28 January 2016

అందరం ఒక్కటవుదాం..హోదా కోసం ఒత్తిడి తీసుకొద్దాం

తూర్పుగోదావరిః  కాకినాడ యువభేరి సదస్సులో ఈరతం నాయకుడు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ యువతతో ముఖాముఖి మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆవశ్యకత గురించి వైఎస్ జగన్ వారికి దిశానిర్దేశం చేశారు. ఈసందర్భంగా విద్యార్థులు, నిరుద్యోగులు అడిగిన సందేహాలన్నంటినీ వైఎస్ జగన్ నివృత్తి చేశారు. అందరం ఒక్కటై ప్రత్యేకహోదాను సాధించుకుందామన్నారు.  హోదాకు అడ్డుపెడుతున్న చంద్రబాబు చెంపలాగిపెట్టికొట్టాలని విద్యార్థిలోకానికి పిలుపునిచ్చారు. 

ప్రవీన...(స్టూడెంట్)
ప్రత్యేకహోదాపై  చంద్రబాబుబాబు వెనకడుగు వేస్తున్నారు. ప్రత్యేకహోదా వల్ల అనేక లాభాలు ఉన్నప్పటికీ కేంద్రప్రభుత్వం  ఎందుకు వెనకడుగు వేస్తోంది.

వైఎస్ జగన్...
ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు ఎమ్మెల్యేలను కొంటూ అడ్డంగా దొరికిపోయారు. దాన్నుంచి తప్పించుకునేందుకే చంద్రబాబు హోదాను కేంద్రం వద్ద తాకట్టుపెట్టాడు.  వాళ్లను గట్టిగా నిలదీస్తే జైల్లో పెడతారని చంద్రబాబు బయపడుతున్నాడు.  అందరం కలిసి బాబుపై ఒత్తిడి తీసుకొద్దాం. అందరం కలిసికట్టుగా చేస్తేనే సాధ్యమవుతోంది. 

సౌజన్య..(స్టూడెంట్)
యూనివర్సిటీలో రాజకీయ ప్రమేయాలు ఎక్కువయ్యాయి. దానికేమైనా చర్యలు చేపట్టే ప్రయత్నం చేస్తారా సార్. 

వైఎస్ జగన్.
రాజకీయ ప్రమేయం లేకుంటేనే యూనివర్సిటీలు బాగుంటాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో  ఓవిద్యార్థిని వేధించేందుకు ఓ కేంద్రమంత్రి మరో కేంద్రమంత్రికి  లేఖ రాయడం... ఆలేఖ పట్టుకొని సదరు కేంద్రమంత్రి ఐదుసార్లు వీసీకి లెటర్ రాసి ఒత్తిడి తీసుకొచ్చింది. దాన్ని పట్టుకొని వీసీ సస్పెండ్ చేశాడు. ఓ విద్యార్థి ఆత్మహత్యకు కారణమయ్యారు. రాజకీయ ప్రమేయం ఇంతటితో ఆగలేదు. ఎస్వీ  యూనివర్సిటీలో  చంద్రబాబు కొడుకు లోకేష్ పుట్టినరోజు జరిగితే వీసీ వెళ్లి కేక్ కట్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన  ఫోటోను వైఎస్ జగన్ యువభేరి సభా ముఖంగా చూపించారు. హోదా కోసం పిల్లలను చైతన్యవంతులను చేసేందుకు క్యాంపస్ అడిగితే ఇవ్వడం లేదు. హోదాపై యువత చైతన్యవంతులయితే ప్రమాదం అని చంద్రబాబు దాన్ని అణచాలని చూస్తున్నారు. ఈవ్యవస్థను రూపుమాపే రోజు వస్తుంది తల్లి. 

శ్రీనివాస్..(స్టూడెంట్)
క్యాబినెట్ తీసుకొనే డెసిషన్ ను నీతి ఆయోగ్ కు పంపించాలని మాట్లాడుతున్నారు. క్యాబినెట్ ద్వారా పాస్ అవ్వాల్సిన దాన్ని బాబు ఇంత చేస్తున్నాడు. 

వైఎస్ జగన్..
ఎంత దారుణంగా ఆరోజు రాష్ట్రాన్ని విడగొట్టారంటే. రాష్ట్రాన్ని విడగొట్టేనాడు ప్రధానమంత్రి చెప్పినదానికి ప్రతిపక్షాలన్నీ మద్దతిచ్చి విడగొట్టారు.  పార్లమెంట్ లో ఇచ్చిన విలువకే దిక్కుదివానా లేకపోతే ..ఎక్కడకు పోవాలన్న ప్రశ్న తలెత్తుతోంది. ఎక్కడకు పోతున్నామో ప్రతి ఒక్కరు  ఈ రాజకీయ వ్యవస్థను ప్రశ్నించుకోవాలి. చంద్రబాబు, వెంకయ్యనాయుడు, బీజేపీ అందరూ కలిసి విడగొట్టారు. దీనికి ఖచ్చితంగా బాధ్యత వహించాలి. 

శ్రావణి..
రాష్ట్రంలో చాలా మంది మందు తాగి చనిపోతున్నారు. కుటుంబాలు నాశనమయిపోతున్నాయి సార్. 

వైఎస్ జగన్
చంద్రబాబు ఎన్నికల ముందు షాపులు తగ్గిస్తాను, మద్యపానాన్ని తగ్గిస్తాను అని రకరకాల స్పీచ్ లు ఇచ్చాడు. బాబు సీఎం అయ్యాక షాపులు లేని గ్రామాల్లోనూ చంద్రబాబు దగ్గరుండి షాపులు పెట్టించి అనధికారికంగా వేలం వేయించి పోలీసులతో షాపులు నడిపిస్తున్నాడు. మద్యాన్ని పెంచి పోషిస్తున్నాడు. శ్రావణి అమ్మ మీకు హామీ ఇస్తున్నా. మన ప్రభుత్వం వచ్చాక ఒక్క షాపు కూడా లేకుండా చేస్తా. పూర్తిగా మద్యపానాన్ని నిషేధిస్తాం. మద్యం తాగాలంటే సూట్ బూస్ వేసుకునే వాళ్లు హోటల్ లో తాగుతారు. 

శివ..
పోలీస్ రిక్రూట్ మెంట్ అన్నారు. ఇంతవరకు లేదు. అదిగదిగో వస్తున్నాయని ఆంధ్రరాష్ట్రం మభ్యపెడుతోంది.  తెలంగాణకు అన్నీ నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి.  రేపు రేపు అని నిమ్మకాయల చినరాజప్ప చెబుతున్నాడు. నిరుద్యోగులంతా ఆశగా ఎదురుచూస్తున్నారు సార్. 

వైఎస్ జగన్..
ఏపీపీఎస్సీ రిక్రూట్ మెంట్ లేదు. ఇయర్ క్యాలెండర్ రిలీజ్ చేయరు. లక్షా 42,828 ఉద్యోగాలున్నాయని రాష్ట్రం విడగొట్టేనాడు చెప్పారు. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వడం లేదు. డీఎస్సీ రాసిన వారికి ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తరో తెలియని ఆందోళనలో వారు ఉన్నారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా చంద్రబాబు ఉన్న ఉద్యోగాలు ఊడబెరుకుతున్నాడు. 20 నెలలు దాటింది. ఇంతవరకు ఏమీ లేదు. ప్రభుత్వంపై పోరాడుదాం. 

శిరీష..(విద్యార్థిని)
అన్న నేను ఏడాదిన్నర నుంచి ఎస్ ఐ కోచింగ్ లో ఉన్నాను. అసలు ఈప్రభుత్వం ఉన్నంతకాలం నోటిఫికేషన్లు ఇస్తదంటారా.

వైఎస్ జగన్..
కర్మ ఏంటంటే చంద్రబాబు చర్మం ఈమధ్య కాలంలో మందమైపోయింది. మనిషికో మాట పశువుకో దెబ్బ అన్నమాదిరి చంద్రబాబుకు ఎంత చెప్పినా పట్టించుకోరు. సిగ్గు ఎగ్గూ లేదు. కనీసం నీ మాటలైనా తగిలి చంద్రబాబుకు సిగ్గు వస్తుందేమో తల్లి. చంద్రబాబును గట్టిగా నిలదీద్దాం. 

ఈశ్వరి..(విద్యార్థిని)
బాబు వస్తే జాబు గ్యారంటీ అని చాలా బాగా చెప్పాడు. రెండు సంవత్సరాల నుంచి అసలు చంద్రబాబు ఏం చేస్తున్నాడు అన్నా. ఉద్యోగాలు లేక బీటెక్ వాళ్లు దొంగతనాలు చేస్తున్నారు, నక్సలైట్లు అవుతున్నారని చెబుతున్నారన్నా. తలచుకుంటేనే భయమవుతుందన్నా. 

వైఎస్ జగన్..
బాబు వస్తే జాబు అన్నాడు. ఇవాళ  ఉన్న ఉద్యోగాలు ఊడబెరుకుతున్నాడు. ఉద్యోగం లేని వారికి నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి అన్నాడు. అదీ ఇవ్వడం లేదు. ప్రత్యేకహోదా తెచ్చుకుంటే ఉద్యోగాలు వస్తాయి. ఖచ్చితంగా పోరాడుదాం తల్లి. 

రాహుల్..(ఇంజినీరింగ్ స్టూడెంట్)
పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీకే విలువలేకపోతే దేశంలో ఏముందనుకోవాలి. పోరాటం ఏవిధంగా ముందుకు తీసుకుపోవాలి. మీరు మాకు దిశానిర్దేశం చేయాలి. సివిల్ ఇంజినీరింగ్ పోస్టుు 10 వేలు ఖాళీలున్నాయి. వాటిని విడుదల చేయడం లేదు.

వైఎస్ జగన్..
విశ్వసనీయత అన్న పదం  రాజకీయ నాయకులకు లేకుండా పోతోంది. విశ్వసనీయతను రాజకీయ వ్యవస్థలోకి తీసుకురావాలంటే అబద్ధం చెప్పిన చంద్రబాబు  చెంప చెళ్లుమనిపించాలి.

హిమజ( డిగ్రీ సెకండియర్)
భారత పౌరులకు రాజ్యాంగం మీద కొంతైనా అవగాహన ఉండాలి. మీరు చెప్పిన ఇన్ని రైట్స్ ఉంటాయమని మాకు తెలియదు సార్. ఇప్పుడు చాలా తెలుసుకున్నాం.

వైఎస్ జగన్..
విద్యార్థులకు సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటే రాజకీయనాయకులను ప్రశ్నించవచ్చు. విషయం మీద అవగాహన ఉండాలంటే నెట్ లోకి వెళ్లి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పైనాన్స్ డిపార్ట్ మెంట్ స్పెషల్ స్టేటస్ కొడితే రకరకాల వెబ్ సైట్స్ ఉంటాయి తల్లి. పార్లమెంట్ రీసెర్చ్ సెంటర్ లో డాక్యుమెంట్ చదివితే చాలు. స్పెషల్ స్టేటస్ ఏంటి. ఎవరికిస్తున్నారు. పూర్తిగా అవగాహన లభిస్తుంది. అప్పుడు చంద్రబాబు, మంత్రులు అబద్ధాలు చెప్పినప్పుడు గట్టిగా నిలదీయోచ్చు. మా చెవిలో పూలు లేవని టీడీపీ, బీజేపీ వాళ్లను ప్రశ్నించవచ్చు. అదేవిధంగా వైఎస్సార్ కాంగ్రెస్ వెబ్ సైట్ లోకి వెళ్లితే అందులో ప్రత్యేకహోదా కరపత్రం ఉంటుంది. అక్కడ హోదాకు సంబంధించి పూర్తిగా సమాచారం ఉంటుంది తల్లి. www.ysrcongress.com లో పూర్తి సమాచారం లభిస్తుంది. 

బాల..(స్టూడెంట్)
ప్రత్యేకహోదా వస్తదా రాదా. మేము అసలు ఉద్యోగాలు చేస్తామా సార్. 

వైఎస్ జగన్..
ఇంతకుముందు చెప్పిన విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ వెబ్ సైట్ ఓపెన్ చేస్తే హోదా వల్ల కలిగే మేలు తెలుస్తుంది. 
రాష్ట్రానికి హోదా ఇస్తామని కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు అందరూ కలిసి రాష్ట్రాన్ని విడగొట్టారు. అందరం కలిసికట్టుగా పోరాడి హోదాను తెచ్చుకుందాం తల్లి. హోదా వల్ల జగన్ కు ఏ ఉద్యోగం రాదు తల్లి. నాకో నాలాంటి వాళ్లకోసమో కాదు. డిగ్రీ పుచ్చుకొని కాళ్లరిగేలా తిరుగుతున్న మనలాంటి సామాన్యుడికి హోదా ఖచ్చితంగా కావాలి. సామాన్యుడికి ఉపయోగపడేవిధంగా చేయనప్పుడు పదవిలో ఉండడమెందుకు. గట్టిగా పోరాడుదాం.

No comments:

Post a Comment