1 October 2015

చంద్రబాబు చెప్పిన పది జోక్ లు


  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ గా ఉంటారు కానీ కొన్ని సార్లు జోక్ లు వేస్తారు. అదికూడా సీరియస్ గానే జోక్ లు వేస్తారు. విజయవాడలో ఆస్తుల ప్రకటన గురించి మాట్లాడుతూ వేసిన జోక్ లు చూడండి. వాటికి కొన్ని వివరణలు కూడా ఉన్నాయి.  చంద్రబాబు ఏమన్నారంటే..

1) పదేళల్లో నేను ఎప్పుడూ జేబులో రూపాయి కూడా పెట్టుకోలేదు.
2) రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి నేను నిజాయతీగా వ్యవహరిస్తున్నాను.
3) నా జీవితం అంతా తెరిచిన పుస్తకం

() ఈ స్థాయిలో అబద్దాలు చెప్పటం చంద్రబాబుకే సాద్యం అవుతుంది ఏమో. జేబులో రూపాయి లేకుండానే సింగపూర్ లో బ్లాక్ మనీ పోగేసుకోవటం, నల్ల ధనంతో తెలంగాణ లో ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేయటం జరిగిందా అన్నది ప్రశ్న. దీన్నే రాజకీయాల్లో నిజాయతీ అనుకోవాలేమో. సొంత మామగారిని వెన్నుపోటు పొడవటాన్ని తెరిచిన పుస్తకం అనుకోవాలి. 

4) రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎంత ఆస్తి ఉందో, ఇప్పుడు అంతే ఆస్తి
5) ఆస్తులు, వ్యాపారాలు కుటుంబసభ్యులే చూసుకొంటారు.
6) వాచీ, ఉంగరం కూడా పెట్టుకోకుండా సామాన్యంగా ఉంటాను.
7) రాజకీయాల్లో విలువలు పాటిస్తున్నాను.

()ఇక రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రెండున్నర ఎకరాల ఆస్తి అన్నది అందరికీ తెలుసు. ఇప్పుడు ఎన్ని లక్షల కోట్ల రూపాయిల ఆస్తి అన్నది లెక్క పెట్టడానికి అందని విషయం. ఆస్తులు, వ్యాపారాలు కుటుంబ సభ్యులు చూసుకొన్నా.. నల్ల దనం విషయాలు బాబుగారి కోటరీ చూసుకొంటారని గిట్టని వారు అంటుంటారు. ఓటుకి కోట్లు కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయింది కాకుండా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్యాంపులు పెట్టి భయభ్రాంతులకు గురిచేసిన చంద్రబాబు.. రాజకీయాల్లో విలువలు అంటున్నారు.

8) మనుమడిని చూడటానికి కూడా ఇంటికి వెళ్లకుండా అభివ్రద్ది చేస్తున్నాను.
9) కుటుంబ ఆస్తులు సక్రమంగా నిర్వహిస్తూ ప్రకటిస్తున్నాం.
10) ఎన్నికల సమయంలో ఎన్ని నిధులు వచ్చినా సవ్యంగా వినియోగించి లెక్కలు చూపించాం.

() అడ్డగోలుగా వందల కోట్ల రూపాయిలు ఎన్నికల్లో పంచిన ఘనత చంద్రబాబుది కాదా.. జూబ్లిహిల్స్ లో చంద్రబాబు ఇంటి విలువ రూ. 23 లక్షలు అని ప్రకటించారు. అసలు జూబ్లిహిల్స్ లో భవంతిలు పాతికలక్షలు ఉంటాయా.. పాతిక కోట్లు ఉంటాయా..అయినా సరే, చంద్రబాబు ఇలాగే జోక్లు వేస్తారు.
చెప్పుకొంటూ వెళితే చంద్రబాబు జోక్ లు ఎన్నయినా ఉంటాయి కాదంటారా.


No comments:

Post a Comment