22 January 2016

ద‌మ్ముంటే నిజాలు చెప్పండి..!

చంద్ర‌బాబుకు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌వాల్‌
నెల్లూరు:  చంద్ర‌బాబు నీకు ద‌మ్ముధైర్యం ఉంటే ఎంపీ మిథున్‌రెడ్డిపై పెట్టిన కేసులో నిజాలు బ‌య‌ట‌పెట్టు. ఛాలెంజ్ చేసి అడుగుతున్నా ఆయ‌న త‌ప్పు చేసిన‌ట్లు రుజువు చేయ‌గ‌ల‌రా?  రాష్ట్రంలో దారుణ‌మైన పాల‌న సాగిస్తున్నారు. ఎమర్జెన్సీని త‌ల‌పిస్తోంది. బ్రిటీష్ పాల‌న‌కంటే దారుణంగా ఉంద‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌వాల్ విసిరారు. మా పార్టీ ఎంపీఎమ్మెల్యేల‌పై దొంగ కేసులు పెట్టి జైల్లో పెట్టారు. ఖ‌చ్చితంగా చెబుతున్నా... ఇవే ప‌రిస్థితులు మీకూ వ‌స్తాయ‌ని వైఎస్ జ‌గ‌న్ ఏపీ సీఎం చంద్ర‌బాబుపై నిప్పులు చెరిగారు. నాలుగు రోజ‌లుగా నెల్లూరు సెంట్ర‌ల్ జైల్లో ఉన్న రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిచంద్ర‌గిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి బాస్క‌ర్‌రెడ్డిశ్రీ‌కాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జీ బియ్య‌పు మ‌ధుసూద‌న్‌రెడ్డిని   వైఎస్ జ‌గ‌న్ ప‌రామ‌ర్శించారు. 
ద‌మ్ముంటే వాస్త‌వాలు బ‌య‌ట పెట్టండి
ఆ రోజు ఏం జ‌రిగిందంటే న‌న్ను సాగ‌నంప‌టానికి మిథున్ రెడ్డి ఎయిర్‌పోర్టుకు వ‌చ్చారు. ఆ స‌మ‌యంలో 19మంది ప్ర‌యాణీకులు ఎయిర్‌పోర్టు మేనేజ‌ర్ త‌మ‌కు బోర్డింగ్ పాసులు ఇవ్వ‌లేద‌ని ఫిర్యాదు చేశారు. వారికి బోర్డింగ్ పాస్ ఎందుకు ఇవ్వ‌లేద‌ని మేనేజ‌ర్‌ను అంద‌రి ముందే మిథున్ రెడ్డి అడిగారు. అలా మిథున్‌రెడ్డి అడ‌గ‌డం త‌ప్పా?  ఆ ప్రయాణీకులు మేనేజ‌ర్ దురుసుగా ప్ర‌వ‌ర్తించిన‌ట్టు రాత‌పూర్వ‌కంగా ఫిర్యాదు చేశారు. ఆ లెట‌ర్ ఎందుకు బ‌య‌ట‌పెట్ట‌డం లేదు?  ఆ రోజు ఎయిర్‌పోర్టు మేనేజ‌ర్ 2 గంట‌ల నుంచి 8గంట‌ల వ‌ర‌కు ఎయిర్‌పోర్టులోనే ప‌ని చేశాడు. మిథున్ చేయి చేసుకొని ఉంటే ఆరుగంట‌ల‌పాటు మేనేజ‌ర్ ఎలా ప‌ని చేస్తాడు?  ఎయిర్‌పోర్టులో మిథున్ చేయిచేసుకుంటే సీఐఎస్ ఎఫ్ బ‌ల‌గాల‌కు తెలియ‌కుండా పోతుందా?  నిజంగా కొట్టి ఉంటే వారు మిథున్‌రెడ్డిని అరెస్టు చేసి ఉండేవారు కాదా?  కేసులు పెట్టేవారు క‌దా?  తిరుప‌తి ఎయిర్‌పోర్టులో సీసీ కెమెరాలు ఎక్కువ‌గా ఉన్నాయి. అంద‌రి ముందు మిథున్ కొట్టి ఉంటే సీసీ కెమెరాల్లో ఉండాలి అలా ఎక్క‌డైనా ఉందా?  ఉంటే ఆ సీసీ ఫుటేజ్ ల‌ను ఎందుకు బ‌య‌ట‌పెట్ట‌డం లేదు?  ఆయ్యా చంద్ర‌బాబూ... మీకు ద‌మ్ముధైర్యం ఉంటే నిజాలు చెప్పండ‌ని వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి బ‌హిరంగంగా స‌వాల్ విసిరారు. 
ఇదంతా బాబు గీసిన స్కెచ్‌
అదే రోజు సాయంత్రం తిరుప‌తికి వ‌చ్చిన చంద్ర‌బాబు వెంట‌నే స్కెచ్ గీశారు. పోలీసుల‌పై ఒత్తిడి తెచ్చారు. ఎయిర్‌పోర్టు మేనేజ‌ర్‌పైనా ఒత్తిడి తెచ్చి కేసు పెట్టించారు. కేసు పెట్టిన త‌ర్వాత సాధార‌ణంగా ఆసుప‌త్రిలో మెడికో లీగ‌ల్ స‌ర్టిఫికేష‌న్ జ‌రుగుతుంది కాబ‌ట్టి రుయా ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. సీమాంధ్ర‌లో ఇవాళ రుయా నెంబ‌ర్‌-1 ఆస్ప‌త్రి. మేనేజ‌ర్ బాగానే ఉన్నాడ‌నిఎలాంటి దెబ్బ‌లూ త‌గ‌ల‌లేద‌ని రుయాలో స‌ర్టిఫై చేశారు. మ‌రుస‌టి రోజు మేనేజ‌ర్ డ్యూటీకి వెళ్లారు. విష‌యం తెలుసుకున్న చంద్ర‌బాబుఆయ‌న దూత‌లు అయ్య‌య్యో మీరు డ్యూటీకి వెళితే కేసు నిల‌బ‌డ‌దంటూ మేనేజ‌ర్‌ను య‌శోద ఆస్ప‌త్రిలో చేర‌మ‌న్నారు. సంఘ‌ట‌న జ‌రిగిన నాలుగు రోజుల త‌ర్వాత మేనేజ‌ర్ ప్రైవేట్ ఆస్ప‌త్రి య‌శోద‌లో చేరారు. మేనేజ‌ర్ సోద‌రుడు ఆ య‌శోద ఆస్ప‌త్రిలో ప‌ని చేస్తున్నాడు. ఒక ఎంపీ మీద దొంగ కేసు పెట్టి ఇంత దారుణంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని వైఎస్ జ‌గ‌న్ పేర్కొన్నారు.
క‌మీష‌న్ల‌కు అడ్డుప‌డుతున్నాడ‌నే మిథున్‌రెడ్డిపై దొంగ‌కేసులు
చిత్తూరు జిల్లాలో ఇరిగేష‌న్ స‌హా అన్ని ప్రాజెక్టుల్లో చంద్ర‌బాబుఆయ‌న కొడుకు కాంట్రాక్ట‌ర్ల‌తో కుమ్మ‌క్కై క‌మీష‌న్లు దోచుకుంటున్నారు. అయితే టెండ‌ర్ల‌లో మిథున్ పోటీకి వెళ్లి ఎల్‌1 వ‌చ్చే విధంగా త‌క్కువ‌కు కోట్ చేస్తున్నారు. మిథున్ ఉంటే త‌క్కువ‌కు టెండ‌ర్లు వేసి త‌మ‌కు క‌మీష‌న్లు రాకుండా అడ్డుప‌డుతున్నాడ‌నే చంద్ర‌బాబుఆయ‌న కుమారుడు మిథున్‌రెడ్డిపై క‌క్ష‌క‌ట్టార‌ని వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆరోపించారు. అందుకే ఒక ఎంపీపై దొంగ కేసులు బ‌నాయించే స్థాయికి దిగ‌జారిపోయార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. చంద్ర‌బాబును ఒక్క‌టే అడుగుతున్నా... ఇన్ని ప్ర‌శ్న‌లు వేశా. ద‌మ్ముధైర్యం ఉంటే వాటికి జ‌వాబు చెప్పాలి. దొంగ కేసులు బ‌నాయిస్తూ మీరు సాగిస్తున్న పాల‌న‌ను ప్ర‌జ‌లు చూస్తున్నారు. పై నుంచి దేవుడు చూస్తున్నాడు. క‌చ్చితంగా వీళ్లంద‌రి ఉసురు మీకు త‌గులుతుంది. మీరు బంగాళాఖాతంలో క‌లిసే రోజు త్వ‌ర‌లోనే వ‌స్తుందన్నారు. 
స‌న్మానించాల్సిన వారిని జైల్లో పెడ‌తారా?
రాష్ట్రం స‌మైక్యంగా ఉండాల‌ని ఎంతో మంది పోరాడారు. అందులో చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి కూడా ఒక‌రు. స‌మైక్యాంధ్ర కోసం ఉద్య‌మం చేసినందుకు స‌న్మానించాల్సింది పోయి ఆ కేసును ఉప‌యోగించుకుని భాస్క‌ర్‌ని అరెస్ట్ చేస్తారామ‌రింత దుర్మార్గం ఏమిటంటే 2009లో గోడ‌ల‌పై రాత‌లు రాశార‌న్న కేసును తిర‌గ‌దోడి భాస్క‌ర్‌రెడ్డిని పీలేరుకు తీసుకెళ్తున్నార‌ట‌. ఇంత‌క‌న్నా అన్యాయం ఏమ‌న్నా ఉంటుందా?  అన్నా... భాస్క‌ర్‌ని నాక‌న్నా ఎక్కువ‌గా వేధిస్తున్నార‌ని లోప‌ల క‌లిసిన‌ప్పుడు మిథున్‌రెడ్డి చెబుతున్నారు. అరెస్ట్ చేసిన ఎంపీఎమ్మెల్యేల‌ను క‌లిసే అవ‌కాశం కూడా లేకుండా చేస్తున్నారు. ఈ ప‌రిపాల‌న ఎమ‌ర్జెన్సీని త‌ల‌పిస్తోంది. ఇలాంటి పాల‌న సాగిస్తున్నందుకు చంద్ర‌బాబు సిగ్గుతో త‌ల‌దించుకోవాలి. ఎల్ల‌కాలం ఇలాగే ఉండ‌దు. మ‌నం ఏం నాటితే అదే పండు వ‌స్తుంది. మీక్కూడా ఇదే ప‌రిస్థితి వ‌చ్చే రోజులు త్వ‌ర‌లోనే వ‌స్తాయ‌ని వైఎస్ జ‌గ‌న్ అన్నారు. రోజ‌మ్మ‌గోపిరెడ్డి శ్రీ‌నివాస‌రెడ్డిమిథున్‌రెడ్డిచెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి,భూమా నాగిరెడ్డి ఇలా వైఎస్సార్ సీపీ ఎంపీలుఎమ్మెల్యేల‌పైన త‌ప్పుడు కేసులు పెట్టారు. భ‌య‌భ్రాంతుల‌కు గురి చేసి వారి స్థైర్యాన్ని దెబ్బ‌కొట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ప్ర‌జ‌లుఆ దేవుడు చూస్తున్నారు అని జ‌గ‌న్ తెలిపారు.

No comments:

Post a Comment