28 January 2016

మెడలు వంచైనా ప్రత్యేక హోదాను సాధించుకొందాం..!

ప్రత్యేక హోదా తో ఎన్నెన్నో ప్రయోజనాలు
చంద్రబాబు తాకట్టు పెట్టేశారు
నిలదీయాల్సిన సమయం వచ్చేసింది 



కాకినాడ: ప్రత్యేక హోదా ను సాధించుకొనేందుకు చంద్రబాబు ని నిలదీయాల్సిన సమయం ఆసన్నమైందని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ అభిప్రాయ పడ్డారు. విద్యార్థులు, యువత కలసి వచ్చి ప్రత్యేక హోదాను సమష్టిగా సాధించుకొందామని ఆయన పిలుపు ఇచ్చారు. ప్రత్యేక హోదా ప్రాధాన్యాన్ని వైఎస్ జగన్ కాకినాడ యువభేరి వేదికగా విద్యార్థులు, యువతకు వివరించారు.

కేంద్ర గ్రాంట్లు 90 శాతం ..!
ఆర్థికసంఘం సిఫార్సుల మేరకు   గ్రాంట్లు, లోన్ ద్వారా రాష్ట్రాలకు సొమ్ము అందుతుంది. గ్రాంట్ అయితే తిరిగి చెల్లించక్కర్లేదు. అదే లోన్ అయితే తిరిగి చెల్లించాలి. ప్రత్యేకహోదా ఉంటే కేంద్ర నిధుల్లో 90 శాతం గ్రాంట్. ఈ 90 శాతం తిరిగి చెల్లించనక్కర లేదన్న మాట. లోన్ కేవలం 10 శాతం ఉంటుంది. ప్రత్యేకహోదా లేని రాష్ట్రాలకు కేంద్రం 30 శాతానికి మించి గ్రాంట్లు ఇవ్వదు. మిగతా 70 శాతం లోన్ గానే వస్తుంది.   అదేవిధంగా  ప్రత్యేకహోదా కలిగిన రాష్ట్రాలకు విపరీతంగా పారిశ్రామిక రాయితీలు ఇస్తారు. దేశంలో ఇప్పటి వరకు  11 రాష్ట్రాలకు హోదా ఉంది. వీటికి మాత్రమే రాయితీలు ఇచ్చారు. వేరేవాళ్లకు ఇవ్వలేదు. 100 శాతం ఎక్సైజ్ రాయితీలు,  ఇతర సుంకాల మినహాయింపులు ఉంటాయి. ట్రాన్స్ పోర్ట్ ఖర్చులు వెనక్కిస్తారు. పరిశ్రమలకి ఇచ్చే కరెంట్ 20 ఏళ్లపాటు రాయితీ ఇస్తారు. ఇలా ఎన్నెన్నో ప్రయోజనాలు ఉంటాయి.

అన్నీ తెలిసే బాబు మోసం..!
చంద్రబాబు మలేషియా, సింగపూర్ వెళ్లాల్సిన పనిలేదు. ఆయన చేయాల్సిందల్లా ఢిల్లీకి వెళ్లి కేంద్రం మీద ఒత్తిడి తేవాలి. హోదా వస్తే పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి క్యూ కడతారని బాబుకు తెలిసికూడా తెలియనట్టు ఉంటాడు. ప్రత్యేక హోదా వస్తే  ప్రతి జిల్లా ఓ హైదరాబాద్ అవుతుంది.  హోదా కోసం మన రాష్ట్రంలోని పెద్దలు, ముఖ్యమంత్రులు, మంత్రులు పోరాడడం లేదు.

ఆనాడు పార్లమెంట్ లో టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ లు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు రాష్ట్రానికి హోదా ఇస్తామని హామీ ఇచ్చారు.   ఐదేళ్లపాటు కాంగ్రెస్   హోదా ఇస్తామంటే... ఐదేళ్లు కాదు పదేళ్లు కావాలని బీజేపీ, చంద్రబాబు రాజ్యసభలో అడిగారు. ఆరోజు అందరూ కలిసికట్టుగా ఒక్కటై ప్రత్యేకహోదా ఇస్తామన్న హామీ ఇచ్చి విడగొట్టారు. ఆతర్వాత ఎన్నికలకు వెళ్లారు. రకారకాలుగా పాంప్లెంట్ వేశారు. ప్రతి ఇంటికి పంపించారు. మేనిఫెస్టో రిలీజ్ చేశారు. 

హోదా గురించి ఎప్పుడు ఉద్యమించినా రోజుకో అబద్దమే. వాళ్లంతటే వాళ్లే చెబుతారు హోదా లేదు. దాని శకం ముగిసిందని చెబుతారు. వీళ్లు చెబుతున్న అబద్ధాలు చూస్తే బాధనిపిస్తోంది. మన పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లేఖ రాస్తే, ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కొనసాగుతోందని పార్లమెంటు వేదికగా కేంద్రం జవాబిచ్చింది. అయినా సరే, ఇక్కడ అబద్దాలు ఆడుతున్నారు. ప్రజలు బయటకొడతారని ఆంధ్రకు వచ్చినప్పుడు అబద్ధాలు చెబుతున్నారు.

ఆర్థికసంఘం అడ్డుతగులుతుందని మాట్లాడతారు. వాళ్ల పరిధి కాదు. కేవలం రాష్ట్రాలమధ్య ట్యాక్స్ లు ఎలా పెంచాలన్నది డీల్ చేస్తారు. రాష్ట్రాల మధ్య నిధుల పంపకాలు.

మేము చదువుకున్నాం, డిగ్రీలు పాస్ అయ్యాం. మేం ఈతరం వాళ్లం. తెలియని విషయాలు తెలుసుకుంటాం, నిలదీస్తామని చెప్పండి. ఆర్థికసంఘాలకు హోదా ఇవ్వాలన్న కెపాసిటీ లేదు. అది అర్థమయ్యేట్లు చెప్పండి. హోదా కలిగిన రాష్ట్రానికి వనరులు తక్కువ ఇస్తున్నారు. లేని రాష్ట్రానికి ఎక్కువ ఇస్తున్నారని బాబు ఈమద్య మళ్ల మభ్యపెట్టేప్రకటన చేస్తున్నాడు.

చంద్రబాబును అడగండి. హోదా ఉన్న రాష్ట్రాలకు ఎంత డబ్బులు ఇవ్వాలన్నదానికి ఫార్ములా లేదు. జమ్ముకాశ్మీర్ ఎన్నికలప్పుడు మోదీ వెళ్లాడు. 70 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించాడు.

కోటి 20 లక్షల జనాభా ఉన్న జమ్ముకాశ్మీర్ కు అంత ప్రకటిస్తే.. 5 కోట్లు ఉన్న మనకు ఎంత కేటాయించాలో బాబును అడగండి.

చంద్రబాబుమీద ఒత్తిడి పెంచాల్సిందే..!
ప్రత్యేక హోదా ఇచ్చే అధికారం జాతీయ అభివ్రద్ది మండలి ది. దీనికి అధ్యక్షులు ప్రధానమంత్రి. అలాగే క్యాబినెట్ కు కానీ, ఎన్టీయే మండలి కి కానీ, నీతి అయోగ్ కుకానీ ఛైర్మన్ ఆయనే.. మరి అటువంటప్పుడు ఆయనే సంతకం పెడితే ఆపేదెవరు. క్యాబినెట్ ఒక్క సంతకంతో ఇచ్చే నిర్ణయం. అప్పటి కేంద్ర క్యాబినెట్ తీర్మానం చేసి ప్లానింగ్ కమిషన్ కు పంపిస్తే.. 8 నెలల పాటు   అలాగే పడి  ఉంది. ఆ ఫైల్ కావాలని బాబు కేంద్రాన్ని అడిగిన పాపాన పోలేదు. చంద్రబాబు ఎందుకు గట్టిగా అడగడం లేదన్న డౌట్ అందరికీ వస్తుంది.

ఆంధ్ర రాష్ట్రంలో లంచాలు తీసుకొని ..మామూలు లంచాలు కాదు. ఎంత దారుణంగా అంటే పోలవరం నుంచి పట్టిసీమ వరకు..ఇసుక నుంచి మట్టి వరకు. బొగ్గు వరకు అన్నీ లంచాలే.   ఈలంచాలతో విచ్చలవిడిగా తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుంటే 8 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఒక్కొక్కరికీ 25 కోట్లు ఆశచూపి రెడ్ హ్యండెడ్ గా ఆడియో, వీడియో టేపులతో దొరికిపోయాడు. ఆకేసు నుంచి తప్పించుకునేందుకు హోదాను తాకట్టుపెట్టాడు.   హోదా  వేస్ట్ అని చెబుతున్నాడు.   పిల్లల జీవితాలు తాకట్టుపెట్టడం ఎంతవరకు సబబో బాబును నిలదీయాల్సిన సమయం వచ్చింది. బాబు మెడలువంచాలంటే జగన్ ఒక్కడే కాదు. జగన్ కు అందరూ తోడవ్వాలి. అందరం ఒక్కటై ఒత్తిడి తీసుకొస్తేనే ఇవాళ గాకపోతే రేపైనా ఇస్తారు. ఒత్తిడి తీసుకురాకపోతే మరుగున పరుస్తారు. రాబోయే రోజుల్లో గట్టిగా ఒత్తిడి తీసుకొద్దాం. మీ అందరి తోడు కావాలి . ప్రయాస పడి వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు. 

No comments:

Post a Comment