5 October 2015

ఇదేమి బ్రిటీష్ పాలనా..ఏమిటి..?


విజయనగరం) వచ్చే మూడేళ్లలో ప్రభుత్వం కుప్పకూలటం ఖాయమంటున్నారు ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్. అప్పుడు వచ్చేది తమ ప్రభుత్వమే అని ఆయన అంటున్నారు. విజయనగరం జిల్లా లోని భోగాపురం ఎయిర్ పోర్టు బాధిత గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఎయిర్ పోర్టు పేరుతో వేలాది ఎకరాల్ని దోచుకోవటం ఎంత వరకు న్యాయమని ఆయన సూటిగా ప్రశ్నించారు.
ఎయిర్ పోర్టు కోసం పేదల భూములను చంద్రబాబు గద్దల్లా లాక్కుంటున్నారని జగన్ ధ్వజమెత్తారు. రైతుల ఇష్టం లేకుండా ఎవరూ భూములు లాక్కోలేరన్నారు. భూములు తీసుకోవాలని ప్రయత్నిస్తే రైతుల తరుపున న్యాయపోరాటం చేస్తామన్నారు. అవసరమైతే కోర్టుకు వెళదామని భోగాపురం ప్రాంత రైతులకు భరోసా కల్పించారు.

ఇదే ప్రాంతంలో అయ్యన్నపాత్రుడు భూములున్నా వాటిని వదిలి..పేదల భూములు గుంజుకునే అధికారం ఎవరిచ్చారని జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎయిర్ పోర్టు పేరుతో పేదల భూములు లాక్కొని కోట్లు రూపాయలు  కొల్లగొట్టేందుకు చంద్రబాబు బినామీలైన అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాస్ లు ప్రయత్నిస్తున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. 


అడిగిన వాళ్లపై పోలీసు కేసులు పెడతారు. స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక బ్రిటీష్ పాలనలో ఉన్నామా అనిపిస్తోందని వైఎస్ జగన్ అన్నారు. 

No comments:

Post a Comment