14 June 2016

ప్రజల ఆదరణ ఆశీస్సులే వైఎస్సార్ సీపీ బలం

విజయవాడః ఒక వ్యక్తి, ఒక అమ్మతో మొదలైన పార్టీ నేడు ప్రజల ఆశీస్సులతో బలమైన పార్టీగా ఎదిగిందని ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ అభిప్రాయ పడ్డారు. విజయవాడ లో వైయస్సార్సీపీ విస్త్రత స్థాయి సమావేశాన్ని ప్రారంభిస్తూ వైయస్ జగన్ ప్రారంభోపన్యాసం చేశారు. ఆయన ఏమన్నారంటే.....ఐదేళ్లుగా ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రతిపక్షం పాత్ర పోషిస్తూ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించేందుకు కృషి చేస్తున్నాం. వైయస్సార్ కాంగ్రెస్  పార్టీ తొలుత అమ్మ, నాతో మొదలైంది. ఆతర్వాత అంచెలంచెలుగా పెరుగుతూ 18 మంది, తర్వాత 67 మంది ఎమ్మెల్యేలు, 9 మంది పార్లమెంట్ సభ్యులతో రాష్ట్రంలో 45 శాతం ఓట్లతో కోటి 30 లక్షల మంది ప్రజల ఆదరణతో పార్టీ నిలబడి ఉంది.  
ఈస్థాయికి మనం వచ్చామంటే దానికి కారణం పార్టీ నాయకుల కృషి, ఆప్యాయత, ప్రేమానురాగాలే. వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలి. రాజన్న రాజ్యం మళ్లీ తీసుకురావాలని ప్రతి ఒక్కరం అడుగులు వేస్తున్నాం. చంద్రబాబు పాలన మనకొద్దు అని ప్రజలు కోరుతున్న పరిస్థితుల మధ్య మనమంతా ఏకమై.... పార్టీని ఏవిధంగా ముందుకు తీసుకెళ్లాలి, ప్రజలకు ఏవిధంగా అండగా ఉండాలన్న దానిపై ప్రజల గొంతుకగా కలిసికట్టుగా ముందుకెళ్దాం.
        ఈ పార్టీ మనది. ప్రజల తరపున మనం అంతా పోరాడాలి. వైయస్సార్ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. రాజన్న రాజ్యం మళ్లీ రావాలి అని కోరుకొందాం. ప్రధాన ప్రతిపక్షం గా రెండేళ్ల నుంచి పనిచేస్తున్నాం.ప్రజల తరపున ఉద్యమిస్తున్నాం. చంద్రబాబు పరిపాలన మాకు వద్దు బాబోయ్ అని ప్రజలు కోరుకొంటున్న వేళ ఏ రకంగా ప్రజలు అభీష్టాన్ని తెలియచేయాలి. ఈ మార్గంలో తలెత్తుతున్న సమస్యల్ని ఏ రకంగా అధిగమించాలి, ప్రజల తరపున ఎలా పోరాడాల్ని అన్న విషయాల్ని మనం ఇప్పుడు చర్చించుకొందాం. వివిధ అంశాల మీద సీనియర్ నేతలు అందరకీ దిశ నిర్దేశం చేస్తారు. చివరలో గడప గడపకూ వైయస్సార్ అనే కార్యక్రమానికి సంబంధించిన వివరాలు నేను వెల్లడించటం జరుగుతుంది. అందులో అన్ని విషయాలు స్పష్టంగా చెబుతాను. దాన్ని బాధ్యతగా అందరం ముందుకు తీసుకెళదాం.

No comments:

Post a Comment