18 June 2016

తెలుగు నాట రాజ‌కీయాల్లో వైయ‌స్ జ‌గ‌నే హీరో

హైద‌రాబాద్‌: విజ‌య‌వాడ విస్త్ర‌త‌స్థాయి స‌మావేశంలో వైయ‌స్సార్సీపీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగం యువ‌త‌ను బాగా ఆక‌ట్టుకొంది. ముఖ్యంగా గ‌త 2,3 ప్ర‌సంగాల్లో ఆయ‌న చేస్తున్న సినిమా పోలిక మీద హ‌ర్షాతిరేకాలు వ్య‌క్తం అవుతున్నాయి. సోష‌ల్ మీడియాలో దీని మీద ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది.
ఆంధ్ర‌ప్ర‌దేశ్ తాజా రాజ‌కీయాల్ని ప్ర‌జ‌ల‌కు అర్థం అయ్యేలా చెప్పేందుకు ప్ర‌తిప‌క్ష నాయ‌కులు వైయ‌స్ జ‌గ‌న్ త‌గిన జాగ్ర‌త్త తీసుకొంటున్నారు. ముఖ్యంగా యువ‌త‌, విద్యార్థులకు బాగా అర్థం అయ్యేందుకు ఆయ‌న ప్ర‌సంగంలో ప్రాధాన్యం ఇస్తున్నారు. అవినీతి, అస‌మ‌ర్థ‌త‌ల‌కు తోడు దోపిడీ విధానాల‌తో చంద్ర‌బాబు చెల‌రేగుతున్న విధానాల మీద వైయ‌స్ జ‌గ‌న్ వివ‌ర‌ణాత్మ‌కంగా మాట్లాడుతున్నారు. వీటి మీద వైయ‌స్సార్సీపీ పార్టీ, వైయ‌స్ జ‌గ‌న్ చేస్తున్న పోరాటాల్ని ప్ర‌జ‌ల దృష్టికి తీసుకొని వ‌స్తున్నారు.
అయితే 2,3 ప్ర‌సంగాల్లో సినిమాల‌కు సంబందించిన ఉదాహ‌ర‌ణ‌లు ఇస్తున్నారు. ముఖ్యంగా సినిమాల్లో చాలా వ‌ర‌కు విల‌న్ పై చేయి సాధిస్తాడ‌ని, కానీ చివ‌ర‌కు వ‌చ్చేస‌రికి మాత్రం క్లైమాక్స్ లో ప‌రిస్థితి మారుతుంద‌ని చెబుతున్నారు. విల‌న్ చేసే దాష్టికాల‌న్నీ బ‌ట్ట‌బ‌య‌లు అవుతాయ‌ని, అప్పుడు హీరో చేతిలో విల‌న్ కు బుద్ది వ‌చ్చేప‌రిస్థితి ఏర్ప‌డుతుంద‌ని విశ్లేషిస్తున్నారు. ఈ ఉదాహ‌ర‌ణ‌లు యువ‌త‌కు బాగా క‌నెక్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా సినిమాల్ని బాగా ఇష్ట‌ప‌డే తెలుగు ప్రజానీకానికి ఈ విష‌యాలు స్ప‌ష్టం గా అర్థం అవుతున్నాయి.
సోష‌ల్ మీడియాలో ఈ ఉదాహ‌ర‌ణ ల మీద బాగా చ‌ర్చ జ‌రుగుతోంది. నిజ జీవితంలో రాజ‌కీయాల‌కు సంబంధించిన సినిమా లో వైయ‌స్ జ‌గ‌న్ ను హీరో గా అంతా అభివ‌ర్ణిస్తున్నారు. చంద్ర‌బాబు వంటి విల‌న్ ను ఎదుర్కొనేందుకు ఓపిక‌తో ప్ర‌జాస్వామ్యయుతంగా చేస్తున్న పోరాటాల్ని గ‌మ‌నిస్తున్నారు. అందుచేత ఈ రాజ‌కీయ జీవితంలో వైయ‌స్ జ‌గ‌న్ అస‌లైన హీరో అంటూ జేజేలు ప‌లుకుతున్నారు. 

No comments:

Post a Comment