టిన విషయాన్నిఅంబటి గుర్తు చేశారు. జననేత దీక్షలు భగ్నం చేసేందుకు, అణచివేసేందుకు చంద్రబాబు కుట్రలు చేశారే తప్ప...హోదా తీసుకొచ్చే కార్యక్రమాలు ఎక్కడా కూడా చేయకపోవడం బాధాకరమన్నారు. 

బాబు, వెంకయ్యలు ఒకే వేదిక మీదకు వచ్చినప్పుడు ఒకరికొకరు గొప్పలు చెప్పుకోవడం తప్ప సాధించిందేమీ లేదని అంబటి దుయ్యబట్టారు.  సుజనా చౌదరి మారిషస్ బ్యాంకుకు వందకోట్లు ఎగ్గొడితే అరెస్ట్ కాకుండా ఉండేందుకు కేంద్రలో మంత్రిగా కొనసాగుతున్నారు తప్ప,  ఓటుకు నోటు కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయకుండా ఉండేందుకు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు తప్ప...రాష్ట్ర ప్రయోజనాలే పట్టడం లేదన్నారు. ఇకనైనా మోసపూరిత విధానాలు కట్టిబెట్టి, కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని బాబును హెచ్చరించారు. ఇంకా వేచిచూడడమంటే ప్రజలను మోసం చేయడమేనని తూర్పారబట్టారు. 

హోదా ఇస్తామని ప్రకటించిన దాన్ని కూడా ఈప్రభుత్వం  సాధించుకోలేకపోవడం దారుణమన్నారు. ఇంత జరిగాక కూడా బాబు కేంద్రంలో ఎందుకు కొనసాగుతున్నారో, హోదాపై ఏం చేస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.  చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాలపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కేంద్రం నుంచి మంత్రులను తొలగించి అఖిలపక్షాన్ని ఢీల్లీకి తీసుకుపోవాలన్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే వైఎస్సార్సీపీ ముఖ్య ఉద్దేశ్యమని అంబటి స్పష్టం చేశారు.  చంద్రబాబుతో తమకు రాజకీయ విభేదాలున్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీతో కలిసి కేంద్రం వద్దకు వెళ్లేందుకు వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉందన్నారు.  తమిళనాడులో కావేరి జలాల కోసం అన్ని పార్టీలు ఏకమై గొంతు వినిపించిన విషయాన్ని అబంటి గుర్తు చేశారు.

టీడీపీ, బీజేపీ నేతలు ఒకరినొకరు తిట్టుకోవడమంతా నాటకంలో భాగమేనని అంబటి తేల్చిచెప్పారు.  నిధులిచ్చామని వాళ్లు, ఇవ్వలేదని వీళ్లు ఆడుతున్న నాటకాలు కట్టిబెట్టాలన్నారు. హోదా లేకపోతే రాష్ట్రం బాగుపడదని ఒకసారి, అదేమన్నా సంజీవనా అంటూ మరోసారి, హోదా ఉన్న రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయంటూ ఇలా చంద్రబాబు పూటకో మాట మాట్లాడుతున్నారని అంబటి ఎద్దేవా చేశారు.  రెండేళ్లపాటు నాయుడులిద్దరూ కుట్రపూరితంగా వ్యవహరించారని, ఇకనైనా ప్రజల ముందుకు రావాలని సూచించారు. లేకపోతే ప్రజలు క్షమించరని, ద్రోహం చేసిన వారవుతారని హెచ్చరించారు. బాబు పోరాడినా, పోరాడకపోయినా వైఎస్ జగన్ నాయకత్వంలో వైఎస్సార్సీపీ హోదా కోస తన పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. 

No comments:

Post a Comment