14 October 2015

శంకుస్థాపన సరే, హామీల సంగతి ఏమిటి.


గుంటూరు) అమరావతి రాజధాని శంకుస్థాపన కోసం చంద్రబాబు ప్రభుత్వం బోలెడు హడావుడి చేస్తోంది. దాదాపు 4వందల కోట్ల రూపాయిల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తోంది. ఇతర రాష్ట్రాల నాయకుల ముందు తన దర్జాను ప్రదర్శించుకొనేందుకు ప్రజల సొమ్మును ఇలా రాళ్ల పాలు చేస్తున్నారు. కానీ, రాజధాని పేరుతో సర్వం కోల్పోతున్న స్థానికులది మాత్రం అరణ్య రోదనే అవుతోంది.

రాజధాని ప్రాంత వాసులకు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలు..
1. డ్వాక్రా మహిళలకు రుణాల మాఫీ.. అదిగదిగో అని ఊరించటం తప్ప డ్వాక్రా మహిళలకు ఏమాత్రం రుణమాఫీ చేయలేదు.

2. అన్నార్తుల కోసం ఎన్ టీ ఆర్ అన్న క్యాంటీన్ లు ఏర్పాటు.. ఆర్భాటంగా ప్రకటించారు తప్పితే ఒక్కటంటే ఒక్క క్యాంటీన్ ఏర్పాటు కాలేదు.

3. నిర్మాణ పనుల్లో స్థానికులకే ప్రాధాన్యం.. ఇంజనీర్లు, సూపర్ వైజర్ల  మాట దేవుడెరుగు, కూలీలను కూడా స్థానికుల్ని ఉఫయోగించలేదు. తాజాగా జరిగిన కరకట్ట పనుల్ని ఇతర ప్రాంతాల కూలీలతో చేయించారు. 

4. అభాగ్యులైన వ్రద్దుల కోసం వ్రద్దాశ్రమాలు నిర్మిస్తామన్నారు కానీ ఒక్క ఊర్లో కూడా ఆశ్రమం పెట్టలేదు.

5. నిరుపేదలకు ఇళ్లు కట్టిస్తామన్నారు. రాజధాని ప్రాంతాన్ని శాంపిల్ గా తీసుకొని యుద్ద ప్రాతిపదికన చేయిస్తామన్నారు. కానీ అడ్డగోలుగా గాలికి వదిలేశారు.
6.  వ్యవసాయం పనులు లేక ఉపాధి కోల్పోయేవారికి  నైపుణ్య శిక్షణ కేంద్రాల్లో తర్ఫీదు ఇప్పించి ఉపాధి కల్పిస్తామన్నారు. 20వేలకు పైగా  అర్హులు ఉన్నారని గుర్తించిన ప్రభుత్వం 2వందల మందికి కూడా పూర్తిగా ఉపాధి కల్పించలేకపోయింది.
7. నిర్మాణాలను క్రమబద్దీకరిస్తామని హామీ ఇచ్చారు. కానీ, మొత్తం రెవిన్యూ రికార్డుల్ని ఫ్రీజ్ చేసి ఉంచారు. దీంతో బడుగు జీవులు ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు.
8. బలహీన వర్గాలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పారు. కానీ ఒక్కరికి కూడా పట్టాలు ఇవ్వకుండా రోజులు గడిపేశారు.
9. గ్రామ కంఠాల సమస్యల్ని పరిష్కరిస్తామన్నారు. నెలలు గడుస్తున్నా వీటి ఊసు ఎత్తటం లేదు.
10. ఇవన్నీ అడగకుండా ఉండేందుకు రైతులకు పంచె కండువా ఇచ్చి నోళ్లు మూయించాలని ప్రభుత్వం భావిస్తోంది.

No comments:

Post a Comment