4 July 2015

ప్రతిపక్షాల్ని వే ధించటమే తెలుగుదేశం విధానం

ఎమ్మెల్సీ ఎన్నికల సాక్షిగా తెలుగుదేశం పార్టీ మరోసారి రెచ్చిపోయింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, నాయకుల్ని వేధించేందుకు కంకణం కట్టుకొంది. పీఏసీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ కర్నూలు జిల్లా  నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని అక్రమ కేసులు పెట్టి  అరెస్టు చేశారు. ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారని, తాకవద్దని తనను అవమానించారంటూ ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ దేవదానం ఇచ్చిన ఫిర్యాదు మేరకు భూమాపై 353, 188, 506 ఐపీసీతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను నంద్యాల త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో నమోదు చేశారు. అనంతరం పోలీసులు ఆయన్ను ఇంటివద్ద అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు.

 వాస్తవంగా జరిగింది ఇది..! 
  ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవడానికి భూమానాగిరెడ్డి, ఆయన కుమార్తె ఆళ్లగడ్డ ఎమ్మెల్యే  అఖిలప్రియ, పార్టీకి చెందిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులతో కలిసి పోలింగ్  కేంద్రమైన ఆర్డీఓ కార్యాలయానికి వచ్చి వెయిటింగ్ స్టాల్‌లో కూర్చున్నారు.   ఇంతలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుధాకర్‌రెడ్డి, డీఎస్పీ  హరినాథరెడ్డి, ఎన్నికల జోనల్ అధికారి వెంకటేశంలు  అక్కడికి చేరుకొని పోలింగ్ కేంద్రంలోకి  వెళ్లి ఓటు వేయమని కోరగా, నాన్న వచ్చాక వెళ్తానని అఖిలప్రియ సమాధానం ఇచ్చారు. డీఎస్పీ కోపోద్రిక్తుడై వెయిటింగ్ స్టాల్ లో కూర్చుంటే ఓటర్లను ప్రభావితం చేసినట్లేనని అనడంతో... వీరిద్దరి మధ్యన వాగ్వాదం  జరిగింది. దీంతో  ఆమె పోలింగ్ కేంద్రం వెలుపలకు వెళ్లారు.

 భూమాపై కేసు నమోదుకు వ్యూహం..
 అఖిలప్రియకు జరిగిన అవమానాన్ని తెలుసుకున్న భూమా పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న శిరివెళ్ల సీఐ ప్రభాకర్‌రెడ్డి, ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ దేవదానంలను  నిలదీశారు. సీఐ  ప్రభాకర్‌రెడ్డి మరి కొందరు పోలీస్ అధికారులు, రిటర్నింగ్  అధికారి సర్దిచెప్పడంతో ఆయన శాంతించారు. మరోవైపు ఎన్నికల, పోలీస్ అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి  తీసుకెళ్లి భూమాపై కేసు నమోదు చేయాడానికి వ్యూహం పన్నారు. అధికార పార్టీ నేతలు ప్రభుత్వ పెద్దల ద్వారా  పోలీస్ అధికారులపై  ఒత్తిడి  తేవడంతో కేసు నమోదు అయ్యింది. అరెస్టు నందర్భంలో ఉద్రిక్తత  చోటుచేసుకుంది.  వైఎస్సార్‌సీపీ  కార్యకర్తలు గట్టిగా ప్రతిఘటించారు.

 భూమా వ్యాఖ్యలకు కులం రంగు...
 ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ దేవదానం ఫిర్యాదు మేరకు త్రీటౌన్  ఎస్‌ఐ సూర్యమౌళి భూమాపై అట్రాసిటీ, నాన్‌బెయిలబుల్  కేసులను ( ఎఫ్‌ఐఆర్ నెం. 132-2015) నమోదు చేశారు. ఇది కావాలని చేసిన కుట్ర అని స్పష్టంగా అర్థం అవుతున్నా, అధికార పక్షం ఒత్తిడి మేరకే ఇలా చేశారని తెలుస్తోంది. పైగా పోలింగ్ స్టేషన్ దగ్గర తన కుమార్తె తో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని తెలుసుకొన్న వెంటనే ఉద్వేగంతో అక్కడకు చేరుకొన్న భూమాను ఇరికించేందుకే రెచ్చగొట్టేలా ప్రవర్తించారని అర్థం అవుతోంది. అందుకే పోలీసులు, అధికారపక్షంతో చేతులు కలిపి ఈ కుట్రకు తెర తీసినట్లు తెలుస్తోంది.

 నాన్నపై కక్ష సాధింపు
 పోలింగ్ బూత్ దగ్గర తనను పోలీసులు దూషించారని ఎమ్మెల్యే అఖిల ప్రియ వెల్లడించారు. పోలింగ్ బూత్ దగ్గర జరిగిన ఘటనల్ని ఆమె మీడియాకు వివరించారు. పోలింగ్ స్టేషన్ లో ఓటు వేసేందుకు తాను వెళ్లినప్పుడు పోలీసులు గదమాయించే ప్రయత్నం చేశారని ఆమె చెప్పారు. పది నిముషాల్లో ఓటు వేసి వెళతానని చెప్పినప్పటికీ వినకుండా వెంటనే ఓటు వేసి వెళ్లాలని పట్టు పట్టారని ఆమె అన్నారు. ఈలోగా డీఎస్పీ వచ్చి రూడ్ గా మాట్లాడిన సందర్భాన్ని అఖిల ప్రియ ఉదహరించారు. కూతురు ఒక్కతే ఉన్నప్పుడు పోలీసులు రూడ్ గా మాట్లాడితే ఒక తండ్రిగా రియాక్టు అయ్యారని అమె అన్నారు. సిల్లీ రీజన్సుతో కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆమె అన్నారు. ఇదంతా కావాలని చేస్తున్న కుట్ర అని అఖిల ప్రియ అభివర్ణించారు.

 మెరుగైన వైద్యం నిరాకరణ
 చాతీ నొప్పి తో బాధపడుతున్న ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కి పోలీసుల సమక్షంలో వైద్య పరీక్షలు జరిగాయి. ఆయన ఆరోగ్య పరిస్థితిని గమనించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించాలని సూచించారు. అయినప్పటికీ పోలీసు అధికారుల మీద అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు ఒత్తిడి తీసుకొని వచ్చారు. దీంతో ఎస్కార్టు పోలీసులు అందుబాటులో లేరంటూ తరలింపు ను వాయిదా వేస్తూ వచ్చారు. ఇదంతా కావాలని పోలీసులు చేస్తున్న హైడ్రామా అని వైఎస్సార్ సీపీ నాయకులు ఆరోపించారు.

No comments:

Post a comment