29 October 2015

చంద్రబాబే దత్తత తీసుకొన్నారు. కానీ, పరిస్థితి ఇలా మిగిలింది


ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న సామెతను బాగా వంట బట్టించుకొన్నారు. అందుకే ఏ సమయానికి ఆ ప్రకటన చేసేసి, ప్రచారం చేయించేసుకొని చేతులు దులుపుకొంటుంటారు.
గ్రామాల అభివ్రద్దికి ప్రతీ ఒక్కరూ  ముందుకు రావాలని, ప్రతీ ఒక్కరూ ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలని ప్రతిపాదించారు. అనటమే కాదు ఆర్బాటంగా ఆయన కూడా ఒక గ్రామాన్ని దత్తత తీసుకొంటున్నట్లు ప్రకటించారు. విశాఖపట్నం జిల్లా ఏజన్సీలోని అరకు మండలం పెదలబుడు పంచాయతీ ని ఆయన దత్తత తీసుకొన్నారు. ఈ సంగతి తెలియగానే పెదలబుడు గ్రామస్తుల ఆనందానికి అంతే లేదు.
పెదలబుడు గ్రామం రూపురేఖలు మారిపోతాయని, అభివ్రద్ది పరగులు తీస్తుందని అంతా ఆశించారు. కానీ అటువంటి అద్భుతాలు ఏమీ జరగలేదు. దత్తత తీసుకొన్నప్పుడు గ్రామం ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. మొత్తంగా ఇక్కడ 43 పనులు అవసరం అవుతాయని గ్రామస్తులు కలిసి ప్రతిపాదనలు తయారుచేశారు.
ముఖ్యంగా తాగునీటి సమస్య ఎక్కువగా ఉండటంతో నీటి సమస్యను తీర్చాలని విన్నవించుకొన్నారు. అదిగదిగో సురక్షిత తాగునీటి పథకం అన్నారు తప్పితే గొంతు తడిపే మార్గం లేదు. దీంతో గ్రామస్తులు ఎక్కడెక్కడ నుంచో నీరు తెచ్చుకొంటున్నారు. రహదారులు నిర్మించాలని ఎంత మొత్తుకొంటున్నా పట్టించుకొనే వారు కరవయ్యారు. ఈ గ్రామాన్ని కలిపేందుకు మూడు మార్గాలు ఉన్నాయి. అవన్నీ గోతులు గా మారి శిథిలావస్థలో ఉన్నాయి. పసి పిల్లలకు ఆహారం సమకూర్చే అంగన్ వాడీ భవనాలు శిథిల నిర్మాణాల్లో కునారిల్లుతున్నాయి.
దత్తత ప్రకటన అయితే విడుదల అయింది తప్పితే చంద్రబాబు గత ఏడాది కాలంలో ఇటువైపు చూసిన దాఖలాలు లేనేలేవు.
ఏరియా ఆస్పత్రి సమీపంలో బస్ షెల్టర్ నిర్మాణాన్న సంకల్పించారు. కానీ దాన్ని అలాగే వదిలేశారు.

సులబ్ కాంప్లెకస్ నిర్మాణానికి ప్రతిపాదనలు పేపర్ మీదనే ఉండిపోయాయి. ముందుకు కదలలేదు
అంబేద్కర్ సామాజిక భవనం నిర్మిస్తామని హామీలు గట్టిగా గుప్పించారు. పునాది రాయి పడింది తప్పితే ఫలితం లేదు.
కళ్యాణమండపం నిర్మిస్తామని గోడల వరకు కట్టించారు. తర్వాత 
పట్టించుకోకపోవటంతో పిచ్చి మొక్కలకు ఆలవాలంగా మారింది.

మరి, రాష్ట్రమంతా తిరిగి నీతులు చెప్పే చంద్రబాబు .. తాను దత్తత తీసుకొన్న గ్రామాన్ని ఎందుకు గాలికి వదిలేసినట్లు. ఈ ప్రశ్న గ్రామస్తుల మనస్సులో మెదలుతున్నప్పటికీ పైకి మాత్రం అడగలేరు కదా.

No comments:

Post a Comment