1 June 2016

చంద్రబాబు హామీలు అంతే సంగతులు..!

హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీలు అంటేనే నీటి మూటలు అనుకోవాల్సి ఉంటుంది. తాజాగా ప్రభుత్వ రికార్డులు కూడా అదే విషయాన్ని బయట పెట్టాయి.
          ఎన్నికల ముందు ఎన్నెన్నో హామీలు ఇచ్చి చంద్రబాబు అధికారం చేపట్టారు. కానీ అధికారంలోకి వచ్చాక వాటిని గాలికి వదిలేశారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణమాఫీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు, పేదలకు పక్కా ఇల్లు. ప్రత్యేక హోదా అనేవి ప్రధానంగా ఆయన ఇచ్చిన హామీలు. వాటిని అలాగే గాలికి వదిలేశారు.
          అధికారంలోకి వచ్చాక కూడా చంద్రబాబు తీరు మారలేదు. అవే అబద్దాలు, అవే మోసాలు కొనసాగిస్తూ వచ్చారు. ప్రతీ చోట ప్రజల్ని ముంచేందుకు రక రకాల గిమ్మిక్కులు చేస్తూ వచ్చారు. ముఖ్యమంత్రి గా చంద్రబాబు ఇస్తున్న హామీలు, వాగ్దానాల మీద ప్రభుత్వం రికార్డుల్లో నమోదు చేస్తూ వచ్చింది. తాజాగా కలెక్టర్ల సదస్సులో భాగంగా ఎక్కడెక్కడ చంద్రబాబు ఎన్నెన్ని హామీలు ఇచ్చారు అనే వివరాలు బయటకు వచ్చాయి. జిల్లాల వారీగా లెక్కలు వెలుగు చూశాయి.
          ఏడాది కాలంలో చంద్రబాబు 681 హామీలు ఇచ్చినట్లు లెక్క తేలింది. పనులు చేసి అమలు చేసినవి 112 గా లెక్క తేల్చారు. వాస్తవానికి ఈ 112 పనులు కూడా అర కొర పనుల బాగోతమే అని ప్రజలు అనుకొంటున్నారు. అయినప్పటికీ  ఆ పనులు పూర్తయ్యాయి అనుకొన్నప్పటికీ 16.45 శాతం మాత్రమే హామీలు అమలు అయినట్లు. మిగిలిన 83శాతం హామీలు నీటి మూటలే అని తేలింది. ఇదీ చంద్రబాబు పాలన.

No comments:

Post a Comment