20 October 2015

ఐటీ నిపుణుల సైకిల్ యాత్ర అంటూ మోసం



 హైదరాబాద్) మోసం అన్నదానికి పర్యాయపదం చంద్రబాబు. ఏ పనిలో అయినా మోసం చేసి నెగ్గుకొని రావటం, ఆయనకు తెలిసిన ట్లుగా ఇతరులకు చేత కావు. తాజాగా అమరావతి పేరుతో చేస్తున్న ప్రచారం లో కూడా మోసపు ఎత్తుగడలు ఉపయోగిస్తున్నారు.

 సైకిల్ యాత్ర పేరుతో పబ్లిసిటీ
 హైదరాబాద్, ఇతర నగరాల్లో ఐటీ నిపుణులు చంద్రబాబు కి మద్దతు పలుకుతున్నారంటూ   బాగా ప్రచారం చేసుకొన్నారు.   ఐటీ నిపుణులు చంద్రబాబు సేవల్ని బాగా ఇష్టపడ్డారని, ఆ స్ఫూర్తితో సైకిల్ యాత్ర ను సంకల్పించుకొన్నారని ప్రచారం చేశారు. హైదరాబాద్ లోని టీడీపీ ప్రధాన కార్యాలయం ఎన్టీయార్ ట్రస్టు భవన్ నుంచి  పెద్ద ఎత్తున సైకిళ్లతో బయలు దేరారు. వీరికి టీడీపీ రాష్ట్ర స్థాయి నేతలు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. చంద్రబాబు గొప్పతనం గురించి ఉపన్యాసాలు ఇచ్చారు.

 పచ్చ మీడియాకు పండగ
 తెలుగుదేశం ఆధ్వర్యంలో కార్యక్రమం అంటే పచ్చ మీడియాకు పండగే అని వేరే చెప్పనక్కర లేదు. అందుకే సైకిల్ ర్యాలీ ని రక రకాలుగా ఫోటోలు తీసి ప్రచురించారు. వీడియోలు తీసి ఛానెల్సు లో ప్రసారం చేశారు. ఇంటర్వ్యూలు చేసి జనం మీదకు వదిలారు. మొత్తం మీద ఐటీ నిపుణులంతా తరలి వస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చారు.


 ఇదీ వాస్తవం
 తీరా చూస్తే సదరు యువకులు తెలివిగా వ్యవహరించారు. టీడీపీ అగ్ర నేతలు వేసిన స్కెచ్‌ప్రకారం సైకిళ్లతో బయలు దేరి ఊరి దాటాక ఒక చోట కలుసుకొన్నారు. అక్కడ డీసీఎమ్ వ్యాన్ రప్పించుకొని అందులో వీటిని వేసుకొన్నారు. తాపీగా వెహికల్ మాట్లాడుకొని అందులోకి ఎక్కేశారు. ఊరి లో ఉన్నప్పుడు చేతులు ఊపుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన యువకులు, తర్వాత చేతులు కట్టేసుకొని హాయిగా వ్యాన్ లోకి ఎక్కేశారు.

 గతంలో కూడా ఇదే మోసం
 గతంలో ప్రక్రతి బీభత్సానికి తల్లడిల్లిపోయిన శ్రీకాకుళం మొదలు ప్రకాశం జిల్లా వరకు వరద బాధితుల్ని ఆదుకోవటానికి తెలుగుదేశం పార్టీ ముందుకు వ చ్చింది. పెద్ద ఎత్తున మందులు, సహాయ సామగ్రి పంపిస్తున్నట్లుగా ఎల్లో మీడియలో ప్రచారం చేయించుకొన్నారు. ఏడు వ్యాన్ ల్లోకి  ఎక్కించి సామాన్లు సర్దించుకొన్నారు. సీనియర్‌నాయకులు ఫోటోలు దిగారు. వీడియోలు తీయించారు. తర్వాత అక్కడ నుంచి బయలు దేరిన వాహనాలు సిటీలో నాలుగు వీధుల్లో చక్కర్లు కొట్టాయి. తర్వాత అవి వెనుక గేటు నుంచి ఎన్టీయార్ ట్రస్టు భవన్  కు చేరిపోయాయి. టీడీపీ ఆఫీసు ముందు గేటు నుంచి బయలుదేరిన వాహనాలు.. వెనక గేటు గుండా లోపలకు వచ్చేశాయి. అక్కడ మందులు, సామగ్రి మొత్తం దించేసుకొని ఆఫీసులో సర్దేసుకొన్నారు.

 అమరావతి కుట్రలు
 ఇదంతా తెలుగుదేశం నాయకులు చేస్తున్న కుట్ర. అమరావతి పేరుతో చేస్తున్న కుట్రలు ఇదే కోవలోనివి. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల నుంచి, మండలాల నుంచి మట్టి, జలాలు తెప్పించినట్లు కలరింగ్ ఇచ్చారు. ఇదంతా కూడా ఈ రకంగా చే స్తున్న గాంబ్లింగ్ లో భాగమే అన్న మాట వినిపిస్తోంది. వివిధ దేవాలయాలు, న దుల నుంచి తెప్పిస్తున్న జలాలు మొదలైనవి నిజమైనవేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.




No comments:

Post a Comment