21 October 2015

దేవుడా..నీవే దిక్కు అంటున్న ప్రజలు

పడకేసిన ప్రభుత్వపరిపాలన
 () శంకుస్థాపన పేరుతోచంద్రబాబు ట్రిక్కులు
 () 3 నెలలుగా పరిపాలన పూర్తిగా గాలికి
  ()  ఒక్క సీఎమ్ వో లోనే 19వేలఫైల్సు పెండింగ్
 () మొత్తంసచివాలయుంలో రెండు లక్షలదాకా  పెండింగ్
 () అన్నివ్యవస్థలు అస్తవ్యస్తం
 
 హైదరాబాద్) 
 ముఖ్యమంత్రిగా చంద్రబాబు తన శక్తియుక్తులు అన్నీశంకుస్థాపన వీుదే పెడుతున్నారు. దీంతో మంత్రులు, ఉన్నతాధికారుల్నిపిలిచి అన్నిపనులు పురమాయించారు. దీంతో మంత్రిత్వశాఖలన్నీశంకుస్థాపన పనుల్లో మునిగిపోయూయి.    వందల కోట్ల రూపాయిల్ర ప్రజాధనాన్నివిచ్చలవిడిగా ఖర్చు పెడుతున్న క్రతువులో  జవాబుదారీతనం లేకుండా అన్నీ జరిగిపోతున్నాయి.  
 
 జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి
  ఇప్పుడు శంకుస్థాపన పేరుతో అన్నిజిల్లాల యంత్రాంగానికి పనిపెట్టారు. డిప్యూటేషన్ వీుద చాలా మంది అధికారులు, సిబ్బందిని అక్కడకు తరలించారు  ఇదంతాఒక ఎత్తయితే నెలరోజులుగా ప్రతీచోట నుంచి నీరు, మట్టి సేకరిస్తున్నామని, అఖండ జ్యోతిలను పంపిస్తున్నామని, దేవాలయాల్లో పూజలు చేయిస్తున్నామని ప్రచారం చేశారు.   
 
 అన్నీపెండింగ్
 అసలే రాష్ట్రంలో రెండున్నరలక్షల్రపభుత్వఉద్యోగాలు ఖాళీఉన్నాయి.  ఉన్న సిబ్బంది అదికారుల్నిపూర్తిగా శంకుస్థాపన  వైపుకి మరల్చారు. దీంతో ఎక్కడికక్కడ పనులన్నీ స్తంభించి పోయాయి.  ఒక్క ముఖ్యమంత్రి కార్యాలయంలోనే  దాదాపు 19 వేలదాకా ఫైల్సు నిలిచి పోయాయి. అన్నిమంత్రుల విభాగాల్నికలుపుకొంటే సచివాలయం స్థాయిలో 2 లక్షలదాకా  ఫైల్సు పెండింగ్ లో పడ్డాయి. మరో10, 15 రోజులపాటు ప్రభుత్వ యంత్రాంగం సాధారణ విధుల్లో కుదురుకొనే అవకాశం లేదు. దీంతోఅన్నిచోట్ల సామాన్యుల సమస్యలు అలాగే నిలిచిపోయే పరిస్థితి.  
 
ప్రభుత్వం ముందున్న సవాళ్లు 
 నిత్యావసర వస్తువుల ధరలు చుక్కల్నిఅంటుతున్నాయి. కందిపప్పు, మినపపప్పు ధరలు రికార్డుల్నిబద్దలుకొడుతున్నాయి.  పప్పుదినుసులు నల్లబజారుకు తరలిపోతున్నాయి. పట్టించుకోవాల్సిన పౌరసరఫరాల శాఖ అధికారులు, జాయింట కలెక్టర్ లు పూర్తిగా శంకుస్థాపన భజనలో మునిగి పోయారు. ఖరీఫ్ కు  సంబంధించి ధాన్యం ఇప్పుడిప్పుడు రైతుల చేతికి అందుతోంది. విుల్లర్లు, ట్రేడర్లను పిలిపించి సరైన మద్దతు ధర రైతుకి అందేలాచూడాల్సిన బాధ్యత ప్రభుత్వం వీుద ఉంది. అదేవీు పట్టించుకోకుండా మట్టి కుండల్నిపంపించమని అధికారుల్నిరోడ్డు వీుదకు తరివేుశారు. ఇప్పుడే ధరవరలవీుద పట్టు బిగిస్తే రైతులకు అన్యాయం జరగకుండా నివారించవచ్చు. గతంలో పొగాకు చేతికి అందే సమయానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఎంత మొత్తుకొన్నా వినలేదు. పుష్కరాల్ని సినిమా స్థాయిలో జరిపించేందుకు యంత్రాంగం మొత్తాన్నిఅక్కడ వెూహరింప చేశారు. ఫలితంగా పొగాకు రైతులు ఆత్మహత్యల బాట పట్టారు. ఇప్పుడు వరిపండించే రైతులకు అదే శాపం వెంటాడబోతోంది. వైద్య ఆరోగ్యశాఖ గురించి తక్కువ మాట్లాడుకోవటం వేులు. సీజన్ మారుతున్నప్పుడు అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. డెంగీ, వైరల్ జ్వరాలు పీడిస్తున్నాయి.   వీటిని పట్టించుకోవాల్సిన వైద్యఆరోగ్య మంత్రి పూర్తిగా చంద్రబాబు భజన శాఖ మంత్రిగా స్థిరపడి పోయారు. దీంతో ఆయన శాఖ కు పూర్తిగా అస్వస్థత చేకూరిందనే చెప్పాలి.       

No comments:

Post a Comment