30 January 2016

పులివెందులలో ప్రజల చెంత జననేత

క్యాంపు క్యార్యాలయంలో బిజీబిజీ
వైఎస్ జగన్ ను కలుసుకున్న పార్టీశ్రేణులు, ప్రజలు
స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్న జననేత

వైఎస్సార్ జిల్లాః  ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వైఎస్సార్ జిల్లా పర్యటనలో బిజీగా గడిపారు.  పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉన్న జననేతను...పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కలుసుకొని తమ సమస్యలను విన్నవించారు. వారి విన్నపాలను వైఎస్ జగన్ సావధానం విన్నారు. ఈసందర్భంగా వైఎస్ జగన్ సమక్షంలో ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ లో చేరారు. అందరికీ వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.  కార్మికుల సమస్యలు, గుర్తింపు ఎన్నికలపై వైఎస్సార్ మజ్దూర్ యూనియన్ నేతలు వైఎస్ జగన్ తో చర్చించారు. 

ఫిబ్రవరిలో రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న ఆర్టీసీ ఎన్నికల్లో వైఎస్సార్ మజ్దూర్ యూనియన్ ను గెలిపించుకుంటామని ఆర్టీసీ  కార్మికులు తెలిపారు. వైఎస్ జగన్ నాయకత్వాన్ని బలపరుస్తామని చెప్పారు. ఆర్టీసీ ప్రైవేటీకరణకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఈసందర్భంగా కార్మికులు వైఎస్ జగన్ దృష్టికి తీసుకొచ్చారు. తాము అధికారంలోకి వచ్చాక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని  జననేత వారికి హామీ ఇచ్చారు. కార్మికుల భద్రత, ఆర్టీసీ మనుగడే ధ్యేయంగా వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ ఏర్పాటైన సంగతి తెలిసిందే. 

పులివెందులలో ఆరోగ్యమిత్ర ఉద్యోగులు వైఎస్ జగన్ కలుసుకొని తమ గోడు చెప్పుకున్నారు. మహానేత వైఎస్. రాజశేఖర్ రెడ్డి ఓ వైద్యుడిగా తమను నియమించి తమను ఎంతో బాగా చూసుకున్నారని వారు తెలిపారు. అవార్డులు కూడా ఇచ్చారని చెప్పారు. వైఎస్సార్ చేపట్టిన ఈపథకాన్ని పక్క రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకున్నారని చెప్పారు. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఆరోగ్యమిత్రలను వైద్యమిత్రలుగా పేరు మార్చడంతో పాటు ఉన్నపళంగా విద్యార్హత సాకు చూపి తొలగించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ సలహా మేరకు కోర్టును ఆశ్రయించామని...న్యాయస్థానం తమకు అనుకూలంగా తీర్చి ఇచ్చిందని చెప్పారు. ఐనా కూడా చంద్రబాబు కుట్ర చేసి తొలగిస్తే..మన ప్రభుత్వం వచ్చాక అందరికీ న్యాయం చేస్తామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారన్నారు. 

No comments:

Post a Comment