19 January 2016

వీసీ తప్పిదమే కనిపిస్తోంది

హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ లో ఆత్మహత్య చేసుకొన్న రోహిత్ బలవన్మరణంలో వైస్ ఛాన్సలర్ తప్పిదం స్పష్టంగా కనిపిస్తోందని ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నేత, వైెఎస్సార్సీపీ అధ్యక్షులు వైెఎస్ జగన్ అభిప్రాయ పడ్డారు. ఆత్మహత్య చేసుకొన్న రోహిత్ కుటుంబసభ్యుల్ని వైఎస్ జగన్ పరామర్శించారు. హైదరాబాద్ ఉప్పల్ లోని రోహిత్ ఇంటికి వైఎస్ జగన్ వెళ్లారు. ఆయన వెంట పార్టీ సీనియర్ నేతలు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఉప్పులేటి కల్పన, మెరుగు నాగార్జున తదితరులు ఉన్నారు.

నాగార్జున యూనివర్శిటీ లో రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకొన్న ఘటన్ని ఆయన గుర్తు చేసుకొన్నారు. ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో కూడా వైెస్ చాన్సలర్ తప్పిదాలు స్పష్టంగా కనిపిస్తోందని అభిప్రాయ పడ్డారు. పిల్లల్ని సంరక్షించాల్సిన వైస్ ఛాన్సలర్ లు ఆ పని చేయలేక పోతే, పిల్లలు చనిపోయే దాకా పరిస్థితిని తీసుకొస్తే.. ఏమనుకోవాలి అని వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. 

ఐదుగురు విద్యార్థుల మీద సస్పెన్షన్ విధించారు, ఇందులో ఒకరు చనిపోయారు. మిగిలిన నలుగురు విద్యార్థులు ఇప్పటికీ న్యాయం కోసం దీక్ష చేస్తున్నారు. అని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు  యూనివర్శిటీ వెళ్లిపో అంటే ఎక్కడకు వెళ్లాలో తెలీని పరిస్థితి. లైబ్రరీకి వెళ్లే పరిస్థితి లేదు, క్యాంటీన్ కు వెళ్లే పరిస్థితి అంతకన్నా లేదు. అని వైఎస్ జగన్ అన్నారు. ఇప్పటికైనా మానవత్వంతో వ్యవహరించి మిగిలిన నలుగురి మీద సస్పెన్షన్ ను వెనక్కి తీసుకోవాలని కోరారు. 

రేపు యూనివర్శిటీకి వెళ్లి ఆ నలుగురు విద్యార్థుల దీక్ష శిబిరం దగ్గరకు వెళతానని చెప్పారు. సంఘీభావం తెలియచేస్తామని జన నేత వైఎస్ జగన్ అన్నారు. 

No comments:

Post a Comment