17 June 2016

పెళ్లి ఓ చోట..సంసారం మరో చోటనా..?

  • ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అంబటి ఫైర్
  • పచ్చి రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని ఆగ్రహం
  • దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలని సవాల్
  • ముద్రగడను బాబు ఉగ్రవాదిలా చూస్తున్నాడని మండిపాటు
  • వచ్చే ఎన్నికల్లో టీడీపీని చిత్తుచిత్తుగా ఓడిస్తాంః అంబటి 
హైదరాబాద్ః చంద్రబాబు అవినీతి సొమ్ముకు ఆశపడి అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలకు.... వైయస్ జగన్ గురించి,  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత, నైతిక హక్కు లేదని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి చంద్రబాబు సంకన చేరిన మీరా మాట్లాడేది అంటూ అంబటి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై మండిపడ్డారు. ఏం మొహం పెట్టుకొని సవాల్ లు విసురుతున్నారని అంబటి ధ్వజమెత్తారు. మీరు ఏ పార్టీ గుర్తుపై గెలిచారు. ఎవరి ఫోటో పెట్టి గెలిచారో ఒక్కసారి అద్దంలో చూసుకోవాలని చురక అంటించారు. హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడారు. 

కోట్ల రూపాయలకు ఆశపడి పోయి పార్టీ మూసేసుకుంటారా  అని సిగ్గులేకుండా మాట్లాడుతారా..! అంటూ భూమా, జ్యోతుల నెహ్రూ ఇతర ఫిరాయింపుదారులపై అంబటి నిప్పులు చెరిగారు. పెళ్లి ఓ చోట, సంసారం మరో చోట చేస్తూ పచ్చి రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని  అంబటి వారిపై విరుచుకుపడ్డారు. విడాకులు ఇవ్వకుండానే మరో పెళ్లి చేసుకుంటే చట్టం ఒప్పుకుంటుందా..? పార్టీని వీడితే పదవికి రాజీనామా చేయాలని చట్టం చెబుతుంటే పట్టదా..? అని నిలదీశారు. 67 మందిలో 20మంది వెళ్లినంత మాత్రాన పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదన్నారు. వైయస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీ వన్నె మరింత పెరిగిందన్న విషయాన్ని గుర్తెరగాలన్నారు. 

డబ్బులు, పదవుల కోసం అమ్ముడుపోయిన మీరు.. ఇసుక అమ్ముకోవచ్చనో, కమీషన్ లు కాజేయొచ్చనో వెళ్లిపోయిన మీరా వైయస్ జగన్ ను విమర్శించేది అంటూ ఫిరాయింపుదారులపై అంబటి ఫైరయ్యారు. నీతి, నిజాయితీగా ఇచ్చిన మాట కోసం కట్టుబడే వ్యక్తి వైయస్ జగన్ అని అంబటి అన్నారు. శోభానాగిరెడ్డి సహా పార్టీలోకి వచ్చిన వాళ్లందరితో రాజీనామా చేయించి గెలిపిచుకున్న చరిత్రగల పార్టీ వైయస్సార్సీపీ అని అంబటి అన్నారు. అవాకులు, చెవాలుకు పేలడం మానుకోవాలని వారికి హితవు పలికారు. 

చట్టాలను వ్యతిరేకిస్తారా...?  అక్కడికి వెళ్లి కునుకుతారా...? ముఖ్యమంత్రికి, ఫిరాయింపుదారులకు సిగ్గుగా లేదా...? డబ్బులు తీసుకోకుండా టీడీపీలోకి దేనికి వెళ్లారు...? బాబు అందం చూసి వెళ్లారా...?  నైతిక విలువలు లేని మీరా వైయస్ జగన్ గురించి మాట్లాడేది అంటూ అంబటి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటలు టైమ్ ఇస్తున్నామని, దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలని అంబటి పచ్చకండువాలు కప్పుకున్న ఎమ్మెల్యేలకు సవాల్ విసిరారు. సిగ్గులేకుండా మాట్లాడం కాదని, నైతిక విలువలు తెలుసుకోవాలని సూచించారు. చీపుర్లతో కొడతారన్న భయంతో మీరు ఉన్నారు...? తెలంగాణలో ఒక్కో ఎమ్మెల్యేకు బాబు ఐదు కోట్లు బేరమాడారు. ఇక్కడ డబ్బులతో కొంటున్నారని అంబటి దుయ్యబట్టారు.  

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలంతా దొంగపని చేశారు. వారంతా దొంగలు. డబ్బులు తీసుకొని వెళ్లారన్న విషయం అందరికీ తెలుసునని అంబటి రాంబాబు అన్నారు.  ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం కాదని పౌరుషముంటే రాజీనామా చేసి చూపించాలన్నారు. మా పార్టీ తరపున గెలిచి చంద్రబాబు సంకలో దూరి విమర్శిస్తారా...? కొనుక్కున్న 20 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించే నైతికబాధ్యత చంద్రబాబుదేనని అంబటి అన్నారు. డబ్బులు పెట్టి కొనుక్కున్న ఎమ్మెల్యేలతో తిట్టిపిస్తే గొప్పతనం కాదని...రాజీనామా చేయించి గెలిపించుకోవాలని బాబుకు హితవు పలికారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ధీటుగా టీడీపీని ఎదుర్కొంటుందని, వచ్చే ఎన్నికల్లో బాబును చిత్తుచిత్తుగా ఓడిస్తుందని అంబటి స్పష్టం చేశారు. ఓడిపోతే టీడీపీని మూసేసుకుంటారో లేదో బాబే తేల్చుకోవాలన్నారు. 

చంద్రబాబు రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పాలన సాగిస్తున్నారని అంబటి మండిపడ్డారు. ముద్రగడ  పద్మనాభంను చంద్రబాబు ఉగ్రవాదిని చూసినట్టు చూస్తున్నారని అంబటి ఆరోపించారు. ఆయన దీక్ష గురించి ఏ ఛానల్ సమాచారం ఇవ్వకుండా చేశారని, వాస్తవాలను చూపించే ఛానళ్ల ప్రసారాలు కట్ చేశారని ఆగ్రహించారు. ముద్రగడ దీక్ష పట్ల  చంద్రబాబు ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నారని అంబటి ఫైర్ అయ్యారు . ఫిబ్రవరిలో ముద్రగడ దీక్ష చేసినప్పుడు ఆయన వద్దకు వెళ్లిన మంత్రులు ఇప్పుడు ఎక్కడా కనబడడం లేదన్నారు. వారు ఇచ్చిన హామీలు కూడా అమలు కాలేదని చెప్పారు. ఇప్పుడు మళ్లీ వేరే మంత్రులను పంపించి బాబు డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ముద్రగడ డిమాండ్ లను ప్రభుత్వం  అమలు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈసారి మోసం చేస్తే కాపులు, ప్రజాస్వామ్యవాదులు ఊరుకోరన్నారు. 

No comments:

Post a Comment