25 January 2016

ఈ సారి ఆరోగ్య మిత్ర వంతు..!

* బాబు వచ్చాక జాబులు పోతున్న వైనం
* ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆదర్శ రైతుల ఉద్యోగాలు పోయాయి
* అంగన్ వాడీ ఉద్యోగాలు ఊగుతున్నాయి
* ఇప్పుడు ఆరోగ్యమిత్ర ఉద్యోగులు రోడ్డున పడుతున్నాయి
హైదరాబాద్ : ఎన్నికలకు ముందు బాబు వస్తేనే జాబు వస్తుంది అని ఊదర గొట్టిన చంద్రబాబు ...అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల్ని ఊడబెరుకుతున్నారు. అనేకమంది ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆదర్శ రైతులు ఇంటి బాట పట్టారు. ఇప్పుడు ఆరోగ్యమిత్ర ఉద్యోగులు రోడ్డున పడుతున్నాయి.
ఎన్నికల ముందు అదే ప్రచారం
ఎలక్షన్ల సమయంలో చంద్రబాబు రెచ్చిపోయి హామీలు ఇచ్చారు. బాబు వస్తేనే జాబులు వస్తాయని తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయి ప్రచారం చేశారు. ఉద్యోగం లేకపోతే మాత్రం నిరుద్యోగులకు భ్రతి కోసం రూ. 2వేల రూపాయిలు ఇప్పిస్తామని నమ్మబలికారు. ఇదంతా పూర్తయింది. ఎన్నికలు పూర్తయ్యాక చంద్రబాబుకి అయితే మాత్రం చక్కటి ఉపాధి లభించింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అదిగదిగో ఉద్యోగాలు వచ్చేస్తాయంటూ నిరుద్యోగులు ఆశగా ఎదురు  చూడసాగారు. కానీ, ఈలోగానే అసలు కార్యక్రమం మొదలైంది.

ఉద్యోగాలు తీసివేయటమే లక్ష్యంగా..!
అప్పటి దాకా ఉద్యోగాలు చేసుకొంటూ కుటుంబాల్ని పోషించుకొంటున్న అనేక మంది ఉసురు పెట్టేందుకు చంద్రబాబు సిద్ధపడ్డారు. మొదటగా ఆదర్శ రైతుల్ని తీసివేసి ఇంటికి పంపించారు. తర్వాత ఉపాధి హామీ పథకాన్ని పర్యవేక్షించి నివేదికలు సమర్పించే ఫీల్డు అసిస్టెంట్ ఉద్యోగుల్ని తీసివేశారు.  తర్వాత దశలో  అంగన్ వాడీ ఉద్యోగుల మీద కన్ను పడింది. కేవలం పెంచిన జీతాలు ఇప్పించండంటూ ధర్నా చేసినందుకు గాను, ఉద్యోగాల నుంచి తొలగించేందుకు చంద్రబాబు సిద్దపడ్డారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడు ఆరోగ్యమిత్రల వంతు..!
పేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశ పెట్టారు. దీని కింద నిరుపేద వర్గాలకు కూడా ప్రైవేటు ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం అందించేలా చర్యలు తీసుకొన్నారు. అయితే ఆయా కార్పొరేట్ ఆసుపత్రుల్లో బిల్లింగ్ విభాగాల్లో సమస్యలు వస్తుండటంతో దీన్ని పరిష్కరించేందుకు ఆరోగ్య మిత్ర పేరుతో ఉద్యోగుల్ని నియమించారు. ప్రతీరోజూ ఆయా కార్పొరేట్ ఆసుపత్రులకు వచ్చే పేదలకు వైద్య పరంగా బిల్లింగ్ పరంగా సాయం చేయటం ఈ ఉద్యోగుల విధి. ఇప్పుడు చంద్రబాబు కన్ను ఈ ఉద్యోగుల మీద పడింది. దీంతో ఒక్క కలం పోటు తో ఈ ఉద్యోగుల్ని ఇంటికి పంపించేందుకు మార్గం సిద్దం చేశారు. దీంతో ఈ ఉద్యోగులంతా లబోదిబోమంటున్నారు. 

No comments:

Post a Comment