2 May 2016

బాబు పాలన అంతా మోసం..మోసం..మోసం..

  • కరువు మీద చర్యల్లేవ్
  • ప్రజల గొంతు వినిపించకూడదనే ప్రతిపక్ష ఎమ్మెల్యేల కొనుగోలు
  • మాచర్ల ధర్నాలో బాబు మీద మండిపడిన వైఎస్ జగన్


మాచర్ల: చంద్రబాబు వంటి వ్యక్తిని ఏమాత్రం క్షమించకూడదని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అభిప్రాయ పడ్డారు. ప్రజల గొంతు వినిపించకూడదనే ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇటువంటి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో వేయాలని పిలుపు ఇచ్చారు.
          కరువు, తాగునీటి ఎద్దడి, పశుగ్రాసం కొరత, రైతాంగ సమస్యలు వంటి తీవ్ర ఇబ్బందుల్ని పట్టించుకోకుండా చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోంది. ఇందుకు  నిరసనగా, ప్రభుత్వానికి బాధ్యతను గుర్తు చేసే విధంగా ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నిరసనలు చేపట్టింది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా మాచర్ల లో జన నేత వైఎస్ జగన్ ధర్నా చేపట్టారు. వెల్లువలా తరలి వచ్చిన ప్రజానీకాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వైఎస్ జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే...
          ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రత 40 డిగ్రీల కన్నా ఎక్కువ గా మండుతున్నప్పటికీ ఇక్కడ ఎవ్వరూ లెక్క చేయటం లేదు. బాగా ఆలస్యం అవుతున్నప్పటికీ పట్టించుకోవటం లేదు. ఏ ఒక్కరి ముఖంలో చికాకు కనిపించటం లేదు. కడుపు నిండా బాధను పెట్టుకొని చిక్కటి చిరునవ్వుతో ఇంతటి ఆత్మీయతను, ప్రేమానురాగాల్ని చూపిస్తున్నారు. మీ అందరి అభిమానం, ఆత్మీయతలకు శిరస్సు వంచి, చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుతున్నాను.
          ఇవాళ రాష్ట్రంలో కరువు తాండవిస్తోంది. తాగటానికి నీళ్లు లేవు. పంటలు ఎండిపోతున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతున్నా పట్టించుకొనే దిక్కు లేదు. నీళ్లు లేక పశువులు చనిపోతున్నాయి. పశుగ్రాసం దొరకటం లేదు. ప్రభుత్వం నుంచి స్పందన ఏమాత్రం లేదు. కరువు తాండవిస్తోంది. రైతాంగానికి అండగా ఉందాం, పేదలకు అండగా ఉందాం అనే ఆలో చన ఏమాత్రం  ఈ దిక్కుమాలిన ప్రభుత్వానికి రావటం లేదు.
          ఇటువంటి సమయంలో రైతులకు అందించాల్సిన ఇన్ ఫుట్ సబ్సిడీ  వెయ్యి కోట్లకు గాను ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. రైతులు, పేదలకు అండగా నిలవటం లేదు. ముఖ్యమంత్రి కావటానికి ముందు ఎన్నికలకు వెళ్లి చంద్రబాబు రైతులకు చాలా చెప్పారు. మూడు తుఫాన్లు, కరువు వచ్చాయి.  వీటికి గాను అందరినీ ఆదుకొంటానని హామీలు ఇచ్చారు. అధికారంలోకి వస్తూనే రైతులు, బీదలకు పంగనామాలు మొదలెట్టారు. ఒక్క కలంపోటుతో రూ. 1640 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ కి ఎగనామం పెట్టారు. ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టారు.
          2014..15 ఆర్థిక సంవత్సరంలో దాదాపుగా 15 వందల కోట్ల రూపాయిల మేర నష్టం వాటిల్లిందని లెక్క గట్టారు. తర్వాత అధికారులు వడపోతలు చేపట్టి దాన్ని రూ. వెయ్యి కోట్లకు తెచ్చారు. ఆ తర్వాత క్యాబినెట్ మీటింగ్ పెట్టి దాన్ని 692 కోట్లు చేశారు. అదయినా పూర్తిగా ఇచ్చారా అంటే అదీ లేదు. అక్కడ కూడా వంద కోట్లు ఇంకా ఇప్పటికీ ఇవ్వనే లేదు.
          2015...16 లో కరువు వచ్చింది. అకాల వర్షాల తో వరదలు వచ్చాయి. దాదాపు వెయ్యి కోట్ల రూపాయిల మేర నష్టం వాటిల్లిందని చంద్రబాబు ప్రభుత్వమే కేంద్రానికి లెక్కలు చెప్పింది. లేఖలు రాసింది. కానీ ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా ప్రజలకు ఇచ్చిన పాపాన పోలేదు. 2015..16 పూర్తయి 2016..17 మొదలైనా సాయం ఏమాత్రం అందించలేదు. 

No comments:

Post a Comment