23 July 2015

నాడు రాళ్లేసి.. ఇపుడు దండలేస్తారా?

రాహుల్ చేసేది పరామర్శ యాత్ర కాదు
జనం కష్టాలు చూసి ఆనందించే యాత్ర..
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈనెల 24 నుంచి అనంతపురంలో పరామర్శయాత్ర చేపడుతున్నారు. ‘‘ఆయన ఆంధ్రప్రదేశ్‌లో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించటానికి వస్తున్నారా? లేదా వాళ్ళు అడ్డంగా నరికిన రాష్టం ఎలా ఉందో చూడటానికి వస్తున్నారా?’’అని ప్రజలు చర్చించుకుంటున్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీని ఇప్పటికే ప్రజలు చీదరించుకుంటున్నారు. పేరుకు రైతు కుటుంబాల పరామర్శే అయినా పార్టీకి మళ్లీ జవసత్వాలు తీసుకురావడమే రాహుల్‌గాంధీ లక్ష్యమని చిన్నపిల్లాడినడిగినా చెబుతాడు. అయితే అది కలలోని మాటే. తన యాత్ర సందర్భంగా రాహుల్‌గాంధీ అనేక సర్కస్ ఫీట్లు చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ముఖ్యంగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారని అంటున్నారు. రెండు సార్లు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంతో కీలకపాత్ర పోషించిన వైఎస్‌పై మరణానంతరం ఎన్నో అభాండాలు వేశారు.. ఆ మహానేత పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.  మహానేత మరణించిన తర్వాత కూడా రాళ్ళు వేసిన చరిత్ర కాంగ్రెస్‌ది.వైఎస్‌ను, ఆయన కుటుంబాన్ని అనేక అవమానాల పాల్జేసి, కేసులు మోపిదారుణాతి దారుణంగా కక్షసాధించి  హింసించిన చరిత్ర కాంగ్రెస్‌ది. వైఎస్ కుటుంబాన్ని వేధించడానికి చివరకు తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపిన నీచమైన చరిత్ర ఆ పార్టీది. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి గానీ, ఆ పార్టీ ఉపాధ్యక్షుడికి గానీ వైఎస్ స్మృతి చిహ్నాలను తాకే నైతిక అర్హత లేనే లేదు.వృద్ధ జంబూకాల చెప్పుడు మాటలు విని కూర్చున్న కొమ్మను నరుక్కున్న ఫలితాన్ని ఇపుడు కాంగ్రెస్ పార్టీ అనుభవిస్తున్నది. 


 •  రాహుల్‌గాంధీ చేసేది రైతు పరామర్శ యాత్రా లేక అడ్డగోలుగా విభజించిన రాష్ర్టంలో ప్రజలు ఎన్నికష్టాలు పడుతున్నారో చూసి ఆనందించే యాత్రా? రాహుల్, సోనియాలు ఆంధ్రప్రదేశ్‌ను అడ్డగోలుగా నరికిన ద్రోహులు.వారిని తెలుగు ప్రజలు ఎన్నటికీ క్షమించరు.
 •  
 •  ఇప్పుడు మళ్ళీ వైయస్‌ఆర్ గారు గుర్తొచ్చారా? 2004లోనూ, 2009లోనూ కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి రావటానికి కారణమైన నాయకుడు పట్ల 2009 సెప్టెంబరు నుంచి ఈరోజు వరకు కాంగ్రెస్ వాళ్ళు చేయని అఘాయిత్యాలు ఉన్నాయా?
 •  
 •  వైయస్‌ఆర్ కుటుంబం మీద, వైయస్‌ఆర్ మీద- పగబట్టిన పార్టీలు ఏవి అంటే ఒకటి టీడీపీ, రెండు కాంగ్రెస్ అని తెలుగు వారు ఎవరైనా చెబుతారు. మహానేత మరణించిన తర్వాత లొంగలేదన్న కోపంతో వైయస్‌ఆర్‌ను మహానేతగా చూడటం ఇష్టంలేక జగన్ మోహన్ రెడ్డిని ఓదార్పు యాత్ర చేయటానికి వీల్లేదని ఆదేశించిన దౌర్భాగ్య చరిత్ర సోనియాది, కాంగ్రెస్‌ది కాదా? 
 •  
 •  ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలనందర్నీ ఒకే చోటికి పిలిపించి ఓదార్పు చేయమన్నది సోనియా, రాహుల్‌లు కాదా? చనిపోయిన కుటుంబాలకు లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి.. ఈరోజుకీ అర్థ రూపాయి కూడా ఇవ్వలేదు. ఇదా మీరు రాజశేఖరరెడ్డిగారికి అందించే నివాళి?
 •  
 •  తెలుగుదేశం పార్టీతో కలిసి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మీద కేసు వేయించింది కాంగ్రెస్ పార్టీ కాదా? పై నుంచి ఆదేశాలు ఇచ్చి డాక్టర్ వైయస్‌ఆర్ పేరును చార్జిషీట్‌లో పేర్కొనేలా చేసింది కాంగ్రెస్ కాదా?
 •  
 •  ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ మంత్రులంతా వ్యక్తిగతంగా వైయస్‌ఆర్‌ను నిందించటం నిజం కాదా? చివరికి ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేశారని, కరెంటు ఫ్యూయల్ సర్దుబాటు ఛార్జీలు ప్రజల మీద విధించకుండా రాష్ట్ర ఖజానాకు నష్టం చేశాడని కాంగ్రెస్ నాయకులంతా మొరుగుతుంటే రాహుల్ గాంధీకీ, సోనియా గాంధీకి ఆ కారుకూతలు వినపడలేదా? ఇది లాంగ్వేజ్ ప్రాబ్లమ్ కాదు.. ఇది వారి వ్యక్తిత్వంలో ఉన్న లోపం.
 •  
 •  ఆ తర్వాత రాష్ట్ర విభజనకు కారణమైన ప్రతి పరిణామాన్ని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కలిసికట్టుగా చేసి మహానేత కుటుంబం మీద ఉమ్మడిగా దాడి చేయటం నిజం కాదా?
 •  
 •  చివరికి రాష్ట్ర విభజన బిల్లు విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చంద్రబాబుతో టచ్‌లో ఉండి ఇద్దరూ కలిసి రాష్ట్ర విభజన చేయటం నిజం కాదా?
 •  
 •   చంద్రబాబు సొంత మామను, బతికి ఉన్న ఎన్టీఆర్‌ను అధికారం నుంచి కిందకి లాగి ఆయన మరణానికి కారకుడైతే- చంద్రబాబు పంథాలోనే నడిచిన కాంగ్రెస్ ఏకంగా చనిపోయిన నాయకుడి మీదే దాడి చేసి అంతకన్నా దిగజారింది. ఇంత నీచ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏ మొహం పెట్టుకుని రాజశేఖరరెడ్డిగారి విగ్రహాలకు దండలు వేస్తోంది. రాహుల్ గాంధీ ఏ మొహం పెట్టుకొని వైయస్‌ఆర్ విగ్రహం వద్దకు వెళుతున్నాడు?
 •  
 •  కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడిన తెలుగుదేశం పార్టీతో జత కట్టి అన్నిటిలోనూ చంద్రబాబుతో కలిసి ఊరే గుతున్నది కాంగ్రెస్ కాదా? ఇక కాంగ్రెస్ చరిత్ర అంతా ఆంధ్రప్రదేశ్‌లో పిల్ల టీడీపీగా బతకడమే. 

No comments:

Post a comment